Vizag Steel Plant staff agitate against privatisation ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంటు కార్మికుల ర్యాలీ

Visakhapatnam steel plant staff launch protest against privatisation

Rashtriya Ispat Nigam Ltd (RINL), visakhapatnam steel plant, #Save Steel Plant, agitation, Employees, Trade Unions, disinvestment, Steel Plant Movement, vizag, Vishakapatnam, Andhra Pradesh

Demanding the Centre to roll back its call, thousands of Visakhapatnam Steel Plant employees launched a massive rally in the city on Friday morning. Raising slogans of “Save Steel Plant”, the protestors have launched a bike rally from Kurmannapalem to the GVMC office in the city.

విశాఖలో స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికుల ర్యాలీ

Posted: 02/05/2021 04:03 PM IST
Visakhapatnam steel plant staff launch protest against privatisation

విశాఖలో మళ్లీ ఉక్కు ఉద్యమం మొదలైంది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో విశాఖ నుంచి యావత్ రాష్ట్రమంతా ఏకమై.. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ నినదించిన నినాదం మరోమారు వినిపిస్తుంది. నాడు విశాఖలో ఉక్కు పరిశ్రమను నెలకొల్పడానికి నినదించిన ఆంధ్రుడు.. నేడు అదే పరిశ్రమను ఫ్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినదిస్తున్నాడు. దేశం భారీపరిశ్రమలతో స్వయం సమృద్దిగా మారాలని.. స్వయం సాంకేతికతతో సొంతంగా పారిశ్రామిక రంగంలోనూ దూసుకుపోవాలని భారత తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ అనేక భారీ పరిశ్రమలను దేశంలో నెలకోల్పారు.

అయితే ఇప్పటి ప్రభుత్వాలు ఆ భారీ పరిశ్రమలను భారంగా పరిగణిస్తూ వాటి నుంచి ప్రభుత్వ వాటానూ నూటికి నూరు శాతం ఉపసంహరించుకుని ఈ ఏడాది ఏకంగా రూ. లక్ష 75 కోట్లను రాబట్టుకోవాలని లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. దీంట్లో రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ కూడా వుండడం.. దీని ఆధ్వరంలోనే విశాఖ స్టీల్ నడుస్తుండటం కూడా తెలిసింది. దీంతో విశాఖ స్టీల్ ప్లాంటుకు చెందిన కార్మికులు ఇవాళ ఉదయం భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.

కూర్మన్నపాలెం నుంచి విశాఖలోని గాంధీ విగ్రహం వరకు ద్విచక్రవాహనాలతో ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ స్థాపనకు 32 మంది ప్రాణాలను అర్పించిన విషయాన్ని గుర్తు చేసుకున్న వారు.. ప్రస్తుతం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అవసరమైతే తాము ప్రాణ త్యాగాలకు సిద్దమని అన్నారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సాధించుకున్న ఉక్కు పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వబోమని కార్మికులు నినదించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ర్యాలీ నేపథ్యంలో కూర్మన్నపాలెం జంక్షన్‌లో భారీగా పోలీసులు మోహరించారు. ఉద్యోగులు, కార్మికులకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh