Telugu serial hero turns as villian in manikonda విలన్ అవతారం ఎత్తిన సీరియల్ నటుడు..

Sexual assault case filed on koilamma telugu serial hero sameer

koilamma, koilamma serial, serial hero amar, koilamma hero sameer alias amar, actor sameer, sameer alias amar, koilamma sameer, fir on amar, case filed on amar in rayadurgam police station, amar and his friends attack on ladies, koilamma hero amar rowdyism, Sexual Assault case on koilamma hero amar, Telugu TV serial, Hero Sameer, Amar, Sexual assualt case, Raidurgam police station, cyberabad police, Telangana, Crime

Cyberabad Police registered a sexual assault case on TV Serial Hero Amar alias Sameer. After two women had lodged a complaint against him alleging that he had entered into their house in inebriated stage and had warned them. A case had been filed in Raidurgam police station limits.

ITEMVIDEOS: విలన్ అవతారం ఎత్తిన సీరియల్ నటుడు.. మణికొండలో ఘటన

Posted: 01/28/2021 01:20 PM IST
Sexual assault case filed on koilamma telugu serial hero sameer

తెలుగు టీవీ సిరయల్ నటుడుగా గుర్తింపును తెచ్చుకున్న అమర్ అలియాస్ సమీర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పీకల వరకు మధ్యం సేవించి.. ఆ మత్తులో ఇద్దరు యువతులపై దౌర్జన్యానికి పాల్పడటంలో సైబరాబాద్ పోలీసులు ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. సైబరాబాద్ పరిధిలోని రాయదుర్గం పోలిస్ స్టేషన్ పరిధిలోని మణికోండలో ఒంటరిగా నివసిస్తున్న ఇద్దరు యువతుల ఇంట్లోకి చోరబడిన ఆయన వారిపై దౌర్జన్యానికి పాల్పడటంతో పాటు అసభ్యపదజాలాన్ని కూడా వినియోగించాడు. అంతేకాదు వారి వస్తువులను కూడా లాక్కుని వారిని లైంగికంగా వేధించాడు.

దీంతో సమీర్ పై ఇద్దరు యువతులు రాయదుర్గం పోలీసులకు పిర్యాదు చేశారు. రాత్రి పూట ఒంటరిగా వుంటున్న తమ ఇంట్లో సమీర్ తనతో పాటు ముగ్గురు స్నేహితులను వెంటబెట్టకుని వచ్చి నానా హంగామా చేశాడని పిర్యాదు చేశారు. అమర్ తో పాటు అతని గర్ల్ ఫ్రెండ్ స్వాతి మరో ఇద్దరు యువకులు కూడా ఈ ఘటనలో పాల్గోన్నారు. మణికొండలో బోటిక్ వ్యాపారం చేసుకుంటున్నతమపై సమీర్ ఆయన స్నేహితులు దాడి చేసిన దౌర్జన్యానికి పాల్పడ్డారని.. తమ ఖరీదైన వస్తువులను కూడా లాక్కెళ్లారని శ్రీవిధ్య, అపర్ణలు పోలీసులకు పిర్యాదు చేశారు.

తమ వద్ద నుంచి సమీర్ రూ.ఐదు లక్షలు తీసుకున్నాడని, వాటిని తిరిగి చెల్లించకుండా ఎగ్గోట్టడం కోసమే ఈ తరహాలో దౌర్జన్యానికి పాల్పడ్డాడని వారు అరోపించారు. ఇదివరకే పలు పర్యాయాలు డబ్బును తిరిగి చెల్లించమని అడిగినా స్పందించలేదని, దీంతో తాము ఈ మధ్యకాలంలో కొంత ఇబ్బందులకు గురయ్యామని దీంతో డబ్బును తిరిగి చెల్లించాల్సినంగా అడుగుతున్నందున సమీర్ ఈ తరహాలో తమపై దాడి చేసి దౌర్జన్యంగా వ్యవహరించాడని శ్రీవిధ్య, అపర్ణలు తమ పిర్యాదులో పేర్కోన్నారు. సమీర్ నుంచి తమకు ప్రాణహాని కూడా వుందని అరోపించారు. దీంతో వారికి పోలీసులు రక్షణ కల్పించారు. కాగా సమీర్ కూడా యువతులపై పోలీసులకు పిర్యాదు చేసినట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles