Congress Wins All 7 Punjab Urban Seats, Setback For BJP పంజాబ్ లో బీజేపికి గట్టి షాక్.. కాంగ్రెస్ క్లీన్ స్వీప్..

Congress sweeps punjab urban polls amarinder singh says 2022 teaser

Punjab civic body polls, Punjab Municipal Corporation, Punjab local body elections, Abohar, Bathinda Batala, Kapurthala, Mohali, Hoshiarpur, Moga, Pathankot,Amarinder singh, CM, Congress, Punjab, Politics

The Punjab State Election Commission (PSEB) has begun the counting of votes for 2,302-ward Punjab Municipal Election Result 2021 of eight municipal corporations and 109 municipal councils and Nagar Panchayats and will end at 4 PM. Congress is in a clear lead, while AAP and SAD are battling to take the second position.

పంజాబ్ లో బీజేపికి గట్టి షాక్.. కాంగ్రెస్ క్లీన్ స్వీప్..

Posted: 02/17/2021 07:49 PM IST
Congress sweeps punjab urban polls amarinder singh says 2022 teaser

వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనల ప్రభావం బీజేపీపై భారీగానే పడింది. రైతుల డిమాండ్లను పరిష్కార మార్గాన్ని అన్వేషించాల్సిన పరిస్థితి అత్యంత అవశ్యకమని చాటిచెప్పేలా పంజాబ్ నగర ఓటరు తీర్పునిచ్చారు. పంజాబ్ నగరపాలక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. ఏడు మున్సిపల్ కార్పొరేషన్లను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. మోగా, హోషియార్ పూర్, కపుర్తలా, అబోహర్, పఠాన్ కోట్, బాటాలా, బఠిండాల్లో జయకేతనం ఎగురవేసింది. మరో స్థానం మొహాలీకి సంబంధించి రేపు ఫలితాలను ప్రకటించనున్నారు.

దాదాపు ఏడు మున్సిఫల్ కార్పోరేషన్లలో విజయకేతనానని ఎగురవేసిన కాంగ్రెస్ 109 నగర పంచాయతీలు, పురపాలక సంఘాలలో ఏకంగా 78 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఐదు చోట్ల శిరోమణి అకాళీదళ్ గెలుపోందగా, పద్నాలుగు స్థానాల్లో ఇతరులు గెలుపోందారు. ఇక మోగా కార్పోరేషన్ లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఇక్కడ మొత్తం స్థానాల్లో కాంగ్రెస్ 20 స్థానాలు, శిరోమణి అకాళీదళ్ పార్టీ 15 స్థానాలు, అప్ నాలుగు స్థానాలు, బీజేపి 1 స్థానం, ఇతరులు 14 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ కూ పూర్తి మోజారిటీ లభించనప్పటికీ.. అధికస్థానాలు గెలుచుకున్న పార్టీగా అవతరించింది. ఇతరులతో కలసి అధికారాన్ని చేపట్టే అవకాశాలు వున్ానయి

హోషియార్ పూర్ కార్పోరేషన్ పరిధిలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడ 41 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ కార్పోరేషన్ లో అటు బీజేపి, ఇటు అకాళీదళ్ పార్టీలు ఉనికి కూడా చాటుకోలేదు. కాగా, అప్ రెండు స్థానాలు, ఇతరులు రెండు స్థానాల్లో గెలుపోందారు. కపుర్తలా కార్పోరేషన్ లోనూ కాంగ్రెస్ ఏకపక్ష విజయాన్ని అందుకుంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ 45 స్థానాలను కైవసం చేసుకుంది. కాగా ఇక్కడ అకాళీదళ్ పార్టీ 3 స్థానాల్లో విజయం సాధించింది. ఇతరులు రెండు స్థానాల్లో విజయం సాధించారు.

అబోహర్ కార్పోరేషన్ పరిధిలోనూ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. ఈ కార్పోరేషన్ లోనూ కాంగ్రెస్ పార్టీ పూర్తి విజయాన్ని అందుకుంది కేవలం ఒకే ఒక్క స్థానాన్ని మాత్రం శిరోమణి అకాళీదల్ పార్టీకి ఇచ్చింది. అటు పఠాన్ కోట్ లోనూ కాంగ్రెస్ విజయదుంధుభి మ్రోగించింది. ఈ కార్పోరేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ 36 స్థానాలను సాధించగా, శిరోమణి అకాళీదళ్ పార్టీ ఒక్క స్థానానికి పరిమితం అయ్యింది. ఇక్కడ మాత్రమే బీజేపి తన ఉనికి చాటింది. ఏకంగా 12 స్థానాల్లో విజయం సాధించింది. ఇతరులు ఒక్క స్థానంలో గెలుపోందారు.

అటు బాటాలాలోనూ కాంగ్రెస్ తన అధిపత్యాన్ని చాటుకుంది. ఈ కార్పోరేషన్ పరిధిలోనూ కాంగ్రెస్ ఏకంగా 36 స్థానాలను గెలుపోందింది. శిరోమణి అకాళీదళ్ పార్టీ 6 స్థానాల్లో అప్ పార్టీ 3 స్థానాల్లో ఇక బీజేపి నాలుగు స్థానాల్లో గెలుపును అందుకుంది. ఇతరులు ఒక్క స్థానంలో విజయాన్ని అందుకున్నారు. ఇక బఠిండాల్లో కాంగ్రెస్ తన సత్తాను చాటుకుంది. సుదీర్ఘకాలంగా ఈ కార్పోరేషన్ పరిధిలో తన ఉనికి చాటుకునేందుకు పాటు పడుతున్న కాంగ్రెస్ ఈ సారి జరిగిన ఎన్నికలలో ఏకంగా చరిత్రను తిరగరాస్తూ 43 స్థానాల్లో విజయాన్ని అందుకుని ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. ఇక్కడ ఏడు స్థానాల్లో శిరోమణి అకాళీదళ్ పార్టీ గెలుపోందగా, మిగిలిన పార్టీలు కనీసం ఉనికి చాటుకునే ప్రయత్నం కూడా చేయలేకపోయాయి.

కాగా, బఠిండా మున్సిపల్ కార్పొరేషన్ పై 53 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ గెలుపు జెండా ఎగరడం విశేషం. బఠిండా అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ నేత, రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్ ప్రీత్ సింగ్ బాదల్ నేతృత్వం వహిస్తుంటే.. ఇటీవలే ఎన్డీయే నుంచి వైదొలిగిన శిరోమణి అకాలీ దళ్ ఎంపీ హర్ సిమ్రత్ కౌర్ లోక్ సభ నియోజకవర్గానికి నేతృత్వం వహిస్తున్నారు. అయితే, పైచేయి కాంగ్రెస్ దే అయింది. ఫిబ్రవరి 14న 109 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. 71.39 శాతం పోలింగ్ నమోదైంది.

కొన్ని బూత్ లలో మంగళవారం రీపోలింగ్ జరిగింది. మొహాలీ కార్పొరేషన్ కు సంబంధించి 32, 33వ నెంబర్ బూత్ లకు రీపోలింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే మొహాలీ కార్పొరేషన్ ఫలితాలను గురువారం ప్రకటించనున్నారు. మొత్తం 9,222 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యధికంగా 2,832 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు. పార్టీల వారీగా అయితే కాంగ్రెస్ 2,037 మందిని పోటీలో నిలిపింది. శిరోమణి అకాలీ దళ్  తరఫున 1,569 మంది పోటీ చేయగా.. బీజేపీ నుంచి కేవలం 1,003 మందే పోటీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles