After 4 years, VK Sasikala released from prison నాలుగేళ్ల తరువాత జైలు శశికళ విడుదల..

Sasikala released from prison after serving 4 years in disproportionate assets case

VK Sasikala, AIADMK, J Jayalalithaa, Coronavirus, Victoria Hospital, Bowring Hospital, Parappana Agrahara jail, disappropriate assets case, Bengaluru jail, Tamil Nadu, Politics

VK Sasikala, the expelled All India Anna Dravida Munnetra Kazagham (AIADMK) member, on Wednesday completed her prison sentence after 1,442 days behind bars. The 66-year-old is likely to stay in the hospital until she is declared free of Covid-19, according to her advocate

నాలుగేళ్ల తరువాత జైలు నుండి జయలలిత నిచ్చెలి శశికళ విడుదల..

Posted: 01/27/2021 12:49 PM IST
Sasikala released from prison after serving 4 years in disproportionate assets case

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలిగా, అన్నా డీఎంకే పార్టీకి మాజీ ప్రధాన కార్యదర్శిగా తమిళనాడు రాజకీయాలలో చక్రం తిప్పన చిన్నమ్మగా పేరొందిన వీకే శశికళ నాలుగేళ్ల తరువాత జైలు జీవితం నుంచి విముక్తురాలయ్యారు. అక్రమాస్థుల కేసులో వికే శశికళ నాలుగేళ్ల పాటు బెంగళూరులోని పరప్పనా అగ్రహారం జైలులో విశణు అనుభవించారు. అమె జైలు నుంచి విడుదల అయినా.. మరో ఐదు రోజుల పాటు మాత్రం విక్టోరియా అసుపత్రిలోనే చికిత్సను పోందనున్నారు.

జనవరి 20వ తేదీన అమె కరోనా బారిన పడ్డారు. తీవ్ర జ్వరం, శాస్వ తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో అమెను హుటాహుటిన ప్రభుత్వ బోరింగ్ అసుపత్రికి తరలించిన జైలు అధికారులు చికిత్సను అందించారు. అమెకు పరిస్థితి విషమంగా వుండటంతో అమెను తరువాత విక్టోరియా అసుపత్రికి తరలించిన జైలు అధికారులు అక్కడ ఐసీయూలో చికిత్సను అందించారు. అమె పరస్థితి ప్రస్తుతం నిలకడగానే వుందని అమె కోలుకుంటున్నారని చెప్పిన వైద్యవర్గాలు అమెకు ఇప్పటికీ అక్సీజన్ అందిస్తున్నామని చెప్పారు.

అయితే కరోనా మహమ్మారి ప్రోటోకాల్ ప్రకారం అమె జైలు నుంచి విడుదలైనా.. మరో ఐదు రోజుల పాటు మాత్రం అమె అసుపత్రిలోనే చికిత్స పోందాల్సివుంది. కరోనా నెగిటివ్ నివేదిక వచ్చే వరకు అమె అసుపత్రి నుంచి డిశ్చార్జీ కారని అమె తరపు న్యాయవాది తెలిపారు. కాగా అసుపత్రి వర్గాలతో చర్చించిన పిమ్మట డిశ్చార్జీపై నిర్ణయం తీసుకుంటామని శశకళ మేనల్లుడు టీటీవీ దినకరన్ తెలిపారు. ప్రస్తుతం అమెకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని ఆయన తెలిపారు. ప్రస్తుతం అమె ఆరోగ్యం మెరుగ్గానే వుందని అసుపత్రి వర్గాలు కూడా వెల్లడిందాయి.

దీంతో అసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న అమె అభిమానులు అమెకు మద్దతుగా నినాదాలు చేశారు. మరికొందరు అమె జైలు నుంచి విడుదలైన నేపథ్యంలో స్వీట్లు పంచిపెట్టారు. ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాటి పళనిస్వామి రూ.79 కోట్లతో నిర్మించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్మృతిచిహ్నాన్ని అవిష్కరించనున్నారు. ఇక మరోవైపు ఈ ఏడాది ఏప్రిల్- మే నెలల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో అమె విడుదల కావడం.. అరవ అసెంబ్లీ ఎన్నికలపై ఏదైనా ప్రభావం చాటుతుందా.? అన్న కోణంలోనూ రాజకీయ పరిశీలకులు పరిశీలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles