Minister Ramesh Jarkiholi 'features' in sex tape బీజేపి మంత్రి రాసలీల వీడీయో రచ్చ.. రాజీనామాకు విపక్షాల డిమాండ్

Fresh trouble for bsy govt ramesh jarkiholi caught in a sex cd scandal

ramesh jarkiholi, jarkiholi sex cd, Dinesh Kalahalli, social activist, Siddaramaiah, television channels, Cubbon Park police, government job, bs yediyurappa, karnataka govt, congress, JDU, Shivakumar, Kumaraswamy, Karnataka, Politics, Crime

The ruling BJP in Karnataka found itself mired in a controversy Tuesday with a video CD allegedly featuring Water Resources Minister Ramesh Jarkiholi and a young unidentified woman, and audio conversations between the two, being played on television channels.

ITEMVIDEOS: బీజేపి మంత్రి రాసలీల వీడీయో రచ్చ.. రాజీనామాకు విపక్షాల డిమాండ్

Posted: 03/03/2021 11:45 AM IST
Fresh trouble for bsy govt ramesh jarkiholi caught in a sex cd scandal

ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపి ఎమ్మెల్యేలు దళిత యువతులపై అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనలతో పాటు అగ్రవర్ణాలకు చెందిన వారు కూడా దళిత యువతులపై దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చుతుండగా, ఇటు కర్ణాటకలో ఏకంగా బీజేపి మంత్రివర్యులే మహిళలకు ఉద్యోగాల పేరుతో లోబరుచుకున్న ఘటనలతో రచ్చరచ్చ జరుగుతోంది. కర్ణాటకకు చెందిన మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల వీడియో ఒకటి కర్ణాటకలో కలకలం రేపుతోంది. దీంతో మంత్రివర్యుడిపై తక్షణం చర్యలు తీసుకోవాలని విపక్షాలతో పాటు మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.

ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన మంత్రి తనను లైంగిక అవసరాలకు వాడుకున్నారని ఓ మహిళ ఆరోపించడంతో పాటు ఏకంగా మంత్రి తనతో ఏకాంతంగా గడిపిన దృశ్యాల వీడియోను సమాచార హక్కు చట్టం కార్యకర్త దినేశ్ కల్లహళ్లికి అందించారు. దీంతో ఆయన ఆ వీడియో సీడీని కొన్ని టీవీ చానళ్లకు పంపించారు. మహిళను మోసగించిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని, తనకు, బాధిత మహిళకు రక్షణ కల్పించాలని బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్‌పంత్‌ను దినేశ్ కోరారు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

తన రాసలీలల వీడియోపై మంత్రి స్పందించారు. ఆ సీడీలో ఉన్నది తాను కాదని, తన ఫొటోలను ఉపయోగించి ఎవరో ఈ సీడీని రూపొందించారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపితే అసలు విషయం వెలుగులోకి వస్తుందని అన్నారు. కేసును ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మరోవైపు, మంత్రి తప్పు చేసినట్టు రుజువైతే కఠిన చర్యలు తప్పవని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు గత రాత్రి బెంగళూరులో ధర్నా నిర్వహించారు.
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles