Bird Flu Outbreak Confirmed in 10 States So Far దేశంలో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్: ప్రకాశం జిల్లాలోనూ కలకలం..

Bird flu spreads in maharashtra nine states impacted across india so far

Bird Flu, Virus, prakasham, Andhra Pradesh, Murumba, Maharashtra, Delhi, 800 chickens, Poultry farm, birds, crows, pegions, pecocks, hens, poultry, import ban of poultry, avian disease, crime

Maharashtra and Delhi became the eighth and ninth states, respectively, to confirm positive cases for bird flu or avian influenza. Later in the day Uttarakhand confirmed cases of bird flu, becoming the tenth state to be effected by the flu.

దేశంలో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్: ప్రకాశం జిల్లాలోనూ కలకలం..

Posted: 01/11/2021 09:27 PM IST
Bird flu spreads in maharashtra nine states impacted across india so far

భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజుకో రాష్ట్రాలకు రాష్ట్రాలను వ్యాపిస్తూ అందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో బయటపడిన బర్డ్ ఫ్లూ వైరస్ క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది. నిన్నటి వరకు ఏడు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన ఈ వైరస్ ఇవాళ అటు దేశరాజధాని ఢిల్లీతో పాటు అర్థిక రాజధాని ముంబై సహా మహారాష్ట్రకు కూడా పాకింది, దీంతో తొమ్మిది రాష్ట్రాలలో భారీ సంఖ్యలో కోళ్లు, కాకులు, బాతులు, నెమళ్లు ఈ వైరస్ బారిన పడి మృత్యువాతపడుతున్నాయి.

మహారాష్ట్రాలోని పర్బణీ జిల్లా మురుంబా పౌల్ట్రీఫారంలో సుమారు 800 కోళ్లు మృతి చెందాయి. దీంతో ఈ కోళ్ల శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. రిపోర్టులో ఆ కోళ్లు బర్డ్ ఫ్లూ కారణంగానే మృతి చెందినట్లు తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మురుంబా గ్రామానికి ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న ఫారాల్లోని అన్ని కోళ్లను చంపేయాలని అధికారులు ఆదేశించారు. గ్రామానికి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కోళ్లను ఇతర జిల్లాలకు తరలించకూడదని కూడా ఆదేశించారు. ఇప్పటివరకూ కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, యూపీ, గుజరాత్‌లలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అయ్యాయి.

బర్డ్ ఫ్లూతో పౌల్ట్రీ పరిశ్రమ యజమానులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. దీంతో వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బర్డ్ ఫ్లూపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించింది. కేరళ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, యూపీ, మహారాష్ట్ర, ఢిల్లీలోకి ప్రవేశించింది. ఇటు తాజాగా ఏపీలోని ప్రకాశం జిల్లాలోకి కూడా బర్డ్ ప్లూ వ్యాపించిందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. చిన్న గంజాం మండలం పల్లెపాలంలోని సముద్ర తీర ప్రాంతంలో కాకులు, గోరింకలు చనిపోయాయి. ఐదు కాకులు, మూడు గోరువంకలు ఒకేచోట చనిపోయి ఉండడంతో…అవి బర్డ్‌ ఫ్లూ వల్లే మరణించి ఉంటాయని గ్రామస్థులు భయపడుతున్నారు. గ్రామంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Bird Flu  Virus  prakasham  Andhra Pradesh  Murumba  Maharashtra  Delhi  800 chickens  Poultry farm  birds  crime  

Other Articles