Bombay HC allows woman's plea on father's second marriage తండ్రి రెండో పెళ్లిని కూతురు ప్రశ్నించోచ్చు: హైకోర్టు

Bombay high court allows woman s plea on father s second marriage

Bombay High Court, Fathers. second marriage, Hindu Succession Act, heirs, Father, Justice RD Dhanuka, Justice VG Bisht, Bombay HIgh Court, family court

The Bombay High Court has held that a daughter can question in court the validity of her father's second marriage. In a judgement pronounced on Wednesday, a bench of Justices RD Dhanuka and VG Bisht allowed the plea filed by a 66-year-old woman challenging a family court order that held only parties to a marriage could challenge the validity of the marriage.

తండ్రి రెండో పెళ్లిని కూతురు ప్రశ్నించోచ్చు: హైకోర్టు

Posted: 03/20/2021 04:15 PM IST
Bombay high court allows woman s plea on father s second marriage

తండ్రి రెండో పెళ్లి చెల్లుబాటుపై కోర్టులో ప్రశ్నించే అధికారం కూతురుకి ఉందని బోంబే హైకోర్టు స్పష్టం చేసింది. తన తండ్రి రెండో వివాహం విషయమై ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేసిన ఓ 66 ఏళ్ల కూతురు పిటీషన్ పై విచారించిన రాష్ట్రోన్నత న్యాయస్థానం.. బాంబే హైకోర్టు.. కూతురిగా తండ్రి రెండో వివాహం చెల్లుబాటు విషయమై ప్రశ్నించే అధికారం తనయకు ఉంటుందని తీర్పును వెలువరించింది. వివాహం అనేది ఇద్దరు వ్యక్తులకు చెందినది కాబట్టి భార్య, లేదా భర్త మాత్రమే కోర్టులో దాని చెల్లుబాటుని ప్రశ్నించాలంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పుని తోసిపుచ్చింది.

బాంబే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ పిటీషన్ పై విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌డి ధనూక, జస్టిస్‌ విజీ బిషత్ లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఓ కూతురుకి.. తన తండ్రి రెండో వివాహం చెల్లుబాటుపై ప్రశ్నించే అధికారం వుందని 66 ఏళ్ల మహిళ వేసిన పిటీషన్ ను సమర్థించింది. తన తండ్రి 2003లో తన తల్లి మరణించిన తరువాత రెండో వివాహం చేసుకున్నాడని, అయితే అతను 2016లో చనిపోయిన తరువాత ఆయన రెండో భార్య తన మొదటి భర్త నుండి విడాకులు పోందలేదని తెలిసిందని, ఈ క్రమంలో తాను తన తండ్రి రెండో వివాహం చెల్లుబాటుపై ప్రశ్నించదలిచానని పిటీషన్ వేసింది.

ఈ పిటీషన్ పై ఫ్యామిలీ కోర్టు.. వివాహం అన్నది ఇద్దరు వ్యక్తులకు మాత్రమే ముడిపడిన ఆంశమని.. భర్త లేదా భార్య తేల్చి మాత్రమే కోర్టులో దాని చెల్లుబాటుని ప్రశ్నించాలంటూ ఫ్యామిలీ కోర్టు తీర్పును వెలువరించింది. దీనిని సవాలు చేస్తూ అమె బాంబే హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కన్న కూతురిగా తండ్రి రెండో పెళ్లిని ప్రశ్నించే అధికారం ఆమెకు ఉందని తేల్చి చెప్పింది. తన తండ్రి ఆస్తులన్నీ సవితి తల్లే అనుభవిస్తుందని.. అసలు ఈ వివాహం ఎలా చెల్లుబాటు అవుతుందని ప్రశ్నించింది. ఫ్యామిలీ కోర్టు తీర్పుని సవాల్‌ చేస్తూ ఆ కూతురు బాంబే హైకోర్టుకి వెళ్లగా అక్కడ ఆమెకి ఊరట లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles