"Will You Marry Her?" SC Asked Govt Worker In Rape Case నిరవ్ మోడీని భారత్ కు అప్పగించండీ: లండన్ కోర్టు

Will you marry her supreme court asked government worker in rape case

Supreme Court, schoolgirl, rape, Mohit Subhash Chavan, Electrical department technician, POCSO Act, Maharashtra, Crime

The Supreme court was hearing the bail request of Mohit Subhash Chavan, a technician with the Maharashtra State Electric Production Company. He has been accused of raping a schoolgirl and faces charges under the severe POCSO (Protection of Children from Sexual Offences) law.

అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకుంటావా.? లేదా శిక్ష.?: సుప్రీంకోర్టు

Posted: 03/01/2021 07:44 PM IST
Will you marry her supreme court asked government worker in rape case

అత్యచార కేసుల్లో బాధితులను పెళ్లి చేసుకుంటామని హామీ ఇచ్చినా.. లేక మరో విధంగా రాజీ కుదుర్చుకున్నా కేసుల నుంచి మినహాయింపు మాత్రం లభించదని గతంలోనే చెప్పిన దేశసర్వన్నత న్యాయస్థానం ఇవాళ ఓ ప్రభుత్వం ఉద్యోగి విషయంలో మాత్రం ఆ ఉత్తర్వులను సడలించింది. అత్యాచార ఆరోపణల నేపథ్యంలో పోక్సో యాక్ట్‌ కింద నమోదైన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘‘బాధితురాలిని పెళ్లి చేసుకుంటావా.. లేక జైలుకెళ్తావా’’ అని నిందితుడిని ప్రశ్నించింది. ఉద్యోగం నుంచి సస్పెండ్‌ కాకుండా ఉండాలన్నా.. జైలుకు వెళ్లకుండా ఉండాలన్న బాధితురాలిని వివాహం చేసుకోవాలని సూచించింది.

నిందితుడు మోహిత్‌ సుభాష్‌ చవాన్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘నీవు పాఠశాల విద్యార్థినిపై అత్యాచారం చేశావ్‌. ఇందుకు గాను నీమీద పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు అయ్యింది. ఒకవేళ నీవు బాధితురాలిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటే.. మేం నీకు సాయం చేయగలం. లేదంటే నీవు జైలుకెళ్తావ్‌.. అప్పుడు ఆటోమెటిగ్గా నీ ఉద్యోగం కూడా పోతుంది’’ అని కోర్టు నిందితుడికి తెలిపింది. గతంలోనే తాను బాధితురాలిని వివాహం చేసుకోవడానికి అమెతో రాజీ కుదుర్చుకునేందుకు వచ్చానని, అయితే అందుకు అమె అంగీకరించలేదని చౌహాన్ తెలిపాడు.

కాగా అమె అంగీకరించకపోవడంతో తమ కుటుంబసభ్యులు వేరే యువతితో తన పెళ్లి చేశారని చెప్పాడు. దీంతో ఇప్పుడు తాను పెళ్లైన వ్యక్తినయ్యానని, ఇప్పడు బాధితురాలిని పెళ్లి చేసుకోలేను అని న్యాయసానం ఎదుట చెప్పాడు. నిందితుడు చవాన్‌ మహారాష్ట్ర స్టేట్‌ ఎలక్ట్రిక్‌ ప్రొడక్షన్‌ కంపెనీలో టెక్నిషియన్‌గా పని చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం చవాన్‌ మైనర్‌ స్కూల్‌ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. దాంతో అతడిపై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగి కావడంతో పోలీసులు చవాన్‌ని అరెస్ట్‌ చేస్తే.. వెంటనే అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తారు.

దాంతో అతడు అరెస్ట్‌ నుంచి రక్షణ కోరుతూ.. హై కోర్టుని ఆశ్రయించాడు. అక్కడ ఆశించిన ఫలితం రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. చవాన్‌ బెయిల్‌ పిటిషన్‌ సందర్బంగా కోర్టు.. బాధితురాలిని వివాహం చేసుకుంటే.. జైలుకెళ్లాల్సిన అవసరంలేదని తెలిపింది. ఇక ఈ విషయంలో కోర్టు బలవంతం ఏం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ బాధితురాలిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా లేకపోతే.. రెగ్యూలర్‌ బెయిల్‌కు అప్లై చేసుకోవాలని కోర్టు సూచించింది. చవాన్‌కి నాలుగు వారాల పాటు అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles