ఫేస్ బుక్.. సామాజిక మాధ్యమ దిగ్గజం.. కోట్లాది మంది అకౌంట్ హోల్డర్లకు తమ భావాలను, అనుభవాలను, అనుభూతులను ప్రపంచానికి తెలియజేసే వేదికగా, గుర్తింపును తీసుకువచ్చే వారధిగా అందరికీ తెలిసిందే. అయితే ఈ ఫేస్ బుక్ ను వినియోగించే దాదాపు 60 లక్షల మంది భారతీయలకు మాత్రం తాజాగా నిద్రను కరువయ్యేలా చేస్తోంది. ఎందుకంటే వారి ఫోన్ నెంబర్లను.. టెలిగ్రామ్ యాప్ లో అమ్మకానికి పెట్టారన్న వార్త భారతీయ ఫేస్ బుక్ యూజర్లను అందోళనకు గురిచేస్తోంది. అండర్ ది బ్రీచ్ పేరుతో ట్విట్టర్ ఖాతా నిర్వహించే సైబర్ నిపుణుడు అలొన్ గాల్ ఈ మేరకు వెల్లడించారు.
ఫేస్ బుక్ పెట్టిన సెక్యూరిటీ వలయాన్ని చేధించిన ఓ సైబర్ దుండగుడు.. అందులో వున్న చిన్న లోపాన్ని అసరాగా చేసుకుని పేస్ బుక్ ఖాతాదారులుగా వున్న భారతీయ యూజర్ల నెంబర్లను తస్కరించి.. వాటిని టెలిగ్రామ్ యాప్ లోని అమ్మకానికి పెట్టాడని తెలిపారు. ఈ దుండగుడి వద్ద ఏకంగా 533 మిలియన్ల మంది ఫేస్ బుక్ యూజర్ల సమాచారంతో పాటు వారి ఫోన్ నెంబర్లు కూడా వున్నాయని అలొన్ గాల్ తెలిపారు. అయితే ఈ విధంగా సమాచార తస్కరణ 2019కి ముందే జరిగిందని చెప్పారు. 2019లో ఈ లోపాన్ని గుర్తించిన ఫేస్ బుక్.. దానిని సరి చేసిందని కూడా గాల్ తెలిపారు.
కాగా ఫేస్ బుక్ యూజర్లతో పాటు వారి ఫోన్ నెంబర్లు సేకరించిన దుండగుడు వాటిని టెలిగ్రామ్ లో ఓ బాట్ ద్వారా అమ్మకానికి పెట్టారు. వీటిల్లో 60 లక్షల మంది భారతీయుల సమాచారం కూడా ఉందని గాల్ తెలిపారు. సదరు హ్యాకర్ సోషల్ మీడియా ఖాతాలు.. వాటి ఫోన్ నెంబర్లతో ఓ డేటాబేస్ తయారు చేసి వాటిని విక్రయిస్తున్నాడని అలొన్ వెల్లడించారు. ఈ డేటాబేస్ తో వ్యక్తి ఫేస్ బుక్ ఖాతా సాయంతో అతని ఫోన్ నెంబర్ కనిపెట్టవచ్చు. దీంతో ఒక్కో ఖాతా ఫోన్ నెంబర్ తెలుసుకోవడానికి 5 డాలర్లు.. అదే పెద్దమొత్తంలో డేటా తెలుసుకోవాలంటే 5వేల డాలర్లు ధరను ఆ హ్యాకర్ నిర్ణయించాడు. ఈ డేటాను జనవరి 12 నుంచి విక్రయానికి ఉంచినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more