మహమ్మారి కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. ప్రపంచదేశాలతో పాటు పాకిస్తాన్ లోనూ కోరలు చాస్తోంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తాజాగా కరోనా బారిన పడ్డారు. ఆయనను పరీక్షీంచిన వైద్యులు ఆయనకు కరోనా పాజిటివ్ అని తేల్చారు. అదెలా సాధ్యం.. కరోనా టీకా తీసుకున్న వ్యక్తులు కరోనాను ఎదుర్కొనే ఇమ్యూనిటీ వుంటుంది కదా.? మరి ఇమ్రాన్ ఖాన్ కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు కదా.? మరి ఆయనకు కరోనా ఎలా సోకింది. ఆయన కరోనా బారిన పటడానికి కారణలేంటి.? అన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది.
పాకిస్థాన్ ప్రధానికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన తీసుకున్న కరోనా టీకా గురించి ఆరా తీస్తున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆయన ఏ వాక్సీన్ తీసుకున్నారన్న విషయం తెలిస్తే తాము ఆ వాక్సీన్ కు దూరంగా వుండవచ్చునన్న యోచనలో ఇప్పుడు యావత్ ప్రపంచం ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక టీకా తీసుకున్న తర్వాత పాజిటివ్ రావడం విస్మయం కలిగిస్తున్నా.. ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారన్న విషయంపై కూడా చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ అంశం పాకిస్తాన్ లో కలకలం రేపుతోంది. ఇమ్రాన్ ఖాన్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యిందని పాక్ వైద్య శాఖ మంత్రి ఫైజల్ సుల్తాన్ ప్రకటించారు.
ఇంట్లోనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు అని సుల్తాన్ తెలిపారు.అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజులకే ఆయనకు పాజిటివ్ రేపడం ఆందోళన కలిగిస్తోంది. అయితే చైనాకు సంబంధించిన వ్యాక్సిన్ ‘సినోవక్’ వ్యాక్సిన్ తొలి డోసు ఇమ్రాన్‌ఖాన్ తీసుకున్నారు. ప్రజలందరూ కూడా వ్యాక్సిన్ పొందాలని సూచించారు. ప్రధానమంత్రి కార్యాలయం కూడా అధికారికంగా తెలిపింది. అయితే పాకిస్తాన్ ప్రధానికి పాజిటివ్ రావడం.. చైనా వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం కరోనా సోకడంతో సోషల్ మీడియాలో ఫన్నీగా కామెంట్లు వస్తున్నాయి. చైనా వస్తువుల మాదిరి వ్యాక్సిన్ కూడా నాసిరకం అని కామెంట్స్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jul 01 | రాష్ట్రంలో ఆన్లైన్ సినిమా టికెట్ల విధానం అమలు చేయాలని కృతనిశ్చయంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్ సర్కారుకు చుక్కెదురైంది. జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 69పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం... Read more
Jul 01 | ఐబిపిఎస్ (IBPS) క్లర్క్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న 6035 క్లర్క్‌ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి... Read more
Jul 01 | తన కారు డ్రైవర్ హత్యాభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ను న్యాయస్థానం మరోమారు పొడిగించింది. గత మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు రిమాండ్ గడువు నేటితో... Read more
Jul 01 | మారుతున్న పనివేళలు, ఉద్యోగ కల్పన ఇత్యాదుల నేపథ్యంలో నూతన కార్మిక చట్టాలను తీసుకురావాలని కేంద్రప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జులై 1 నుంచి ఈకొత్త కార్మికచట్టాలను అమలుపర్చాలని చేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది.... Read more
Jul 01 | మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఎట్టకేలకు ముగిసి.. శివసేన రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్ న్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నావిస్ ఢిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఈ తరుణంలో.. ప్రజలకు... Read more