Pfizer withdraws application for COVID vaccine in India ఫైజర్ టీకా వెనక్కు.. అత్యవసర ఔషద ధరఖాస్తు ఉపసంహరణ

Pfizer withdraws application for emergency use of its covid 19 vaccine in india

Pfizer Inc, BioNTech vaccine, COVID-19 vaccine, Pfizer vaccine, sales, profit, Albert Bourla, business, companies, Pfizer, Coronavirus, COVID-19 vaccine, Pfizer COVID-19 vaccine, India

Pfizer has decided to withdraw its application for Emergency Use Authorisation of its COVID-19 vaccine in India. Pfizer will continue to engage with the authority and resubmit its approval request with additional information as it becomes available in the near future.

ఫైజర్ టీకా వెనక్కు.. అత్యవసర ఔషద ధరఖాస్తు ఉపసంహరణ

Posted: 02/05/2021 03:15 PM IST
Pfizer withdraws application for emergency use of its covid 19 vaccine in india

అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఫైజర్‌ జర్మనీకి చెందిన మరో ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోఎన్ టెక్ తో కలసి సంయుక్తంగా అభివృద్ది చేసిన కరోనా వాక్సీన్ కు అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాలని కోరుతూ గత డిసెంబర్ నెలలో భారత డ్రగ్ కంటోలర్ అధారిటీ వద్ద పెట్టుకున్న దరఖాస్తును ఆకస్మికంగా ఉపసంహరించుకుంది. ఈ మేరకు అమెరికాకు చెందిన ఔషధ సంస్థ వెల్లడించింది. భారత్ లో కరోనా టీకా వినియోగానికి దరఖాస్తు చేసుకున్న తొలి సంస్థ ఫైజరే కావడం గమనార్హం.

అయితే భారత్ ఔషధ నియంత్రణ మండలి అధికారులతో జరిగిన భేటీ అనంతరం తాము తమ ధరఖాస్తును ఉపసంహరించుకున్నామని ఫైజర్ సంస్థ ప్రతినిధులు మీడియాకు తెలిపారు. యూకే, బహ్రైన్‌ లలో అనుమతి రాగానే ఫైజర్‌ భారత్ పై ఆసక్తి చూపింది. డిసెంబర్ నెలలోనే ఈ మేరకు ధరఖాస్తు చేసుకుంది. అయితే ఫైజర్‌ దరఖాస్తుపై ఔషధ నియంత్రణ మండలికి చెందిన నిపుణుల కమిటీ ఫిబ్రవరి 3న సమీక్ష నిర్వహించింది. వాక్సీన్ భద్రతపై ఇంకా అదనపు సమాచారం కావాలని కంపెనీ ప్రతినిధులకు తెలిపింది.  ఈ నేపథ్యంలోనే దరఖాస్తును వెనక్కి తీసుకుంటున్నట్లు ఫైజర్‌ వెల్లడించింది.

భారత్ ఔషద నియంత్రంణ మండలి నిపుణుల కమిటీ కోరిన సమాచారం అందుబాటులోకి రాగానే మరోసారి దరఖాస్తు చేసుకుంటామని తెలిపింది. భారత ప్రజలకు కొవిడ్‌ టీకాను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. కొవిడ్‌ నిరోధం కోసం తయారు చేసిన టీకాను దిగుమతి చేసుకునేందుకు అనుమతి కోరింది. అలాగే భారత్ లో క్లినికల్‌ పరీక్షలు తప్పనిసరిగా జరపాలన్న నిబంధనన నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. దీనికి అంగీకరించని నిపుణుల కమిటీ మరింత సమాచారంతో రావాలని స్పష్టం చేసింది.

జర్మనీ సంస్థకు చెందిన బయో ఎన్ టెక్ సంస్థతో కలసి సంయుక్తంగా కోవిడ్ టీకా అభివృద్ది చేసిన ఫైజర్.. తద్వారా ఏకంగా 15 బిలియన్ డాటర్ల(భారత కరెన్సీలో ఏకంగా రూ. లక్ష 94 వేల కోట్లు) అధాయాన్ని కూడా అర్జించాలని అంచనా వేసింది. ఈ మేరకు తమ పూర్తి లాభాల అంచనాను అవిష్కరించింది. కరోనా వాక్సీన్ నేపథ్యంలో ఈ ఏడాది తమ సంస్థ విక్రమాలు ఏకంగా 59.4 బిలియన్ డాలర్ల నుంచి 61.4 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని కూడా అంచనా వేసింది. ప్రస్తుతం అమెరికాతో పాటు పలు దేశాల్లో ఈ వాక్సీన్ ను అత్యవసర ఔషదం కింద పరగణించి విక్రయాలు జరుపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pfizer  BioNTech vaccine  COVID-19 vaccine  Pfizer vaccine  sales  profit  Albert Bourla  India  

Other Articles