Chandrababu controversial comments in Guntur గుంటూరులో వివాదాస్పదమైన చంద్రబాబు వ్యాఖ్యలు

Chandrababu comments turn controversial in guntur election campaign

TDP President, Chandrababu, Election code, controversial comments, Muncipal Elections, Guntur election Campaign, Andhra Pradesh, Politics

TDP national president N Chandrababu Naidu on Monday took part in campaign for municipal elections in Guntur. During his speech, he asked the people of Guntur city not to allow the YSRCP activists to campaign for their party in the municipal elections.

ITEMVIDEOS: గుంటూరు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు రెచ్చగోట్టే వ్యాఖ్యలు

Posted: 03/08/2021 02:19 PM IST
Chandrababu comments turn controversial in guntur election campaign

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గుంటూరులో చేసిన వ్యాఖ్యలు ఇప్పడు వివాదాస్పదం అవుతున్నాయి, గుంటూరు యువతను రెచ్చగొట్టేలా ఆయన వ్యాక్యలు చేశారని రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు కూడా పిర్యాదులు వెళ్లాయి. రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతగా, ఏపీకి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సేవల అందించిన నేత.. మునుపెన్నడూ లేని విధంగా.. హుషారెత్తించే ప్రసంగాలకు బదులు రెచ్చగోట్టే ప్రసంగాల దిశగా తన పంథాను మార్చారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆయన ఇదే తరహాలో ఓటర్లను ఓట్లు అభ్యర్థించేందుకు బదులు తమ పార్టీకే వేయాలన్న డిమాండను వారిముందుంచారు. అదెలా అంటే.. ‘‘ మా ప్రభుత్వం పథకాలు మీకు కావాలంటే.. మాకే ఓటు వేయాలని..’’ ఆయన ఓటర్లను కోరారు. ఇక తాజాగా గుంటూరులో ఆయన మహిళా దినోత్సవం రోజున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా.. గుంటూరు వాళ్లకు సిగ్గు వుంటే.. వైసీపీ వాళ్లెవరైనా జెండా పట్టుకుని తిరగగలరా.? అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గుంటూరులో యేువకులంతా చేవచచ్చిపోయారని, మీలో రోషం లేదా.? అని ప్రశ్నించారు. ఉంటే ఎన్ని కేసులు పెడతరో పెట్టుకోమనండీ.. ఎన్ని కేసులు పెడతారు.. నేను చూస్తాను.. అంటూ రెచ్చిగోట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో మీరు బతికున్నా.. లేనట్టేనని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. అదే సమయంలో రాష్ట్రంలో అధికార పార్టీకి నాయకుడైన ఓ నేరస్థుడిని చూస్తుంటే గుంటూరు యువతలో వణుకు పుడుతోందని ఘాటువ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలు దుర్గమ్మ తల్లి దర్శనానికి వెళ్తే.. పోలీసులు వారిని అరెస్టు చేయడం.. ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇదేనా ముఖ్యమంత్రి రాష్ట్ర అఢపడచులకు ఇచ్చే కానుక అని చంద్రబాబు ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles