12 Children Given Sanitizer Instead Of Polio Drops చిన్నారులకు పోలియో చక్కల బదులు శానిటైజర్

Maharashtra shocker 12 children given sanitizer drops instead of polio vaccine dose

hand sanitizer, National Immunization Drive, polio drops, polio vaccination programme, doctor, health worker, Asha volunteer, medical authorities, Ghatanji’s Kapsi-Kopari village, Yavatmal district, maharashtra, maharashtra news

In a horrific case of negligence, at least 12 kids were given hand sanitizer drops instead of the oral polio vaccine drops at a Primary Health Centre in a Maharashtra village. The incident took place on Sunday in Ghatanji’s Kapsi-Kopari village in Maharashtra’s Yavatmal district.

నిండా నిర్లక్ష్యం: చిన్నారులకు పోలియో చక్కల బదులు శానిటైజర్

Posted: 02/02/2021 11:42 AM IST
Maharashtra shocker 12 children given sanitizer drops instead of polio vaccine dose

దేశం నుంచి పోలియో మహమ్మారిని తరమికొట్టిన ఘనత సాధించిన భారత్.. ఒకటి నుంచి ఐదేళ్ల వయస్సులోపు చిన్నారులకు తప్పనిసరిగా ఏడాదికి ఓ పర్యాయం పోలియో చుక్కలు వేస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ మేరకు ఉద్యమంలా పోలీయో చుక్కలు వేసే ప్రక్రియ జరుగుతుంది. అయితే ఈ ఏడాది జనవరి 31న ఆదివారం రోజు పోలీయో ఆదివారంగా ప్రకటించిన కేంద్రం ఈ ప్రక్రియను దేశవ్యాప్తంగా చేపట్టింది. కాగా మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించడంలో సిబ్బంది నిర్లక్షం చిన్నారుల ప్రాణాలపైకి తీసుకువచ్చింది.

పల్స్ పోలియో కార్యక్రమంలో ఈ జిల్లాలోని వికటించిందని తొలుత వార్తలు వచ్చాయి. అయితే స్థానిక వైద్య ఉన్నతాధికారులకు దృష్టికి కూడా ఆలస్యంగా చేరిన ఈ వార్త.. చిన్నారులలో మాత్రం వికటించడానికి పెద్దగా సమయం తీసుకోలేదు. పోలియో చుక్కలు వేసుకున్న పలువురు చిన్నారులు కొన్ని నిమిషాల వ్యవధిలో అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు, విరోచనాలతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు.. వెంటనే తమ పిల్లలను వసంతరామ్ నాయక్ ప్రభుత్వ మెడికల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వీరికి చికిత్సను అందించగా, ప్రస్తుతం చిన్నారులందరూ కోలుకుంటున్నారని అసుపత్రి డీన్ డాక్టర్ మిలింద్ కాంబ్లి మీడియాకు తెలిపారు.

యావత్మల్ జిల్లాలోని ఘతాంజీస్, ఖాస్సీ-కోపారీ గ్రామంలోని ప్రాథమిక అరోగ్య కేంద్రంలో ఏకంగా 2000 మంది చిన్నారులు పోలీయో చుక్కల వేయించుకున్నారు. అయితే అందులో 12 మంది చిన్నారులకు మాత్రం పోలీయో చుక్కల బదులు.. హ్యాండ్ శానిటైజర్ వేయడంతో అస్వస్థతకు గురయ్యారని అసుపత్రిలో పరీక్షలు జరిపిన వైద్యులు పేర్కోన్నారు. వెంటనే తమ తప్పును తెలుసుకున్న అక్కడి సిబ్బంది తమ చర్యలను కప్పిపుచ్చుకున్నారే తప్ప.. చిన్నారుల అరోగ్యానికి ఏమవుతుందోన్న అందోళన వారిలో కనిపించలేదు. దీంతో ఆ గ్రామ పీహెచ్సీ కేంద్రంలోని వైద్యుడు, హెల్త్ వర్కర్, ఆశా వాలంటీర్లపై అక్కడి వైద్యాధికారులు సస్పెండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles