SEC seeks CBI probe on Raj Bhavan leaked info రాజ్ భవన్ నుంచి సమాచారం లీక్: సీబిఐ విచారణ కోరిన ఎస్ఈసీ

Sec files petition in hc seeking cbi probe into leaked info from guv s office

SEC seeks CBI probe, SEC governor office info leakage, SEC petition in High Court, SEC, Minister Botsa Satyanarayana, State Election Commissioner, Nimmagadda Ramesh, AP High Court, AP Governor, CBI probe, Raj Bhavan, Andhra Pradesh, Politics

State Election Commissioner Nimmagadda Ramesh Kumar has filed a petition in the High Court seeking CBI probe into the leaked information from the Governor’s office. In the petition, he brought to the notice of the High Court that privilege letters written by him to the Governor should be kept confidential.

గవర్నర్ కార్యాలయం నుంచి సమాచారం లీక్: సీబిఐ విచారణ కోరిన ఎస్ఈసీ

Posted: 03/20/2021 01:33 PM IST
Sec files petition in hc seeking cbi probe into leaked info from guv s office

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ‌వ‌ర్నర్, త‌న‌కు మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ సమాచారం లీక్ కావడంపై విస్మయం వ్యక్తం చేసిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. తాను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో ముఖాముఖీగా జరిగిన సంబాషణ ఏకంగా గవర్నర్ కార్యాలయం నుంచే లీక్ కావడంపై ఆయన రాష్ట్ర హైకోర్టులో పిటిష‌న్ వేశారు. గ‌వ‌ర్న‌ర్ తో పంచుకున్న అత్యంత కీల‌క స‌మాచారం లీక్ అయింద‌ని తన పిటీషన్ లో పేర్కోన్నారు. ఆ స‌మాచారం గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం నుంచి బ‌య‌ట‌కు రావ‌డంపై సీబీఐ ద‌ర్యాప్తున‌కు ఆదేశించాల‌ని పిటిష‌న్ లో కోరారు.

తన పిటీషన్ లో ప్ర‌తివాదులుగా రాష్ట్ర ముఖ్యకార్యదర్శి ఆధిత్యనాథ్ దాస్, గ‌వ‌ర్న‌ర్ ముఖ్యకార్య‌ద‌ర్శితో పాటు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ పేర్లను చేర్చారు. అయితే, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ వేసిన పిటిష‌న్ ను వేరే బెంచ్‌కు బ‌దిలీ చేస్తూ హైకోర్టు నిర్ణ‌యం తీసుకుంది. ఇదిలావుండగా గవర్నర్ తో కీలకమైన సమావేశానికి శుక్రవారం రాజ్ భవన్ కు రావాల్సిందిగా అదేశాలు వచ్చినా ఆయన హైదరాబాదుకు వెళ్లడం చేత సమావేశానికి హాజరుకాలేకపోయారు.

అయితే ఈ సమావేశంలో రాష్ట్రంలో నిర్వహించాల్సిన పరిషత్ ఎన్నికల విషయమై చర్చించేందుకని సమాచారం. మ‌రోవైపు, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలు నిర్వహణ విషయమై రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో తీర్పు రిజర్వు చేయబడింది. రాష్ట్రంలో మండల. జిల్లా పరిషత్ ఎన్నికలను నిర్వహించాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై కూడా హైకోర్టులో విచారణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఎన్నికల కమీషన్ తరఫు న్యాయవాది అశ్విన్ కుమార్.. త‌మ వాద‌న‌లు వినిపిస్తూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే పిటిషన్‌ దాఖలు చేయడం సరికాదని చెప్పారు.

ఎన్నికల పరిశీలన దశలోనే పిటిషన్‌ దాఖలు చేయడం తొందపాటు చర్య అని తెలిపారు. పరిషత్‌ ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ పరంగా ఎన్నికల కమీషన్ బాధ్యత అని చెప్పారు. ఎన్నికలను నిర్వహించే అంశాన్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నామని తెలిపారు. కాగా పరిషత్ ఎన్నికల నేపథ్యంలోనూ ఎన్నికల కమీషన్ నూతన నోటిఫికేషన్ ఇవ్వకుండా రీ-నోటిఫికేషన్ మాత్రమే ఇస్తుందని ఎన్నికల కమీషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. హైకోర్టు విచారణను ముగించి, తీర్పును రిజర్వు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SEC  Nimmagadda Ramesh  AP High Court  AP Governor  CBI probe  Raj Bhavan  Andhra Pradesh  Politics  

Other Articles