Hyderabad techie attacked with a knife by stalker ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రియురాలిపై కత్తితో దాడి

Man attacks techie in hyderabad for rejecting marriage proposal

Hyderabad stalker kills woman, Hyderabad techie attack, Man attacks techie in Hyderabad, Woman attacked in Hyderabad, Hyderabad woman, techie, Attacked, Stalker, Telangana, Hyderabad Police, Narsangi, BJP, Stalking, Attack on Women, Hyderabad, Telangana, Crime

A female software engineer was injured when a man allegedly attacked her using a knife, at her residence in Hyderabad, for turning down his marriage proposal, police said. She has been admitted to a hospital with multiple cut injuries and was out of danger, they added.

ITEMVIDEOS: హైదరాబాద్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రియురాలిపై కత్తితో దాడి

Posted: 03/03/2021 11:50 AM IST
Man attacks techie in hyderabad for rejecting marriage proposal

ఒకనాటి ప్రేమ తాను ప్రేమించిన వ్యక్తి సుఖాన్ని కోరుకునేది.. కానీ ఇప్పటి ప్రేమ తన ప్రేమను అంగీకరించికపోయినా.. దూరం పెట్టినా ప్రతికారంతో రగలిపోయేదిగా మారింది. ప్రేమ గుడ్డిది అన్న మాటలను నిజం చేస్తూ ఎవరో ఒక మంచి జంట వారి వ్యక్తిత్తాలు, మనత్తత్వాలు కలిసి ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో.. అదే తరహాలో తన ప్రేమ కూడా వికసించాలని తారతమ్యాలు మరచిన ఓ యువకుడు ఊచలు లెక్కపెడుతున్నాడు. తనతో స్నేహంగా మెలిగిన యువతికి తన ప్రేమ విషయం చెప్పి తిరస్కరణకు గురయ్యాడు. అయితే అక్కడితో ఊరుకోకుండా అమెపై ద్వేషంతో రగలిపోయాడు. దీంతో ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.

ప్రమోన్మాది కత్తి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. హైదరాబాద్‌లోని హైదర్షాకోట్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా నివసించే యువతి (29) ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తోంది. అదే ప్రాంతంలో ఓ ప్రముఖ సంస్థకు చెందిన హెయిర్ కటింగ్ సెలూన్ లో పనిచేసే హర్యానాకు చెందిన షారూఖ్ సల్మాన్‌ (29)తో ఆమెకు పరిచయం ఉంది. అదే సెలూన్ షావుకు వెళ్లే అమెతో సల్మాన్ కు పరిచయం పెంచుకునేవాడు. అయితే అతనితో యువతి కూడా కాస్తా స్నేహంగా మెలిగుతూ మాట్లాడేది.

అయితే, సదరు యువతికి ఇటీవల పెళ్లి సంబంధం కుదిరింది. మే నెలలో పెళ్లి కూడా నిశ్చయమైంది. దీంతో యువతి అతడిని దూరం పెట్టింది. దీనిని తట్టుకోలేకపోయిన సల్మాన్ గత రాత్రి ఏడున్నర గంటల సమయంలో యువతి ఇంటికి వెళ్లి కత్తితో దాడికి తెగబడ్డాడు. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో పారిపోయే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన స్థానికులు అతడ్ని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కత్తి దాడిలో గాయపడిన యువతిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. యువతికి వీపు భాగంలో గాయాలయ్యాయని, కోలుకుంటోందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles