Woman kills husband with the help of lover పోలీసుల అదుపులో భీమా డబ్బు కోసం హత్యలు చేసే ముఠా.!

Woman kills husband for the sake of insurance money with the help of lover

Devireddy koti Reddy, kondaprol, Damaracharla, Nalgonda Police, Insurance scam, Insurace racket claims, false insurance claims, murder of Insured person, Telangana, crime

police arrests a gang of 17 persons involved in insurance scam and murdering the insured persons for the sake of money with the tip of a case. According to sources, DeviReddy KotiReddy, from kondaprol of Damacharla mandal was found dead. His wife convinced all his family members and relatives that he was hit by tractor and died. But his parents saw some injuries on his body and complianed to police, which revealed whole insurance scam.

పోలీసుల అదుపులో భీమా డబ్బు కోసం హత్యలు చేసే ముఠా.!

Posted: 03/02/2021 01:45 PM IST
Woman kills husband for the sake of insurance money with the help of lover

క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించే విధంగా ఓ ముఠాగా ఏర్పడిన కొంత మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారితో బలవంతంగా బీమా చేయించి, ఆపై వారిని హత్యచేసి బీమా సొమ్మును కొట్టేస్తున్నారు, ఇప్పటి వరకు ఈ ముఠాను నల్గొండ జిల్లాలోనే ఐదుగురిని హత్య చేసింది. వీరందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగుచేశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గిరిజన ప్రాంతాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను ప్రభుత్వ, ప్రైవేటు అసుపత్రుల వద్ద తిష్ట వేసే ముఠా సభ్యులు సేకరిస్తారు. వివరాలు అందిన తరువాత వారి గురించి క్షణ్ణంగా తెలుసుకుంటారు. ఇక ముఠాలోని కీలక సభ్యుుల రంగంలోకి దిగి.. అనారోగ్యం బారిన పడిన వారి కుటుంబ సభ్యులను కలిసి బీమా కట్టేలా ఒప్పిస్తారు. ఒకటి రెండు ప్రీమియంలను వారే చెల్లించేస్తారు.

ఆ తర్వాత ముఠా సభ్యులు తమ పథకాన్ని అమలు చేస్తారు. బీమా చేయించుకున్న వ్యక్తి నామినీతో ఒప్పందం కుదుర్చుకుంటారు. అనంతరం బీమా తీసుకున్న వ్యక్తిని హత్య చేసి రోడ్డు మీదకు తెచ్చి పడేస్తారు. ఆ పై వాహనంతో గుద్దించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తారు. ఆపై ఎఫ్ఐఆర్ కాపీ సేకరించి బీమాకు క్లెయిమ్ చేస్తారు. వచ్చిన మొత్తంలో కుటుంబసభ్యులకు 20 శాతం ఇచ్చి మిగతా 80శాతం మొత్తాన్ని అందరూ కలిసి పంచుకుంటారు. ఇలా ఇప్పటి వరకు కొన్ని కోట్ల రూపాయలు క్లెయిమ్ చేసి.. ముఠా గుట్టుగా పంచుకుంది. దామచర్ల మండలంలోని ఓ తండాకు చెందిన ఇద్దరు ప్రైవేటు బీమా ఏజెంట్లు ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు.

గత కొన్నేళ్లుగా హత్యలకు సహకరిస్తున్న 17 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. అలాగే, ఓ ఏజెంట్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఏజెంట్‌ కోసం గాలిస్తున్నారు. అయితే ఎంతటి ఘనాపాటిలకైనా పాపం పండితే ఊచలు లెక్కబెట్టాల్సిందే. ఎంతటి ఫ్రోఫెషనల్ కిల్లర్ అయినా ఏదో ఒక చిన్న క్లూతో దోరికిపోతాడని పోలీసుల బలమైన నమ్మకం, సరిగ్గా అలాగే జరిగి.. ఈ ముఠా గుట్టు రట్టైంది. మొత్తంగా ముఠా సభ్యులను పోలీసులు కటకటాల్లోకి నెడుతున్నారు. దామచర్ల మండలంలోని కొండ్రపోల్‌కు చెందిన దేవిరెడ్డి కోటిరెడ్డి మృతదేహం వారం క్రితం నార్కట్‌పల్లి-అద్దంకి రహదారి పక్కన కనిపించింది. ట్రాక్టర్ ఢీకొట్టడం వల్లే ఆయన మరణించాడని కుటుంబ సభ్యులను ఆయన భార్య నమ్మించింది.

అయితే, అంత్యక్రియల సమయంలో కోటిరెడ్డి శరీరంపై గాయాలను చూసిన ఆయన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కోటిరెడ్డి భార్యను అదుపులోకి తీసుకుని విచారించడంతో బీమా దందా వెలుగులోకి వచ్చింది. బీమా డబ్బుల కోసం ప్రియుడితో కలిసి తానే చంపించినట్టు అంగీకరించింది. ఈ హత్యలో పాలుపంచుకున్న బీమా ఏజెంట్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు చెప్పింది విని పోలీసులు షాకయ్యారు. బీమా సొమ్ము కోసం గత మూడేళ్లలో ఐదారుగురిని హత్య చేసినట్టు చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో వీరిని రిమాండ్‌కు పంపనున్నట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles