LPG Cylinder Price Up ₹ 25, costs Rs 819 in Delhi మళీ పెరిగిన ఎల్పీజీ సిలిం‘డర్’ ధర.. 3 నెలల్లో రూ.225

Lpg price hiked by rs 25 now costs rs 819 per cylinder in delhi

LPG cylinder prices, LPG cylinder price hike, LPG price hike today, LPG price hike effective today LPG price hike, LPG price hike news, Indian oil companies, Indane gas, bharat gas, HP gas, subsidised gas, non subdisy gas cylinder, industry news, industry growth, indian industry news, Indian Economy, Finance

The price of domestic cooking gas or liquified petroleum gas (LPG) has been hiked by Rs 25 per cylinder from Monday. After the latest price hike, a 14.2 kilogram domestic LPG cylinder will cost Rs 819 in Delhi, up from Rs 794.

మళీ పెరిగిన ఎల్పీజీ సిలిం‘డర్’ ధర.. 3 నెలల్లో రూ.225

Posted: 03/01/2021 12:09 PM IST
Lpg price hiked by rs 25 now costs rs 819 per cylinder in delhi

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో దేశంలోని మధ్యతరగతి వర్గాలు ఇక పేదల జాబితాలోకి చేరిపోనున్నారు. ఉన్నతవర్గాలను అందుకోవాలన్న వారి ఆశలు అడియాశలు కాగా.. కరోనాకు ముందు కరోనా తరువాత వారి అర్థిక పరిస్థితులు క్రమంగా దిగజారిపోతున్నాయి. అటు ఇంధన ధరలు పెరుగుతూ, ఇటు గ్యాస్ ధరలను పెంచుతూ సామాన్య మద్యతరగతి వారిపై కేంద్రంలోని సర్కార్ కొరఢా ఝుళిపిస్తోంది. దీంతో అన్ని కళ్ల ఎదుట కన్నబడుతున్నా.. ఏదీ కొనలేని, తినలేని దీనావస్థకు మధ్యతరగతి వర్గాలు చేరుకుంటున్నాయి.

తాజాగా వంట గ్యాస్ (ఎల్పీజీ) సిలిండ‌ర్ ధ‌ర‌ల పెంపు రూపంలో పేద, మధ్య తరగతి కుటుంబాలపై మరో గుదిబండ పడింది. సబ్సీడీ రహిత సిలిండర్ ధరను అందుకునేందుకు సబ్సీడి సిలిండర్ ధర చేరువవుతున్న క్రమంలో ఈ సారి సబ్సీడీ రహిత (వాణిజ్య) గ్యాస్ సిలిండ‌ర్ల ధ‌ర‌లు కూడా పెరిగాయి. ఇవాళ తాజాగా కేంద్రం అనుమతితో ఇంధన సంస్థలు వంటగ్యాస్ సిలిండర్ పై రూ.25, వాణిజ్య సిలిండర్ పై రూ.95ను పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నాయి. ఈ ధ‌ర‌లు ఇవాళ్టి నుంచే అమ‌ల్లోకి వ‌చ్చాయి. దీనిపై సామాన్యులు పెదవి విరుస్తున్నారు.

మూడు నెలల్లో రూ. 225 పెరిగిన సిలిండర్ ధర..

మూడు నెలల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర అమాంతం పెరిగింది. మూడు నెలల వ్యవధిలో అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదల పేరుతో ఇంధన సంస్థలు గ్యాస్ ధరలను అమాంతం 225 రూపాయల మేర పెంచేసి.. గ్యాస్ వినియోగధారులపై భారాన్ని మొపుతున్నారు. డిసెంబర్ 1కి ముందు సబ్సీడీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 594గా వుండింది. మరి తాజాగా పెంచిన ధరలతో గ్యాస్ ధర మార్చి 1 నాటికి ఢిల్లీలో రూ. 819కి చేరగా, అదే హైదరాబాద్ లో అయితే ఏకంగా 871.50కు చేరింది. దీంతో ఏడాది క్రితం గరిష్టానికి చేరింది.

గత ఏడాది డిసెంబర్‌ 1న దేశ రాజధాని ఢిల్లీలో సబ్సీడీ సిలిండర్‌ ధర రూ.594 ఉండగా, డిసెంబర్ ఒకటిన దానిని కేంద్రం రూ. 50 మేర పెంచుతూ.. రూ.644లుగా ఫిక్స్ చేసింది. ఆ తర్వాత జనవరి 1న రూ.644 నుంచి రూ.694కు పెంచగా... మరో రూ. 50 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఫిబ్రవరి 4న ఇది రూ.719కి చేరింది. ఆ తర్వాత ఫిబ్రవరి 15న మరో రూ. 50 పెంచడంతో గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ. 769కి చేరింది. ఆ తర్వాత ఇటీవల ఐదు రోజుల క్రితం రూ.25 మేర సిలిండర్ పై ధరను పెంచిన కేంద్రం.. తాజాగా ఇవాళ మరోమారు రూ.25 మేర పెంచింది. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో సబ్బీడీ సిలిండర్‌ ధర రూ.819కి చేరగా, హైదరాబాద్ లో రూ.871.50కు చేరుకుంది.

ఇక ప్రస్తుతం సబ్సీడీ గ్యాస్ సిలిండర్ ధర సబ్సీడీ యేతర గ్యాస్ సిలిండర్ ధరకు సమీపంచిన నేపథ్యంలో వాటిపై కూడా కేంద్రం తన మార్కును చూపించాయి ఇంధన సంస్థలు. దీంతో వాణిజ్య సిలిండర్ పైనా రూ.95 పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో వాటి ధర రూ.1,614కు చేరింది. పెంచిన ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి. మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సైతం రికార్డు స్థాయిలో పెరుగుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి నెలలో 16 రోజులు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles