‘Metro Man’ E Sreedharan to be BJP’s CM candidate కేరళ సీఎం అభ్యర్థి మెట్రో మ్యాన్ శ్రీధరన్: బీజేపి వెల్లడి

Metro man sreedharan to be bjp s chief ministerial candidate for kerala

Metro Man’ E Sreedharan BJP’s CM candidate, DMRC, E Sreedharan, Kerala Assembly Polls, kerala assembly polls 2021, Metro Man, kerala, Politics

Metro Man’ E Sreedharan, who recently joined the Bharatiya Janata Party (BJP) ahead of Kerala Assembly polls, will be the party’s pick for the chief minister, state chief K Surendran said. Earlier, Sreedharan had said that would be his last day in DMRC uniform.

కేరళ సీఎం అభ్యర్థి మెట్రో మ్యాన్ శ్రీధరన్: బీజేపి వెల్లడి

Posted: 03/04/2021 03:02 PM IST
Metro man sreedharan to be bjp s chief ministerial candidate for kerala

నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతంలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఎక్కడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించని బీజేపి.. కేరళ రాష్ట్రంలో మాత్రం తమ ఉనికిని చాటుకునేందుకు కసరత్తును తీవ్రం చేసింది. పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పే కమలధళం నేతలు.. కేరళలో మాత్రం అందుకు భిన్నంగా ప్రయత్నాలను పెట్టారు. ఈ రాష్ట్రంలో ఎలాగో పెద్దగా ఉనికి లేని బీజేపి.. ఇక్కడ గత ఎన్నికలలో శ్రీకాంత్ ఇమేజ్ ను వాడుకున్నా పెద్దగా లాభం లేకపోవడంతో.. ఈ సారి మెట్రో మ్యాన్ ఇమేజ్ ను వినియోగించుకోవాలని భావిస్తోంది.

ఇందులో భాగంగా తమ పార్టీ కేరళలో విజయం సాధిస్తే మెట్రోమ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు అందుకున్న రిటైర్డ్ ఇంజినీర్ శ్రీధరన్ కే ముఖ్యమంత్రి పగ్గాలను అందిస్తామని బీజేపి కేరళ రాష్ట్ర శాఖ వెల్లడించింది. దీంతో ఆయన ప్రతిష్టపైనే కేరళ రాష్ట్రంలో గెలుపుపై ఆధారపడిన బీజేపి.. తమ ఉనికి చాటుకునేందుకు ఈ ప్రయత్నాలను తెరపైకి తీసుకువచ్చింది. ఈ మేరకు కేరళ బీజేపీ చీఫ్ కె.సురేంద్రన్ వెల్లడించారు. 88 ఏళ్ల శ్రీధరన్ గత నెల 25న కేంద్రమంత్రి ఆర్కే సింగ్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మలప్పురం జిల్లాలోని చంగరంకులమ్ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన బీజేపిలో చేరారు.

మెట్రోమ్యాన్ గా గుర్తింపు తెచ్చుకుని ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ లో ఇవాళ తన చివరి విధులను  నిర్వర్తించిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఇవాళ తన విధులకు రాజీనామా చేసిన తరువాత తాను తన నామినేషన్ పత్రాలను సమర్పిస్తానని అన్నారు. ఇక తాను ఎమ్మెల్యే పదవిలో వున్నా.. మెట్రో రైల్  విధుల్లో  వున్నా కొనసాగుతున్న ప్రాజెక్టులను పర్యవేక్షించడమే తన విధిగా చెప్పుకోచ్చారు. ముఖ్యమంత్రి పీఠం అప్పగిస్తే బాధ్యతలు నిర్వర్తించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు.

అయితే ఇన్నాళ్లు తాను సేవ చేసిన సంస్థ డిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ లో ప్రస్తుతం ఆయన పాలరివత్తమ్ ఫ్లైఓవర్ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ చివర రోజు కావడంతో తాను నవంబర్ 1997లో ధరించిన ఢిల్లీ మెట్రో రైల్ దుస్తుల్ని దాదాపు 24 ఏళ్ల తరువాత విడుస్తున్నానని అన్నారు. ఇగవర్నర్ పదవిపై ఆసక్తి లేదన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం 16 మంది సభ్యుల ఎన్నికల కమిటీలో శ్రీధరన్ కు స్థానం కల్పించింది. శ్రీధరన్ రాక కేరళలో బీజేపీకి ఊపునిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే వేళ్లూనుకుని ఉన్న వామపక్ష, కాంగ్రెస్ కూటములను ఎదుర్కొనేందుకు ఈసారి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DMRC  E Sreedharan  Kerala Assembly Polls  kerala assembly polls 2021  Metro Man  kerala  Politics  

Other Articles