School teacher gets 10 years for ‘marrying’ minor student మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న ఉపాద్యాయుడికి పదేళ్ల జైలు

Teacher gets 10 years sentence for marrying minor student in mulugu district

warangal district court, teacher marries student, class 9 student, summer vacation, sai manideep, mulugu, venkatapur, vetharlapally, ganapuram, Khammam, Telangana, Crime

A Warangal court on Wednesday sentenced a school teacher to 10 years imprisonment for marrying a Class 9 student, who is a minor, in 2016. The teacher who was working in a private English medium school, eloped with the girl during summer vacation holidays.

మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న ఉపాద్యాయుడికి పదేళ్ల జైలు

Posted: 02/17/2021 06:19 PM IST
Teacher gets 10 years sentence for marrying minor student in mulugu district

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పాడు. తన వద్ద విద్య నేర్చుకుంటున్న విద్యార్థినిపై కన్నువేశాడు. పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేస్తానని, ఫస్ట్‌ ర్యాంకు ఇస్తానని మాయమాటలు చెప్పి అమెను వారి ఇంట్లోని వారికి తెలియకుండా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. అమెతో శారీరికంగానూ కలిసాడు. తమ అచూకీ ఎవరికీ తెలియదని భ్రమపడి తన మకాన్ని ఖమ్మం జిల్లా ఇల్లెందుకు మార్చాడు. అయినా పోలీసులు అతని సెల్ ఫోన్ సిగ్నెల్ ఆధారంగా పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. 2016లో జరిగిన ఈ ఘటనలో విచారణ అనంతరం తాజాగా నిందితునికి కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.

వివరాలు... ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం వెత్తార్లపల్లికి చెందిన మైనర్‌ బాలిక గణపురంలోని ప్రైవేట్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. 2016 వేసవి సెలవుల్లో ఆమె గణపురంలోని మేనత్త ఇంటికి వెళ్లింది. ఏప్రిల్‌ 29న ఇంటినుంచి అదృశ్యమవడంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గణపురం పోలీసులు విచారణ చేపట్టి ఆమె సెల్‌ ఫోన్‌లోని మెసేజ్‌ల ఆధారంగా సాయిమణిదీప్‌ నంబర్‌ను గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. బాలికకు మాయమాటలు చెప్పిన సాయిమణిదీప్‌ 2016 ఏప్రిల్‌ 29న బాలికను తనతో తీసుకువెళ్లాడు.

అనంతరం మే 9న ఖమ్మం జిల్లా ఇల్లెందులోని కోటమైసమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నాడు. అదే రోజు ఇల్లెందులోని లాడ్జికి తీసుకెళ్లి బాలికను లొంగదీసుకున్నాడు. ఆ మరుసటి రోజు ఆమెను హన్మకొండలోని తన ఇంటికి తీసుకువచ్చాడు. 2016 మే17న మణిదీప్‌ ఇంటినుంచి బాలికను రక్షించిన పోలీసులు ఆమె వాంగ్మూలం ఆధారంగా మణిదీప్‌తో పాటు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. నేరం రుజువు కావడంతో ప్రధాన నిందితుడు శివగాని సాయిమణిదీప్‌కు వరంగల్‌ మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి కె.జయకుమార్‌ పదేళ్ల జైలు శిక్ష, రూ.4,500 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Teacher  Student  marriage  warangal district court  class 9 student  sai manideep  mulugu  Telangana  Crime  

Other Articles