Army officer staged Shopian encounter for ₹20L, say police షోఫియాన్ ఎన్ కౌంటర్ పై పోలీసు చార్జీషీటు సంచలనం

Shopian encounter was staged for rs 20 lakh reward says chargesheet

Shopian encounter, Amshipora encounter, Shopian fake encounter, Army man charged, charge sheet filed, fake encounter, Captain Bhoopinder Singh, Major Basheer Khan, Rashtriya Rifles, prize money, Crime

Army Captain Bhoopinder Singh alias Major Basheer Khan of 62 Rashtriya Rifles had taken a lead in engaging the three 'militants', who turned out to be civilians later, in a 'staged' gunfight in Shopian in July 2020, 'with an eye on the prize money of ₹20 lakh'.

షోఫియాన్ ఎన్ కౌంటర్ పై పోలీసు చార్జీషీటులో సంచలన విషయాలు

Posted: 01/11/2021 08:40 PM IST
Shopian encounter was staged for rs 20 lakh reward says chargesheet

జమ్మూకాశ్మీర్ లో గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్ పథకం ప్రకారం ఆర్మీ అధికారులు చేసిన ఘటనా..? లేక వారు ఉగ్రవాదులా.? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం పోలీసుల చార్జీషీటు సంచలనంగా మారింది, జమ్మూకాశ్మీర్ లోని షోపియన్ లో ముగ్గురు యువకులను ఓ ఆర్మీ కెప్టెన్ ఎన్‌కౌంటర్ చేసిన ఘటన విధితమే. అయితే వీరు ఉగ్రవాదులని.. అందుకనే వారి మాటు వేసి ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని ఘటన అనంతరం ఆర్మీ అధికారులు పేర్కోన్నారు. అయితే పోలీసులు మాత్రం దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు, ఇది ఆర్మీ అధికారులు పథకం ప్రకాం చేసిన ఎన్ కౌంటర్ అని పేర్కోంటున్నారు, ఇదే ఇప్పుడు పెను సంచలనంగా మారింది.

జమ్మూకాశ్మీర్ లో జరిగిన ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేస్ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు, అందులో ఆర్మీ అధికారులపై అభియోగాలు కూడా మోపారు, ఆర్మీ అధికారులు కేవలం రూ.20లక్షల రివార్డు మనీ కోసమే ఈ ఘటనకు పాల్పడి దానిని ఎన్ కౌంటర్ గా అభివర్ణించారని, అయితే ఆర్మీ అధికారులు ఎన్ కౌంటర్ లో మరణించిన వారు ఉగ్రవాదులు కాదని వారు పేర్కోంటున్నారు, ఈ మేరకు చార్జీషీటులో వారు ఆర్మీ అధికారులపై అభియోగాలను మోసారు, ‘ఆ ఎన్‌కౌంటర్‌ను ప్రస్తావిస్తూ.. కెప్టెన్ భూపేంద్ర సింగ్ (62RR) మరో ఇద్దరు కలిసి ఉద్దేశ్యపూర్వకంగానే అక్కడి సాక్ష్యాలు తారుమారుచేశారు. కావాలనే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రైజ్ మనీ రూ.20లక్షలు దక్కించుకోవాలని ప్లాన్ చేశారు’ అని పోలీస్ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు.

రాజౌరీకి చెందిన యువకులు ఇంతియాజ్ అహ్మద్, అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ ఇబ్రార్ లను షోపియన్ జిల్లాలోని అంశీపురాలో టెర్రరిస్టులంటూ ముద్రవేసి ఎన్ కౌంటర్ చేశారని తేలింది. షోపియన్ ఎస్పీ అమృత్‌పాల్ సింగ్ మాట్లాడుతూ.. ఛార్జి షీట్ అనేది ప్రస్తుతం కోర్ట్ ప్రాపర్టీ.. వారికి కావాలంటే బయటపెడతారు లేదంటే లేదు అని చెప్పారు. కెప్టెన్ భూపేంద్ర సింగ్, తబీష్ నజీర్, బిలాల్ అహ్మద్ లోనె పేర్లను 14వందల పేజీల ఛార్జి షీట్ లో ఫైల్ చేసి చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ముందు ఉంచారు. ఆ ఘటన జరిగిన తర్వాతనే ఆ ప్రదేశానికి పలు డైరక్షన్లలో తాము చేరుకున్నామని పేర్కోన్న ఆర్మీ అధికారులు.. ఆ తర్వాత ఏదో శబ్దం వచ్చిందని అప్పుడే ఘటనాస్థలికి చేరుకున్నామని చెబుతున్నారు. నిజానికి ముందుగా అంతా కలిసే ఎన్‌కౌంటర్ చేశామని చెప్పినా.. తర్వాత ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ను అతిక్రమించి ప్రవర్తించారని అధికారులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles