RaghuRama Raju critisizes his own party on Metro Rail ‘‘రాజధానిపై క్లారిటీ లేకే.. మెట్రో రైలు నిధులు హుళ్లక్కు’’

Ysrcp mp raghurama krishnam raju critisizes his own party on metro rail

Raghurama krishnam raju, Union Budget, Atchannaidu Arrest, Kommareddy Pattabhi, Metro Rail, Gram Panchayat Elections, AP Speaker notices, Privilage committee, Andhra Pradesh, Politics

YSRCP MP Raghurama Krishnam Raju had critisizes his own party for the non allocation of funds in the Union Budget for Metro rail services, The Ruling party rebel MP had also condemn the arrest of TDP AP President Atchannaidu and assault on party spokes person Pattabhi.

రాజధానిపై క్లారిటీ లేకే.. మెట్రో రైలు నిధులు హుళ్లక్కు: వైసీపి ఎంపీ

Posted: 02/03/2021 01:23 PM IST
Ysrcp mp raghurama krishnam raju critisizes his own party on metro rail

రాష్ట్ర అధికార పార్టీకి చెందిన రెబెల్ పార్లమెంటు సభ్యుడిగా ముద్రవేసుకున్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. తాజాగా కేంద్రం ప్రకటించిన వార్షిక బడ్జెట్ లో ఏపీకి సంబంధించి మెట్రో రైలు ప్రసక్తే రాలేదని విమర్శలు వినిపిస్తుండటంపై స్పందించారు. ఒక రాజధాని వుంటే ఈ పాటికే మెట్రోకు అడుగులు పడేవని, అయితే అధికారంలో వున్న వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులంటూ కేంద్రానికి స్పష్టత ఇవ్వకుండా చేయడంతోనే కేంద్రం మెట్రో రైలు ప్రాజెక్టును ప్రకటించలేదని అన్నారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిన మాట వాస్తవమేనన్న ఆయన అది రాష్ట్ర ప్రభుత్వ స్వయంకృతాపరార్థమేనని అన్నారు.

ఈ సందర్భంగా ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యవహారంపై వ్యాఖ్యానిస్తూ, స్థానిక ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఎన్నికలను అత్యంత కట్టుదిట్టమైన భద్రతల నడుమ నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారని.. అందుకు అందివచ్చిన సాంకేతిక విప్లవంతో పలు రకాల యాప్ లను కూడా నూతనంగా రూపోందించి వినియోగిస్తున్నారని అన్నారు. కాగా, రాష్ట్ర ఎన్నికల అధికారపై మంత్రులు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయడం, ఈ అంశంలో స్పీకర్ నోటీసులు ఇవ్వడం దురదృష్టకరం అని రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు.

అచ్చెన్నాయుడు అరెస్ట్ పైనా తన అభిప్రాయాలు వెల్లడించారు రఘురామ. నిమ్మాడలో సర్పంచ్ అభ్యర్థితో అచ్చెన్న మాట్లాడిన తీరు మీడియాలో ప్రసారమైందని, అందులో ఆయన బెదిరింపులకు పాల్పడిన ఘటనలే లేవని అన్నారు. అందులో ఎవరినీ ఉద్దేశించి అచ్చెన్నాయుడు ఎలాంటి ఘాటు వ్యాఖ్యలు చేయలేదని అన్నరు. సామరస్య పూర్వకంగానే ఆయన అప్పన్నతో చర్చించారని.. ఏకగ్రీవం కోసం ప్రయత్నించారని అయినా అచెన్నాయుడు బెదిరింపులకు పాల్పడ్డారని ఆయనను పోలీసులు అరెస్టు చేయడం అర్థరహితమన్నారు.

అచ్చెన్న ఎంతో సంయమనంతో మాట్లాడిన మాటలను బెదిరింపుగా అర్థం చేసుకున్న పోలీసులు.. అదే క్రమంలో విజయవాడలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాబిరామ్ పై జరిగిన దాడిలోనూ తమ మార్కును కనబర్చే ప్రయత్నాలకు రెడీ అవుతున్నారని విమర్శించారు. పట్టాబిపై టీడీపీకి చెందిన పలువురు కార్యకర్తలే దాడి చేశారనో.. రోజు టీవీల్లోకి వచ్చి అదే పనిగా టీడీపీని వెనకేసుకు వస్తున్నాడనో ఎవరో టీవీ వీక్షలు దాడి చేశారని కూడా కేసును మార్చే ప్రయత్నాలు జరగవచ్చునని అన్నారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ఆలయంపై దాడి ఘటనలో ఫిర్యాదు చేసిన వారిపైనే ఆరోపణలు చేయడమే అందుకు నిదర్శనమని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles