Priyanka Gandhi talks to tea garden workers in Assam తోటల్లోని కూలీలతో కలసి తేయాకు కోసిన ప్రియాంక గాంధీ

Priyanka gandhi plucks tea leaves at tea garden in poll bound assam

priyanka gandhi, assam assembly eletions, election campaign, asseam tea estate workers, priyanka gandhi tea leaves, Assam, Politics

Congress General Secretary Priyanka Gandhi Vadra, who is on a two-day visit to poll-bound Assam, was on Tuesday seen plucking tea leaves with estate workers at Sadhuru tea garden in Biswanath district. Dressed in a saree, the 49-year-old had a basket on her back balanced by a band on her head. She was also armoured with an apron at her waist as she took on the job of plucking tea leaves.

తేయాకు తోటల్లోని కూలీల పనిలో నిజాయితీ, నిరాడంబరత: ప్రియాంక గాంధీ

Posted: 03/02/2021 02:56 PM IST
Priyanka gandhi plucks tea leaves at tea garden in poll bound assam

ఓట్ల కోసం నాయకులు ఎన్ని ఫీట్లయినా చేస్తారు. 2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపి నేతలు కనిపించిన ఓటరు కల్లా టీ తాగించి.. చాయ్ వాలా ప్రధాని అనే అంశాన్ని బలంగా దేశ ప్రజల్లోకి తీసుకెళ్లారు. అయితే ఈ స్ట్రటజీని ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఎప్పుడూ చేయని కాంగ్రెస్ అగ్రనేతలు జనంలో తమ మార్కును వేసుకునేందుకు వివిధ ఫీట్లను ప్రదర్శిస్తున్నారు. మత్య్సకారులతో కలసి సముగ్రంలో చేపలు పట్టడం.. ఈతకొట్టడం.. తమిళనాడులో విద్యార్థులతో కలసి డాన్సులు చేయడం, విద్యార్థితో పోటీగా బస్కీలు తీయడం వంటి ఫీట్లు ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన విషయం తెలిసిందే.

ఆయనకు తోడుగా ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా అస్సోం అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను తన భుజాలపైకి ఎత్తుకుంది. దీంతో అమె స్థానిక దేవాలయంలో పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అమె.. తేయాకు తోటల్లో కూలీలతో కలసి డాన్స్ చేశారు. ఇక తాజాగా తేయాకు తోటల్లో పనిచేసే కూలీల స్థితిగతులను కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ తెలుసుకునే ప్రయత్నం చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న అసోంలో ఆమె పర్యటించారు. బిశ్వనాథ్ లోని సధారు టీ ఎస్టేట్ లోని తేయాకు తోటలకు వెళ్లారు. తేయాకును సేకరించే కూలీలతో మాట్లాడారు. వారితో కలిసి తేయాకును కోశారు. కొంత సమయం వారికి కేటాయించిన ప్రియాంక వారితో కూర్చుని సరదాగా మాట్లాడారు.

వారి ఆచార వ్యవహారాలు, సాధక బాధకాలను తెలుసుకున్న ప్రియాంక గాంధీ.. ఆ విశేషాలను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. తేయాకు కూలీలు అందించిన ప్రేమాభిమానాలను ఎన్నటికీ మరచిపోలేనని, మరువబోనని అన్నారు. ‘‘తేయాకు తోటల్లోని కూలీల పనిలో నిజాయతీ, నిరాడంబరత వున్నాయి. వారి పని దేశానికి ఎంతో విలువైనది. అలాంటి విలువైన వారితో ఇవాళ నేను మమేకమయ్యాను. వారి పని, వారి మంచి చెడ్డలను అడిగి తెలుసుకున్నాను. వారి కష్టాలేంటో తెలుసుకున్నాను. వారు చూపించిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను’’ అని ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles