AP panchayat Polls phase 2: Voting under way ఏపీలో కొనసాగుతున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలు

Ap panchayat elections updates 38 07 voter turnout till 10 30am vizianagaram tops with 48 polling

panchayat elections, Second Phase, N. Ramesh Kumar, AP Panchayat elections 2021, AP Panchayat elections 2021 results, AP Panchayat election, AP Panchayat election results, Andhra Pradesh Panchayat elections 2021, andhra pradesh panchayat election 2021 voting, andhra pradesh panchayat election phase 2 voting updates, panchayat elections, JanaSena, BJP, TDP, Congress, opposition parties, Andhra pradesh, Politics

Polling for second phase of panchayat election is underway in Andhra Pradesh. In the second phase, as many as 2,786 panchayats and 20,817 wards are up for grabs. As many as 7,507 candidates are fighting for sarpanch posts and 44.876 are in fray for ward members.

ఏపీ ‘పంచాయతీ’ ఎన్నికలు: కొనసాగుతున్న రెండో విడత ఓటింగ్

Posted: 02/13/2021 11:54 AM IST
Ap panchayat elections updates 38 07 voter turnout till 10 30am vizianagaram tops with 48 polling

ఆంధ్రప్రదేశ్ లో చెదురుమదురు ఘటనల మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పంచాయతీ రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం ఆరు గంటల నుంచి పంచాయతీ ఎన్నికలకు ఓటింగ్ ప్రారంభం కాగా, ఉదయం నుంచే ఓటర్లు క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 10.30 గంటల సమాయానికి రమారమి 38శాతం మేర ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 2,786 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా, ఏకంగా 20,817 వార్డులకు సభ్యులను ఓట్లర్లు ఎన్నుకోనున్నారు. ఇక సర్పంచ్ స్థానాలకు 7,507 మంది, 44,876 మంది బరిలో ఉన్నారు.

నోటిఫికేషన్ ఇచ్చిన 3,328 గ్రామ పంచాయతీల్లో 539 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. ఇదిలావుండగా రాష్ట్రంలో జరుగుతున్న రెండో విడత ఎన్నికలలో పలు చోట్ల చెదరుమదురు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బ్యాలట్ పేపర్ల అపహరణ ఓ చోట జరగగా, మరో చోట ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు పోలింగ్ బూత్ లోనే వాగ్వాదానికి దిగడం.. ఇక మరో చోట ఓట్లు అధికంగా పోల్ కావడంతో ఓ వర్గానికి చెందినవారు ఎన్నికలను బాయ్ కాట్ చేయడంలో లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిన్నింటి నడుమ మధ్యహ్నం 10.30 గంటలకు రాష్ట్రంలో ఏకంగా 38శాతం పోలింగ్ నమోదైంది.

ఇక జిల్లాల వారిగా పరిశీలిస్తే.. విజయనగరం జిల్లాలో ఓటర్లు రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికలలో మంచి ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. ఏకంగా ఉదయం 11 గంటలకు ఇక్కడ యాభైశాతం పోలింగ్ నమోదైంది. ఆ తరువాత విశాఖపట్నం జిల్లాలోనూ ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు పోటీపడ్డారు. ఉదయం 10.30 గంటలకు ఇక్కడ 41శాతం మేర పోలింగ్ నమోదైంది. అదే అదే సమయంలో ఉత్తరాంధ్రకు చెందిన మరో జిల్లా శ్రీకాకుళంలో మాత్రం పోలింగ్ మందకొడిగానే సాగింది. ఉదయం 10.30 గంటలకు కేవలం 26.81శాతం మేర పోలింగ్ జరిగింది.

ఇక ఉభయ గోదావరి జిల్లాలోనూ ఓటర్లు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఉదయం 10.30 గంటలకు తూర్పు గోదావరిలో 34.51శాతం.. పశ్చిమ గోదావరిలో 31.06శాతం పోలింగ్ నమోదైంది. ఇటు గుంటూరు జిల్లాలోనూ ఓటర్లు పోటీ పడి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10.30 గంటలకల్లా ఇక్క ఏకంగా 45శాతం పోలింగ్ నమోదైంది. అదే సమయంలో కృష్ణ జిల్లాలోనూ ఓటర్లు ఉదయం నుంచి తమ ఓటు హక్కును వేసుందుకు క్యూలైన్లలో నిల్చుని.. ఉదయం 10.30 గంటల వరకు ఇక్కడ 36శాతం మేర పోలింగ్ నమోదయ్యేలా చేశారు.

అటు ప్రకాశం జిల్లాలోనూ ఉదయం 10.30 గంటల వరకూ 34.14 శాతం మేర ఓటింగ్ నమోదు కాగా, నెల్లూరు జిల్లాలో 36 శాతం, అదే సమయంలో రాయలసీమ జిల్లాల్లో ఓటింగ్ జోరుగా కొనసాగుతోంది. ఇక్కడ ఓటర్లు హుషారుగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. కర్నూలు జిల్లాలో ఉదయం 10.30 గంటల సమయానికి ఏకంగా 47శాతం పోలింగ్ నమోదు కాగా, అనంతపురంలో 46.18శాతం నమోదైంది. ఇక వైఎస్సాఆర్ కడప జిల్లాలో 35.17శాతం నమోదు కాగా.. చిత్తూరులో 33.5శాతం నమోదైంది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 10.30 గంటలకు 38శాతం పోలింగ్ నమోదైంది.

అదే సమయంలో రాష్ట్రంలో పలు చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. గుంటూరు జిల్లా నందిగడ్డ గ్రామంలో గుర్తు తెలియని అగంతకులు బ్యాలెట్ పేపర్లను అపహరించుకుపోయారు. అటు కృష్ణా జిల్లా నిమ్మకూరులోని పోలింగ్ కేంద్రల్లో ప్రత్యర్థి వర్గాల మధ్య వివాదం తలెత్తి ఘర్షణకు దారి తీసింది. ఓటరుకు సహాయకుడిని పంపే విషయంలో ఈ ఘర్షణ జరిగింది. పోలీసులు సకాలంలో స్పందించడంలో సద్దుమణిగింది. అటు గుంటూరు జిల్లా ఈపురు మండలం ఇనిమెళ్లలోని 7వ వార్డులో దొంగ ఓట్లు కలకలం రేపాయి. ఒకరి ఓటు మరోకరు వేస్తుండటంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది, తోపులాటకు దారితీసింది. ఓటర్ల నుంచి వైసీపీకి చెందినవారు బలవంతంగా స్లిపులు లాక్కుంటున్నారని టీడీపీ నేతలు అరోపిస్తున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

శ్రీకాకుళం జిల్లాలో వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో ఓట్లు పెరిగాయని వాటిపై అధికారులు స్పష్టత నివ్వాలని డిమాండ్ చేస్తూ ఓ వర్గానికి చెందినవారు ఎన్నికలను బహిష్కరించారు. ఇక గుంటూరు జిల్లా నకరికల్లు మండలం నర్సింగపాడు రెండో వార్డులో అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు తారుమారు కావడంలో అధికారులు పోలింగ్ నిలిపివేశారు. ఇక ప్రకాశం జిల్లా ఏల్చూరు పంచాయతీలోని 14వ వార్డులోనూ ఇదే సమస్య తలెత్తడంతో అధికారులు పోలింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక్కడ ఓటర్ల బాజితాలో మార్పుల కారణంగా పోలింగ్ అపివేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles