YouTuber Shanmukh held for rash driving టిక్ టాక్ స్టార్ షణ్ముక్ జశ్వంత్ పై క్రిమినల్ కేసు..

Youtuber shanmukh jaswanth s career in jeopardy after drunk driving case

shanmukh jaswanth, shanmukh jaswanth accident, shanmukh jaswanth accident news, shanmukh jaswanth accident latest news, shanmukh jaswanth accident case, shanmukh jaswanth latest news, shanmukh jaswanth arrest, shanmukh jaswanth recent news, shanmukh jaswanth, Criminal case, car accident, shanmukh arrest, Shanmukh Jaswanth Kandregula, Hyderabad, Telangana, Crime

YouTuber Shanmukh Jaswanth has been taken into custody by the police for drunk driving. His blood alcohol level was 170mg/100 ml. He had hit three parked cars and two bikes at Jubilee Hills, Road No. 10. According to the reports, Shanmukh was in an inebriated state and hit the vehicles as he lost the control over his car.

టిక్ టాక్ స్టార్ షణ్ముక్ జశ్వంత్ పై క్రిమినల్ కేసు..

Posted: 03/01/2021 01:01 PM IST
Youtuber shanmukh jaswanth s career in jeopardy after drunk driving case

సోషల్ మీడియాలో లక్షలాధి మంది పోటీదారులను తట్టుకుని ఒక స్టార్ గా ఎదగడం అంటే అంత ఈజీ కాదు. అయినా అలాంటి వారందరినీ దాటుకుని ఒక స్టార్ ఇమేజ్ కు చేరుకున్న తరువాత దానిని నిలుపుకోవడంపైన ఎక్కవ శ్రద్దపెట్టాలి. సామాజిక సృహతో మెలిగి.. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అప్పుడే అందివచ్చిన స్టార్ స్టేటస్ పది కాలల పాటు వుంటుంది. ఇన తన వృత్తి పరంగానూ ఉన్నత స్థాయికి ఎదిగేందుకు దోహదపడుతోంది. కానీ అలాంటి ఇమేజ్ వుచ్చిందని.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే.. కాలమే సమాధానం చెబుతోంది.

మద్యం మత్తులో కారు నడుపుతూ మూడు వాహనాలను ఢీకొట్టడంతో పాటు ఒక స్కూటరిస్టుతో పాటు పాదచారిని కూడా ఢీకొట్టిన వారి తీవ్ర క్షతగాత్రులు కావడానికి కారణమైన టిక్ టాక్ స్టార్ షణ్ముక్ జశ్వంత్ కు శ్రీముఖాలు అందజేసిన పోలీసులు ఆయనకు అరదండాలు విధించడంతో పాటు ఆయనపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు, ఆయనపై జూబ్లీహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేసి 41(ఏ) నోటీసు జారీ చేశారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.52లోని ఉడ్స్‌ అపార్ట్‌మెంట్స్‌ నుంచి తన కారులో మద్యం మత్తులో ఎదురుగా ఉన్న వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లాడు. ఓ స్కూటరిస్ట్‌కు కూడా గాయాలయ్యాయి. స్థానికులు షణ్ముక్‌ కారును అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు.

కారు దెబ్బతిన్న విజయ్‌ ఫిర్యాదు మేరకు అతడిపై ఐపీసీ సెక్షన్‌ 337, 279 కింద కేసు నమోదు చేశారు. ఇటీవలే సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ పేరుతో ఓ వెబ్‌సిరీస్‌లో నటించిన అతడు యూట్యూబ్‌ స్టార్‌గా గుర్తింపు పొందాడు. పోలీస్‌స్టేషన్‌లో కూడా షణ్ముఖ్‌ రచ్చరచ్చ చేశాడు. పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. తన ఒక్కో ఎపిసోడ్‌కు కోటి వ్యూస్‌ ఉంటాయి తెలుసా అంటూ దబాయించాడు. రెండు గంటల పాటు పోలీసులను ఇబ్బందులకు గురి చేశాడు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles