AP Employees Unions demand postponement of 'Panchayat' ఏపీలో 'పంచాయితీ' ఎన్నికలను వాయిదా వేయాలి: ఉద్యోగ సంఘాలు

Ap employees unions demand postponement of panchayat

State Election commissioner, Nimmagadda Ramesh Kumar, Gram panchayat elections, AP Employees Unions, Postponement of GP elections, GP election shedule, chief secretary, Adithyanath, High Court, Gopala Krishna dwivedi, public Health, panchayat raj secretary, YS Jagan Mohan Reddy, chief Minister, Andhra Pradesh, YSRCP, TDP, Politics

The Andhra Pradesh state election commission announced the schedule for local body elections in February, The Jagan government has sharply reacted to the development, Meanwhile Employees Unions of the state too demanded for the postponement of Panchayat elections

ఏపీలో ‘పంచాయితీ’ ఎన్నికలను వాయిదా వేయాలి: ఉద్యోగ సంఘాలు

Posted: 01/11/2021 09:15 PM IST
Ap employees unions demand postponement of panchayat

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నగరా మ్రోగించిన నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఎన్నికలను నిలుపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు కూడా పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమీషన్ నిమ్మగడ్డ రమేశ్ నిర్ణయాన్ని పూర్తిగా తప్పుబడుతున్నాయి. కోవిడ్ మహమ్మారికి చెక్ పెట్టేందుకు కరోనా వాక్సీన్ ను కేంద్ర ప్రభుత్వం దేశపౌరులకు అందించే సమయంలో ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించడం సముచితం కాదని స్పష్టం చేస్తున్నాయి,

ఎన్నికల నిర్వహణ విషయంలో కమీషనర్ మరోమారు పునరాలోచన చేయాలని ఏపీ ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యచరణ సమితి డిమాండ్ చేసింది. ఇప్పటికే ఓ వైపు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్డును విడుదల చేస్తామని ప్రకటించగా, అదే సమయంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక తాజాగా ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా రంగంలోకి దిగి కరోనా కష్టకాలంలో ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు విడుదల చేయడాన్ని తప్పుబట్టింది, ఉద్యోగులు కూడా కరోనా విషయంలో అందోళన చెందుతున్నారని, ఉద్యోగుల ప్రాణాలను పణ్ణంగా పెట్టి ఎన్నికల నిర్వహణ చేయలేమని జేఏసీ నేతలు తేల్చిచెబుతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై.. ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య విభేదాలు నెలకొన్నాయి .. స్థానిక ఎన్నికల నిర్వహణకు ఇది కరెక్ట్ టైం కాదని ప్రభుత్వం చెబుతుంటే… పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షెడ్యూల్ ఇవ్వడం వివాదానికి దారితీసింది. ఈ పరిస్థితుల్లో… జగన్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. ఎస్ఈసీ నోటిఫికేషన్‍‌ను సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుత పరిణామాలను వివరిస్తూనే… షెడ్యూల్‌పై స్టే ఇవ్వాలని ఆ పిటిషన్‌లో పేర్కొంది. పరిస్ధితులు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles