Complainant in Jarkiholi CD case goes missing మంత్రి రాసలీల కేసులో ట్విస్టు.. పిర్యాదు ఉపసంహరణ

Activist withdraws complaint that led to ramesh jarkiholi s resignation

ramesh jarkiholi, jarkiholi sex cd, Dinesh Kalahalli, social activist, Siddaramaiah, television channels, Cubbon Park police, government job, bs yediyurappa, karnataka govt, congress, JDU, Shivakumar, Kumaraswamy, Karnataka, Politics, Crime

Dinesh Kalahalli, a self proclaimed social activist, withdrew his earlier complaint of sexual harassment and exploitation against BJP legislator and former Karnataka minister Ramesh Jarkiholi. In a letter to the Cubbon Park police station, Kalahalli said that the complaint had taken a sinister turn wherein the character of the alleged victim was being questioned.

మంత్రి రాసలీల కేసులో ట్విస్టు.. పిర్యాదు ఉపసంహరణ

Posted: 03/08/2021 01:33 PM IST
Activist withdraws complaint that led to ramesh jarkiholi s resignation

కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి లైంగిక వేధింపుల కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో మంత్రిపై పిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త తన పిర్యదును ఉపసంహరించుకున్నారు. తన ఫిర్యాదుతో బాధితురాలి పరువు, ప్రతిష్ఠలకు భంగం వాటిల్లుతుండడంతో ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని సామాజిక కార్యకర్త దినేశ్ కలహళి తెలిపారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది నిన్న కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌‌కు వెళ్లి దినేశ్ సంతకం చేసిన లేఖను అందించారు. ఈ నెల 2న రమేశ్ జార్కిహోళిపై చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్టు అందులో పేర్కొన్నారు.  

ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని దినేశ్ నిర్ణయించుకున్నారని, ఈ మేరకు ఆయన సంతకం చేసి ఇచ్చిన లేఖను పోలీసులకు అందించినట్టు న్యాయవాది ఎస్‌కే పాటిల్ తెలిపారు. ఆయన త్వరలోనే పోలీసులను కలిసి అన్ని వివరాలు వెల్లడిస్తారని పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు దినేశ్ లొంగబోరని పేర్కొన్న పాటిల్..  బాధితురాలికి న్యాయం జరిగేలా చూడడమే ఆయన లక్ష్యమన్నారు. సామాజిక మాధ్యమాల్లో బాధితురాలి ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతోందని, అది మరింత తీవ్రంగా మారకముందే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.

ఈ కేసులో అవసరమైన సమాచారాన్ని పోలీసులకు అందించేందుకు దినేశ్ సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఉద్యోగం పేరుతో మాజీ మంత్రి రమేశ్ ఓ మహిళను లైంగికంగా వాడుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలోనూ, టీవీ చానళ్లలోనూ ప్రసారమైంది. తన ఫొటోను వాడుకుని ఈ వీడియోను చేశారని తొలుత ఆరోపించిన రమేశ్ జార్కిహోళి ఈ నెల 3న తన పదవికి రాజీనామా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles