AP High Court upholds SEC directives on videography ఒక్కరు కోరినా వీడియో తీయాల్సిందే: హైకోర్టు అదేశం

Sec directives be enforced in the case of videography ap high court

SEC, N. Ramesh Kumar, Gram Panchayat Elections, SEC directives, counting videotape, videography, AP High Court, Andhra pradesh, Politics

The Andhra Pradesh High Court has heard a petition seeking to videotape the counting of panchayat election votes. The High Court has directed that if anyone complains, then the counting should be definitely videotaped. The High Court suggested that the election should be held impartially.

వీడియో విషయంలో ఎస్ఈసీ అదేశాలను పాటించాల్సిందే: హైకోర్టు అదేశం

Posted: 02/16/2021 07:32 PM IST
Sec directives be enforced in the case of videography ap high court

పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో తీయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు తాజాగా అదేశాలను జారీ చేసింది. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన అదేశాలను న్యాయస్థానం సమర్థించింది. ఓట్ల లెక్కింపును ప్రక్రియను వీడియో తీయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో తీయాలని ఏదైనా పంచాయతీలో ఒక్క ఓటరు కోరినా సంబంధిత పంచాయతీలో వీడియో తీయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

గ్రామపంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని ఎస్‌ఈసీని అదేశించిన న్యాయస్థానం.. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘానిదేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను సీసీ కెమెరాలో రికార్డు చేయాలని లేదా వీడియో తీయాలని ఎస్‌ఈసీ ఈనెల 13న ఇచ్చిన ఉత్తర్వులను అమలు కావడం లేదని, వాటిని అమలుపర్చేలా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించాలని కోరుతూ పిటీషన్ దాఖలైంది.

ఇప్పటికే రెండు విడతల కౌంటింగ్ ముగిసినా న్యాయస్థానం జారీచేసిన అదేశాలు అమలు కావడం లేదని కృష్ణా జిల్లాకు చెందిన శ్రీపతి నాంచారయ్య, గుంటూరు జిల్లాకు చెందిన ఎం.ప్రతాప్‌ నాయక్‌ హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో ఈనెల 17, 21 తేదీల్లో జరగనున్న మూడు, నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపును రికార్డు చేసేలా ఆదేశించాలని కోరారు. దీంతో అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో కెమెరాల ఏర్పాటుకు ఆదేశాలిచ్చామని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సమస్యాత్మక ప్రాంతాలను ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారో విధానం తెలుసుకున్న తరువాత న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles