RJD MLA Stages Cycle Ride To Bihar State Assembly మట్టిపోయ్యి, కట్టెలతో అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యే.. సైకిల్ పై మరోకరు..

Congress mla shakeel ahmed protests against lpg cylinder price hike

congress mla, lpg gas cylinder price, shakeel ahmed, farm laws, rjd, bihar state assembly, budget session, mukesh raushan, fuel price, Bihar, Politics

Congress MLA Shakeel Ahmed Khan reached the assembly with an earthen stove and wood. MLAs from opposition parties CPI and CPI(M) were also seen shouting slogans against agricultural laws.

మట్టిపోయ్యి, కట్టెలతో అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యే.. సైకిల్ పై మరోకరు..

Posted: 02/19/2021 10:05 PM IST
Congress mla shakeel ahmed protests against lpg cylinder price hike

 దేశంలో ఓ వైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండడంతో వీటి ప్రభావం అటు నిత్యావసర సరుకులపై పడి వాటి ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో మరోవైపు గ్యాస్‌ ధరలు కూడా చుక్కలను తాకతున్న క్రమంలో సామాన్యులు, మధ్యతరగతి, పేద, బడుగు బలహీర వర్గాల వారు ఏం తిని బతకాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కేంద్రప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. కరోనా కష్టకాలం కేంద్రంలోని ప్రభుత్వానికే కాదు దేశంలోని ప్రజలందరికీ వచ్చిందని ఆయన అన్నారు.

అయినా కనీసం కనికరం లేకుండా ప్రజలను జేబులను అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు గుల్ల చేస్తున్నాయని అరోపించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు ఎలాంటి ఊరట లభించకపోవడంతో ఆయన తీవ్ర ఎత్తున్న తన నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. అంతేకాదు ఏకంగా మట్టి పోయ్యితో పాటు కర్రలను కూడా తీసుకుని ఏకంగా అసెంబ్లీకి వచ్చారు. అంతేకాదు ధరల ప్రభావం ఎలా వుందో ప్రస్పుటించేలా పట్టికలను రూపోందించుకుని వచ్చారు. ఎవరాయన.? అంటారా.? బీహార్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్. బీహార్ అసెంబ్లీలో ఇవాళ్టి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆయన పెరుగుతున్న ధరలపై నిరసనతో ఈ విధంగా అసెంబ్లీకి చేరుకున్నారు.  

ఈ సమావేశాలకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే షకీల్‌ అహ్మద్‌ తన వాహనం నుంచి దిగుతూ కట్టెలు, మట్టి పొయ్యిని చేతిలో పట్టుకుని అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ధరలు ఎలా పెరుగుతున్నాయో చెప్పేలా ప్లకార్డులు ప్రదర్శించారు. బీజేపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గ్యాస్‌ ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ప్రజలు మళ్లీ పాత పద్ధతిలో వంటలు వండుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది’ ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే షకీల్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వల్లనే ప్రజలకు ఈ దుస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే అసెంబ్లీ లోపలకు వెళ్లే సమయంలో భద్రతా సిబ్బంది పొయ్యి, కట్టెలను నిరాకరించారు. ఇక ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేశ్‌ రౌశన్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కారులో కాకుండా అసెంబ్లీకి సైకిల్‌పై వచ్చి పెట్రోల్‌ ధరల పెంపుపై ఆందోళన చేశారు. ‘7 గంటలకు సైకిల్‌పై బయల్దేరాను. అసెంబ్లీకి రావడానికి చాలా ఖర్చవుతోంది. దీనిపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది’ ఎమ్మెల్యే ముఖేశ్‌ మీడియాతో చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles