Bhuma Akhila Priya's bail plea rejected మూడు రోజుల పోలీస్ కస్టడీకి భూమా అఖిలప్రియ..

Kidnapping case ap former minister bhuma akhila priyas bail plea rejected

Bhuma Akhila Priya, Bhargava Ram, Bowenpally Kidnap case, police custody, secundrabad court, CCTV footage, Kidnap case, Hockey player Praveen Rao, Praveen Rao kidnap case, Bowenpally, Allagadda, Kurnool, Hyderabad, Hyderabad latest news, Telangana, Crime news

A Secunderabad court on Monday rejected the bail petition of former Andhra Pradesh Tourism Minister Bhuma Akhila Priya, the prime accused in a high profile kidnapping case in Hyderabad. The city police had booked the TDP leader, along with her husband Bharghav Ram and eight other persons on January 6 for their alleged involvement in the kidnapping case.

మూడు రోజుల పోలీస్ కస్టడీకి భూమా అఖిలప్రియ.. బెయిల్ నిరాకరణ

Posted: 01/11/2021 11:04 PM IST
Kidnapping case ap former minister bhuma akhila priyas bail plea rejected

తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో పరాభవం ఎదురైంది. అమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో బెయిల్ వస్తుందన్న భూమా అఖిలప్రయి మద్దతుదారుల ఆశలపై న్యాయస్థానం నీళ్లు చల్లింది. కిడ్నాప్ కేసులో అరెస్టైన అమె గర్భవతి అని అమెకు నిత్యం వైద్యుల పర్యవేక్షణ అవసరమని అమె తరపు న్యాయవాదులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా న్యాయస్థానం అమె బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. వ్యక్తుల అపహరణ కేసులో అభియోగాలను ఎదుర్కోంటున్న వ్యక్తులకు అంత త్వరగా బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

అఖిల ప్రియ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్ ను విచారించిన సికింద్రాబాద్‌ కోర్టు విచారణ ముందు అమె తరపు న్యాయవాదులు ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా, కావాలనే కేసులో ఇరికించారని అఖిలప్రియ తరుపు న్యాయవాదులు వాదించగా… అఖిలప్రియకు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను మార్చే అవకాశం ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. జైలులో అఖిలప్రియ కిందపడడంతో ముక్కు, నోటి నుంచి రక్తం వచ్చిందని న్యాయస్థానంలో మెమో దాఖలు చేయగా.. తక్షణమే ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.

దీంతో జైలు అధికారులు అఖిలప్రియను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం అమెకు బెయిల్ నిరాకరించింది. అఖిల ప్రియతో పాటు ఆమె భర్త, అనుచరులను అరెస్ట్ చేయాల్సి ఉందని చెప్పారు. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేయాల్సి ఉందని.. దాంతో పాటు సంతకాలు చేయించుకున్న దస్త్రాలు స్వాధీనం చేసుకోవాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఇక అదే సమయంలో అఖిలప్రియను న్యాయస్థానం మూడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. ఈ నెల 13 వరకు అమెను పోలీసుల కస్టడీకి అప్పగించింది. దీంతో పోలీసులు అమెను తమ కస్టడీలోకి తీసుకుని అమెను ప్రశ్నించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles