Amit Shah Summoned By Bengal Court in defamation case అమిత్ షాకు కోర్టు సమన్లు.. 22న హాజరుకావాలని అదేశాలు..

Amit shah summoned by bengal court after mamata banerjee s nephew sues him

Amit Shah, Abhishek Banerjee, West Bengal Election 2021, Mamata Banerjee, Trinamool Congress TMC, Bengal Election 2021, Bengal Polls 2021, West Bengal, National, Politics, Crime

A designated MP/MLA court in West Bengal issued summons to Union Home Minister Amit Shah today to appear either personally or through a lawyer before it on February 22 in connection with a defamation case filed against him by Trinamool Congress MP Abhishek Banerjee.

కేంద్ర హోం మంత్రికి కోర్టు సమన్లు.. 22న హాజరుకావాలని అదేశాలు..

Posted: 02/19/2021 09:01 PM IST
Amit shah summoned by bengal court after mamata banerjee s nephew sues him

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలలో ఫుల్ బిజీగా వున్న కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపి అగ్రనేత అమిత్‌ షాకు గట్టి షాక్ తగిలింది. ఎన్నికల ప్రచారంతో పాటు విజయానికి కావాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలను రచించడంలో తలమునకలైన ఆయనకు అదే రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీచేసింది. ఆయనను ఈ నెల 22న వ్యక్తిగతంగా లేదా తన తరపు లాయర్ ద్వారా కోర్టు ముందు హాజరుకావాలని అదేశాలు జారీ చేసింది. స్వయంగా అమిత్ షాకు న్యాయస్థానం సమన్లు జారీ చేసిందన్న వార్త బీజేపి శ్రేణులను విస్మయానికి గురిచేసింది.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ దాఖలు చేసిన పరువు నష్టం దావాకు సంబంధించిన కేసులో న్యాయస్థానం ఈ మేరకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 22న ఉదయం పది గంటలకు విచారణకు హాజరు కావాలని  బిధన్నగర్ లోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు ప్రత్యేక న్యాయస్థానం అదేశించింది. అంతేకాక అమిత్‌ షా మీద ఐపీసీ సెక్షన్‌ 500 కింద నమోదైన పరువు నష్టం కేసులో సమాధానం ఇవ్వాలని తెలిపారు.

2018 ఆగస్టు 11న కోల్‌కతాలో జరిగిన ర్యాలీలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత, ఎంపీ అభిషేక్‌ బెనర్జీ పరువుకు నష్టం కలిగించేలా అమిత్‌ షా వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ అభిషేక్‌ తరఫు న్యాయవాది సంజయ్‌ బసు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం అమిత్‌ షా బెంగాల్‌ పర్యటనలోనే ఉన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న బెంగాల్‌కు విచ్చేసిన ఆయన.. ఐదో విడత పరివర్తన్‌ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మమతా బెనర్జీ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏప్రిల్‌/మే నెలల్లో బెంగాల్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్‌ మధ్య గత కొంత కాలంగా తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amit Shah  Abhishek Banerjee  Mamata Banerjee  Trinamool Congress TMC  West Bengal  Politics  Crime  

Other Articles