Police Officials change drunk and drive check timings హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రవ్ తనిఖీ వేళల్లో మార్పులు..

Amid traffic jam complaints police officials change drunk and drive check timings

drunk and drive tests cause traffic jams in city, drunk and drive tests, traffic jam on highways, Hyderabad Police Officials change drunk and drive check timings, traffic jam complaints police officials, , Crime

Amid Traffic Jam complaints from all soughts of people during the evening timings, Hyderabad Police Officials change drunk and drive check timings from night 9.30 onwards in the City.

హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రవ్ తనిఖీ వేళల్లో మార్పులు..

Posted: 03/05/2021 12:59 PM IST
Amid traffic jam complaints police officials change drunk and drive check timings

హైదరాబాద్ నగరంతో పాటు అటు రాచకొండ, ఇటు సైబరాబాద్ కమీషనరేట్ ప్రాంతాల్లో రోజురోజుకీ ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. మెట్రో రైలు వచ్చి ట్రాపిక్ సమస్యను కొంతవరకు తీర్చినా.. నానాటికీ పెరుగుతున్న కార్లు, ద్విచక్ర వాహనాల నేపథ్యంలో ట్రాపిక్ సమస్య మరింత అధికం అవుతోంది. ఇక ఈ క్రమంలోనూ అన్నింటికీ రాజీపడుతూ వెళ్తున్న వాహనదారులకు పోలీసుల డ్రంక్ అండ్ డ్రవ్ తనిఖీలు మరో శరాఘాతంగా పరిణమించాయి. ప్రతీ వారంతంలోని గురు, శుక్ర, శనివారాల్లో పోలీసులు ఎక్కడికక్కడ తమ పోలిస్ స్టేషన్ల పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

అయితే ఉదయం కార్యాలయాలకు, ఇతర వ్యాపార వ్యవహారాలపై బయటకు వెళ్లి రాత్రికి తిరిగి గూటికి చేరుకునే క్రమంలో పోలీసుల తనిఖీలు వాహనదారులను ఇబ్బందులు పెడుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు అనేక చోట్లు ఈ తనిఖీలు జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు ఇళ్లకు చేరుకునేందుకు మరింత అధిక సమయం పడుతోంది. ఈ మేరకు పోలీసుల ఉన్నతాధికారులకు అన్ని వర్గాల ప్రజల నుంచి పిర్యాదులు వెళ్లాయి. దీంతో వారు కూడా ట్రాఫిక్ సమస్యలను ఆలకించారు. దీనికి ప్రధాన కారణంగా మారిని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల నిర్వహణ వేళల్లో మార్పులను తీసుకువచ్చారు.

దీంతో ఇకపై వారంతాలతో పాటు ఆయా పోలీసు అధికారుల నిర్ణయాన్ని బట్టి ప్రతీ రోజు రాత్రి 9 గంటల్లోపు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించేందుకు సరైన సమయం కాదని భావించిన ట్రాఫిక్ విభాగం, 7 తరువాత ఎక్కడెక్కడ డ్రైవ్ లను జరిపారన్న విషయాన్ని ఆరా తీశారు. కొంతమంది ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహంతో ఈ పని చేసి ఉంటారని భావిస్తూ, రాత్రి 9.30 గంటల తరువాతనే పరీక్షలు చేయాలని గురువారం నాడు ఆదేశాలు జారీ చేశారు. మందుబాబులు కూడా 10 గంటల తరువాతనే రోడ్లపైకి వస్తారన్న అంచనాతోనే, అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో రాత్రి 9.30 తరువాతే డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించాలని ఆదేశించామని ఉన్నతాధికార వర్గాలు వెల్లడించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles