Rs 7.90 cr. of fake notes seized in Odisha, 3 held నకిలీ కరెన్సీని తరలిస్తున్న ఇంజనీర్.. పోలీసుల అదుపులో..

Engineer and two others held in transporting 7 90 crore fake notes

counterfeit notes, odisha, raipur, chhattisgarh, Visakhapatnam, Koraput, Odisha-Andhra Pradesh border, Varun Guntupalli, SP koraput, Andhra Pradesh, Crime

Counterfeit notes with a face value of ₹7.90 crore were seized from a car in Odisha’s Koraput district on the Odisha-Andhra Pradesh border and three persons arrested. During regular vehicle checking at the Sunki post on our border, we found four trolley bags from a hatchback car bearing Chhattisgarh number.

నకిలీ కరెన్సీని తరలిస్తున్న ఇంజనీర్.. పోలీసుల అదుపులో..

Posted: 03/03/2021 01:03 PM IST
Engineer and two others held in transporting 7 90 crore fake notes

ఆంధ్రప్రదేశ్-ఒడిశా రాష్ట్రాల సరిహద్దులోని చెక్ పోస్టు వద్ద గస్తికాస్తున్న పోలీసులు ఒడిశా నుంచి విశాఖపట్నం వైపుకు వెళ్తున్న ఓ కారు నిలిపి వీళ్లు గంజాయిని ఏమైనా తరలిస్తున్నారా అన్న అనుమానంతో చెక్ చేయగా.. వారికి కళ్లు చెదిరే కరెన్సీ కట్టలు కనిపించాయి. ఒడిశాలో కలర్ జిరాక్స్ తీసి విశాఖపట్నానికి తరలిస్తున్న రూ.7.90 కోట్ల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో కీలక వ్యక్తిగా భావిస్తున్న ఓ ఇంజనీర్ సహా మరో ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఒడిశాలోని రాయ్ పూర్ లో తయారు చేసిన ఈ నోట్లను అనేక చెక్ పోస్టులు దాటించి చివరకు చిట్టచివరిదైన సుంకీ చెక్ పోస్టు వద్ద అడ్డంగా దొరికిపోయారు. చత్తీస్ గడ్ రిజిస్ట్రేషన్ నెంబరుతో వున్న ఈ కారును అన్ని చెక్ పోస్టులను ఎలా మ్యానేజ్ చేశారో తెలియదు కానీ సుంకీ వద్ద అగంతకులు అడ్డంగా బుక్ అయ్యారు. ఈ కారు రాకను గమనించిన పోలీసులు వీళ్లు గంజాయిని తరలిస్తున్నారా.? అన్న అనుమానంతో కారును తనిఖీ చేశారు. అప్పటికే అనుమానాస్పందంగా మారిన వీరు ప్రవర్తనను గమనించిన పోలీసులు వెనకాల డిక్కీని తేరచి తనిఖీ చేయగా ఏకంగా రూ. 7.90 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ లభించింది.

దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా రాయ్ పూర్ లో నకిలీ కరెన్సీని తయారుచేసినట్టు అంగీకరించారు. కలర్ జిరాక్స్ తీసి ఈ నోట్లను తయారు చేసినట్టు నిందితులు తెలిపారని పోలీసులు పేర్కోన్నారు. వీటిని విశాఖపట్టణం తరలిస్తున్నట్టు నిందితులు చెప్పారని పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ. 35 వేల నగదు, క్రెడిట్, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ వ్యవహారం వెనక ఓ ముఠా ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles