Celebs brings global Twitter attention to farm protests రైతులకు అంతర్జాతీయ ప్రముఖుల మద్దతు..

Temptation of sensationalist hashtags says govt as international celebs back farmers protest

Rihanna, Mia Khalifa, Greta Thunberg, Lilly Singh, farmers protests, farmers protests delhi border, barricades at delhi border, singhu border farmers protests, police barricades, protest delhi, farmers laws farm, republic day farmers, farmers tractor rally, farmers rally violent, farmers red fort, farmers farm laws, delhi police, Intelligence bureau, farmers turn violent, farmers rally deviated, farmers ram leela maidan, supreme court committee, delhi, politics

The farmers protest in India grabbed eyeballs internationally after several celebs came out in support of the the protesting farmers. Pop star Rihanna created a flutter when she shared a message about the farmers' protest with a news update and captioned the post asking her followers and fans using the trending #FarmersProtest hashtag. She wrote: “why aren’t we talking about this?! #FarmersProtest.”

రైతులకు అంతర్జాతీయ ప్రముఖుల మద్దతు.. తిప్పికోట్టిన విదేశాంగ శాఖ

Posted: 02/03/2021 03:35 PM IST
Temptation of sensationalist hashtags says govt as international celebs back farmers protest

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ప్రకటించారు అంతర్జాతీయ సెలబ్రిటీలు.. పాప్ సింగర్ రిహన్నా, పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థన్ బర్గ్. వీరికి తోడు పలువురు ప్రపంచ సెలబ్రిటీలు కూడా గొంతు కలిపి మద్దతును ప్రకటించడంతో.. ఇప్పటీ అంశం ప్రపంచ వ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. క్రమేనా ప్రపంచం ప్రఖ్యాతి చెందిన పలువురి ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. దీనిపై ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే నెమ్మదిగా నోరు విప్పుతున్నాయి.

రైతులు గత కొన్ని నెలలుగా చేస్తున్న నిరసనోద్యమానికి తొలత మద్దతు ప్రకటించారు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ త్రూడో. కొద్ది రోజుల క్రితమే ఆయన ఈ విషయమై స్పందించారు. అయితే ఈయన స్పందించిన తరువాత ఈ అంశంపై ఇతర దేశాల ప్రధానులు కానీ, విదేశాంగ మంత్రులు కానీ స్పందించలేదు. దీంతో రైతుల నిరసనకు ఒక్క కెనడా ప్రధాని మాత్రమే స్పందించారని భావిస్తున్న తరుణంలో తాజాగా రిహన్నా స్పందించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, సామాజిక ఉద్యమాల్లో ఉన్నవారితో పాటు కళా రంగంలో ఉన్నవారు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

భారత్ లో రైతు ఉద్యమానికి సంబంధించిన ఓ ఆర్టికల్ ను ట్విట్టర్‌లో షేర్ చేసిన ఆమె.. ‘‘మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకోవడం లేదు?’’ అని ప్రశ్నించారు. కాగా, కొన్ని రోజుల ముందే అమెరికాకు చెందిన ఏడుగురు లామేకర్స్ యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియోకు లేఖ రాశారు. రైతుల సమస్యపై భారత్ తో చర్చించాలని వాళ్లు లేఖలో కోరినట్లు సమాచారం. ఇక, పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థన్‌బర్గ్ కూడా రైతులకు మద్దతుగా ట్వీట్ చేశారు. ‘మేము రైతులకు సంఘీభావంగా నిలబడతాం’ అంటూ ఇంటర్నెట్ సేవల నిలిపివేత వార్తకు సమాధానంగా ట్వీట్ పెట్టారు.

రిహన్నా ట్వీట్‌ స్క్రీన్ షాట్ ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన బ్రిటన్ ఎంపీ క్లౌడియా ‘‘భారత రైతులకు సంఘీభావం ప్రకటిస్తున్నాను. రాజకీయ నాయకత్వం లోపించిన తరుణంలో ఇతరులు ముందుకు రావడం అభినందనీయం. రిహన్నాకు ధన్యావాదాలు’’ అనే అర్థంలో ట్వీట్ చేశారు. దీంతో హస్తిన శివార్లలోని రైతుల ఉద్యమం ఇతర దేశాల్లోనూ వైరల్ గా మారింది. రైతు ఉద్యమంపై వీరు స్పందించడం పట్ల ఇండియా నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దేశ అంతర్గత విషయాల గురించి బయటి వ్యక్తులు మాట్లాడటం ఏంటని ప్రభుత్వ అనుకూలురు మండిపడుతుండగా, సామాజిక బాధ్యతతో స్పందించినందుకు ధన్యవాదాలు అంటూ ప్రభుత్వ వ్యతిరేకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విదేశీ ప్రముఖుల ట్వీట్లపై మండిపడ్డ విదేశాంగ శాఖ

సెలెబ్రెటీల ట్వీట్లుపై భారత విదేశాంగ శాఖ భగ్గుమంది. వాటికి ఏమాత్రం కచ్చితత్వం లేదని, అవి బాధ్యతారాహిత్యమైన ట్వీట్లని మండిపడింది. ఈ మేరకు విదేశాంగ శాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘సంచలనాలకు మొగ్గు చూపే వ్యక్తులే ఇలా చేస్తున్నారు. ఆ ట్వీట్లకు ఏమాత్రం కచ్చితత్వం లేదు. బాధ్యతారాహిత్యం. భారత దేశానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతును కూడగట్టడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. అలాంటి శక్తులే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో గాంధీ విగ్రహాలను ధ్వంసం చేశాయి. ఇలాంటి వారి ట్వీట్లతో దేశం చాలా బాధపడింది.’’ అని విదేశాంగ శాఖ పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles