Train hits bike at thadithota railway gate బైక్ ను ఢీకొన్న రైలు.. పదహారు ముక్కలు..

Train hits bike at thadithota railway gate in rajahmundry

Rajahmundry railway gate, Thadithota railway gate, train bike accident at thadithota, train bike accident at Rajahmundry, train bike accident in Andrha Pradesh. train bike accident CCTV footage, Train, Bike, Accident, Rambha-Urvasi Theatre Road, Thadithota, Rajahmundry, East Godavari, Andhra Pradesh, crime

Just miss.. this is the perfect word which fits to this incident.. where a boy escapes from danger as he moves to a distance after his bike slipped and skided on to the tracks while a train just passed through the tracks and hit the bike. The incident took place at Thadithota of Rajahmundry.

ITEMVIDEOS: బైక్ ను ఢీకొన్న రైలు.. పదహారు ముక్కలు..

Posted: 01/28/2021 02:38 PM IST
Train hits bike at thadithota railway gate in rajahmundry

పెద్దలు చెవి దెగ్గర గూడు కట్టుకునేట్లుగా చెబుతుంటారు. ప్రమాదాల నివారణలోనూ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతీ జాతీయ రహదారిపైన.. ఈ మధ్య టోల్ ప్లాజాలపైనా పెద్ద పెద్ద అక్షరాలతో కూడా నిదానమే ప్రధానము.. అంటూ రాస్తున్నారు. అయినా యువతలో నిదానమన్న లక్షణాలు లేకుండా పోతున్నాయి. దీంతో నిండు నూరేళ్లు చల్లగా బతకాల్సిన యువకులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక మరికోందరు అవయవాలు పోగొట్టుకుని అంగవైకల్యం బారిన పడుతున్నారు. ఇన్నింటీకి వేగమే  కారణమని తెలిసినా.. వేగం కోసం ప్రాణాలను పనంగా పెడుతున్నారు.

అయితే అదృష్టవంతులు మాత్రం కొద్దిలో తప్పించుకుంటున్నారు. లక్ వున్నంత వరకే ఇలా మరి లాక్ కలసి రానప్పుడు ఏంటీ..? అన్న ప్రశ్న ఉదయించక మానదు. అయితే నిదానంగా వెళ్తే ఎంతటి ప్రమాదం నుంచైనా చక్కగా తప్పించుకోవచ్చునన్న విషయం తెలియాల్సిందే. ఇక మరీ ముఖ్యంగా రైల్వే గేట్ పడిన తరువాత దాని కింద నుంచో లేక పక్క నుంచో చటుక్కున వచ్చేసి రైలు వచ్చేలోపు దాటి వెళ్లిపోదామనుకునేవారి సంఖ్య కూడా అధికంగానే వుంది. ఇలాంటి ఘటనల్లో ప్రమాదాలు ఎంత భయంకరంగా వుంటాయో కూడా తెలిసినా.. చూసినా.. ఇలా దాటేవారిలో మాత్రం ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు.

ఇలా తనకేం జరుగుతుంది అన్న భావనతో వున్న ఓ యువకుడు.. బైక్ పై రైల్వే గేటు వేసి వున్నా.. దానిని దాటుకుని ఏకంగా పట్టాల వద్దకు వచ్చి దాటేందుకు ప్రయత్నించినంతలో వైగంగా దూసుకువస్తున్న రైలును చూసి ఆగాడు. అయితే బైక్ ఇంజన్ ను మాత్రం ఆపలేదు. దీంతో బైక్ యాక్సిరలేటర్ పై చేయి పడి బైక్ ఒక్కసారిగా ముందుకు కదిలింది. అంతే బైక్ రైలు పట్టాలపై పడింది. దీంతో వెనక్కు లాగుదామని ప్రయత్రించే లోపు రైలు రానే వచ్చింది. దీంతో భయంతో యువకుడు వెనక్కు జరిగాడు. రైలు వేగానికి బైక్ మరింత ముందుకు జరిగింది.

దీంతో రైలు చక్కాల కిందకు వెళ్లేలేక దాని వేగానికి అక్కడే వున్న స్థంబానికి తగిలింది. ఆ వెంటనే చక్కని బైక్ కాస్తా పదహారు ముక్కలైంది. ఇది చూసిన యువకుడు తలపై చేయి పెట్టుకున్నాడు. అప్పుడు కానీ యువకుడికి నిధానమే ప్రధానమంటే తెలిసిరాలేదు అనుకుంటా. రైల్వే గేటు వేసిన తరువాత దానిని దాటుకుని లోనిక వచ్చి.. రైలు పట్టాలపైకి చేరుకుంటే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయన్న విషయం బోధపడలేదు. ఇక తన తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలో కూడా యువకుడికి అర్థమయ్యివుండదు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి తాడితోట రైల్వేగేట్ వద్ద జరిగింది. మీరూ ఈ వీడియోను ఓ లుక్కేయ్యండీ..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Train  Bike  Accident  Rambha-Urvasi Theatre Road  Thadithota  Rajahmundry  East Godavari  Andhra Pradesh  crime  

Other Articles