b pharma student cooked up kidnap-rape story ఘట్ కేసర్ గ్యాంగ్ రేప్.. అంతా కట్టుకథ

Twist in ghatkesar gang rape girl cooked up kidnap rape story say cops

b pharmacy student, b pharmacy student kidnapped, Rachakonda police, Mohan Bhagawat, b pharmacy student abduction, b pharmacy student keesara, b pharmacy student ghatkesar, auto driver, abduction, attempt rape, Rampalli, Medchal Malkajgiri district, crime, crime news, crime news today, hyderabad crime news today, hyderabad rape victim latest news

In a dramatic turn of events, the Rachakonda police on Saturday said the 19-year-old student, who alleged she was kidnapped and gang-raped, had made up the whole story and misled the police and her family members.

ఘట్ కేసర్ కిడ్నాప్, గ్యాంగ్ రేప్.. అంతా యువతి కట్టుకథ..

Posted: 02/13/2021 12:58 PM IST
Twist in ghatkesar gang rape girl cooked up kidnap rape story say cops

ఘట్ కేసర్ లో బీఫార్మసీ విద్యార్థినిని కిడ్నాప్‌, సామూహిక చేసి అఘాయిత్యానికి పాల్పడిన కేసులో బాధితురాలు చెప్పినదానిలో ఏమాత్రమూ నిజం లేదని.. అమె తల్లి నుంచి వేరుగా వెళ్లాలని చేసిన ప్రయత్నంలో భాగంగా ఆడిన నాటకమని, ఇదంతా ఓ కట్టుకథని తేల్చారు రాచకొండ పోలీసులు. రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన కేసులో బాధితురాలి తల్లి పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. కంటిమీద కునుకు కరువైయ్యేలా చేధించిన కేసు చివరకు కట్టుకథగా తేలడంలో వారి కష్టానికి ఫలితం లేకుండా చేసింది.

రాచకొండ పోలీసు కమీషనర్ మోహన్ భగవత్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు. యువతి కిడ్నాప్ ను ఓ కట్టుకథగా తేల్చిచెప్పారు. బీఫార్మసీ విద్యార్ధినిపై అత్యాచారం జరగలేదన్నారు. యువతి కావాలనే కట్టుకథలు అల్లిందని తెలిపారు. పోలీసులను, తల్లిదండ్రులను తప్పుదోవపట్టిందని పేర్కొన్నారు. బాధిత యువతి తల్లి పిర్యాదు మేరకు తొలుత యువతిని కిడ్నాప్ చేశారన్న సమాచారంతో తాము అలర్ట్ అయ్యామని, కిడ్నాపు కేసు నమోదు చేశామని తెలిపారు.

అందిబాటులోకి వచ్చిన సాంకేతికతతో (సెల్ ఫోన్‌ సిగ్నల్ ఆధారంగా) యువతిని ట్రేస్‌ చేశామని తెలిపిన ఆయన ఆ మరుసటి రోజున విచారణలో యువతి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానాలకు రేకెత్తాయని అన్నారు. యువతి చెప్పిన అటో డ్రైవర్.. అతని స్నేహితులను విచారించి.. వారు తెలిపిన వివరాల ప్రకారం , సీసీటీవీ ఫూటేజీ పరిశీలించగా వారు చెప్పింది నిజమని తేలిందని.. ఈ నేపథ్యంలో మరోమారు యువతిని విచారించగా, తనకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారని.. చెప్పిందని అన్నారు,

దీంతో మరోమారు బాధితురాలని వైద్యపరీక్షలకు తీసుకెళ్లి రక్తంలో మత్తుమందు ఏమైనా కలిసిందా..? అన్న కోణంలోనూ పరిశీలించినా.. అలాంటిదేమీ లేదని తేలిందని వైద్య నివేదికలు వెల్లడించాయన్నారు. ఇక దీంతో యువతి చెప్పిన కథనాల ప్రకారం అమె దిగిన రాంపల్లి నుంచి సీసీటీవీ ఫూటేజీలు పరిశీలించగా.. అమె ఒక్కతే భుజాన బ్యాగు వేసుకుని రోడ్డుపై దాదాపుగా నాలుగు కిలోమీటర్లు దూరం నడుచుకుంటూ వెళ్లిందన్నారు. ఆ తరువాత ఓ అటోను ఎక్కి అన్నోజీగూడ వద్ద దిగి.. అక్కడి నుంచి రెండు వందల మీటర్ల దూరంలో పొదల్లోకి పరుగెత్తిందని అన్నారు.

ఈ క్రమంలో కిందపడటంలో కాలికి దెబ్బ తగిలిందని.. అయినా లేచిన యువతి మరికొంత దూరం పోదల్లోకి వెళ్లి అక్కడ తన దుస్తులను తానే చించుకుని.. తనపై అత్యాచారం జరిగినట్టుగా సీన్ ను క్రియేట్ చేసిందని తెలిపారు. పూటేజీని చూపించి విచారించిన తరువాత యువతి తన దుస్తులను తానే చించేసుకుందని అంగీకరించిందని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా విచారణలో వాస్తవాలను గుర్తించామన్నారు. యువతి చెప్పినట్టు కేసులో ఆటో డ్రైవర్ పాత్ర లేదని సీపీ స్పష్టం చేశారు. యువతి అందరినీ తప్పుదోవ పట్టిందని చెప్పారు. ఈ కేసులో ఆటో డ్రైవర్లు తమకు బాగా సహకరించారన్నారు. యువతి కిడ్నాప్‌, అత్యాచారం కేసును తప్పుడు కేసుగా సీపీ మహేష్‌ భగవత్‌ తేల్చిచెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles