Rs 11.5 cr cash seized in raids at MNM treasurer's property కమల్ ఎంఎన్ఎం పార్టీకి ఇబ్బందికర పరిణామం.!

I t recovers rs 11 50 crore in raids at premises of mnm treasurer

Tamil nadu, MNM, kamal haasan, Makkal Needhi Maiam , income tax department, raids, tax raids, mnm treasurer, mnm raids

The Income Tax Department has recovered Rs 11.50 crore in cash and detected unaccounted income to the tune of Rs 80 crore during searches at the premises belonging to a Tiruppur-based businessman, who is also treasurer of actor Kamal Haasan's Makkal Needhi Maiam (MNM).

కమల్ ఎంఎన్ఎం పార్టీకి ఇబ్బందికర పరిణామం.!

Posted: 03/20/2021 12:15 PM IST
I t recovers rs 11 50 crore in raids at premises of mnm treasurer

సినీరంగం నుంచి రాజకీయ అరంగ్రేటం చేస్తూ.. అవినీతి రహిత సమాజం పేరుతో తమిళనాడు రాజకీయ రణక్షేత్రంలో దసుకుపోతున్న ప్రఖ్యాత నటుడు కమల్‌ హాసన్ సారథ్యంలోని మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ ఇరకాటంలో పడింది. తమిళనాడుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త.. ఎంఎన్ఎం పార్టీ కోశాధికారిగా వ్యవహరిస్తున్న చంద్రశేఖర్ పై పలు అవినీతి ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై అదాయపన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహించడంతో ఏకంగా రూ.80 కోట్ల రూపాయల లెక్కల్లోకి రాని డబ్బు అతని వద్ద వుందని అధికారులు తేల్చారు.

ఇదే సమయంలో లెక్కల్లో లేని రూ. 11.5 కోట్ల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చంద్రశేఖరన్ కు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై తిరుప్పూర్ లో దాడులు కోనసాగిస్తున్న అధికారులు అదే సమయంలో ధరాపురం, చెన్నై సహా ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. చంద్రశేఖరన్ సంస్థ ధరాఘాతం ప్రభావంతో లాభాలను తక్కువగా చూపుతూ లెక్కలోకి రాని నగదును వెనకేసుకుంటోందని అధికారులు తేల్చారు. ఇక ఇలా అర్జించిన డబ్బును ఆ సంస్థ వ్యాపార విస్తరణతో పాటు భూముల కోనుగోళ్లపై పెడుతోందని తెలిపారు.

కరోనా కాలంలో ప్రభుత్వం మాస్క్ లు, పీపీఈ కిట్లను చంద్రశేఖర్ కు చెందిన అనితా టెక్స్ కార్ట్‌ ఇండియా నుంచి సుమారు రూ.450 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ధరాఘాతంతో వల్ల తాము కోన్న ముడిసరుకు ధర పెరిగిందని చూపిన ఈ సంస్థ వచ్చిన లాభాలను లెక్కల్లో రాని నగదుగా మార్చిందని, ఇలా ఏకంగా రూ.80 కోట్ల పై ఐటీ దాడులు చేయడంతో విషయం బట్టబయలైంది. అలాగే ఈ సంస్థలో రూ.11కోట్ల లెక్కలో లేని నగదు స్వాధింన చేసుకున్న అధికారులు.. మరింత లోతుగా తనిఖీలను చేస్తున్నారు. కాగా అవినీతి రహిత సమాజం పేరుతో వచ్చిన కమల్ హాసన్ పార్టీలోని కోశాధికారే అవినీతికి పాల్పడటం పార్టీకి ఇబ్బందికర పరిణామాన్ని తెచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles