Pawan flays CM Jagan for not keeping his word పర్యావరణహిత పరిశ్రమీకరణ రావాలి: పవన్ కల్యాణ్

Not against divis plant if it is safe for environment says pawan kalyan

Pawan Kalyan, Divis pharma, YS Jagan, Hatcheries, Nadedla Manohar, Kakinada, Thondangi mandal, East Godavari, Andhra Pradesh, politics

Jana Sena chief K Pawan Kalyan demanded that Chief Minister Y S Jagan Mohan Reddy keep his promise of not allowing the setting up of Divis pharma unit at Kothapakalu village in Thondangi mandal of East Godavari district.

మత్య్సకారులను ఇబ్బంది పెడితే అందోళనకు సిద్దం: పవన్ కల్యాణ్

Posted: 01/09/2021 09:22 PM IST
Not against divis plant if it is safe for environment says pawan kalyan

మత్య్సకారుల జీవనాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్న దివిస్ ఫార్మ పరిశ్రమ దౌర్జన్యాలను సహించేది లేదని, అవసరమైతే స్థానికుల కోసం ఆందోళన బాట పట్టడానికైనా తాను సిద్దమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అలాగని తాను పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, పారిశ్రామికరణ జరగాలి, స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు రావాలని కాంక్షించే వ్యక్తిని తానని అన్నారు, అయితే అదే సమయంలో మన భావితరాలకు మనం ఇచ్చే అస్తులు, అంతస్ధులు ఎంత ముఖ్యమో అంతకన్నా.. ఆ తరం మనుగడ సాగించాలంటే మంచి నీరు, గాలి, పర్యావరణం అవసరమని మన గుర్తెరుగాలని అన్నారు. దివిస్ పరిశ్రమ కూడా తమ వ్యర్థాలతో అటు సముద్రాన్ని, ఇటు నేల, గాలిని కలుషితం చేస్తోందని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తే వారిపై కేసులు పెట్టి జైలులో పెట్టిస్తారా.? అంటూ నిలదీశారు.

పరిశ్రమలు వున్న ప్రాంతాల్లో ఫార్మా లాంటి సంస్థలను ఏర్పాటు చేస్తే అక్కడ లభించే మౌళిక వసతులు వేరే విధంగా వుంటాయని, అయితే అందుకు బిన్నంగా ఈ దివిస్ సంస్థను తొండంగి మండలం కొత్తపాకల గ్రామంలో ఏరప్ాటు చేయడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారని, ఇక ఇప్పుడు సంస్థ ఏర్పాటు అయిన తరువాత దీనిని వ్యతిరేకించడం కన్నా దాని నుంచి వ్యర్థాలు బయటకు రాకుండా పరిశ్రమలోనే శుద్దీ చేసేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సంస్థలదని, ఆ విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు, దివిస్ బాధిులుతుగా మారిన మత్య్సాకరులు మత్య్స సఃంపదను కాపాడుతూనే.. తమ ఉపాధిగా కూడా మార్చుకునే జ్ఞానం వున్నవారని, చదవుతో రానీ అపారజ్ఞానం వీరి సోంతమని, వారిపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయవద్దని పరిశ్రమ యాజమాన్యాన్ని ఆయన హెచ్చరించారు,

ఇక తాను రాష్ట్ర విభజన సమయంలో పార్టీని స్థాపించింది తనకేదో నష్టం వాటిల్లిందని కాదని, తన ప్రాంత యువతకు అన్యాయం జరుగుతుందన్న అందోళనలోనని అన్నారు, తాము నమ్ముకున్న సిద్దాంతాలే తమ పార్టీని అధికారంలోకి తీసుకువస్తాయని ధీమా వ్యక్తం చేశారు, సైద్దాంతిక పరంగా స్థిరంగా లేని వారు మాత్రమే వందల కోట్ల రూపాయలను వెచ్చించి రాజకీయాలు చేసి మనుగడ సాగించాలని భావిస్తారని, అలాంటి వారి రాజకీయాలు తాత్కాలికమేనని అన్నారు, వందల కోట్ల డబ్బు, వందల ఎకరాల భూములిస్తే బిడ్డల భవిష్యత్ బాగుంటుందా?. సిద్ధాంతాలను అచరించే రాజకీయాలు మనతోనే పాటు ఎదిగి వటవృక్షంగా ఎదుగుతాయని పేర్కోన్నారు, ఇక తాను ఇక్కడకు వచ్చింది కూడా దౌర్జన్యం చేయడానికి కాదని.. అదే సమయంలో మత్య్సకారులను వేధిస్తే సహించేది లేదని అన్నారు.

పవన్‌ కల్యాణ్‌ దివిస్ పర్యటన నేపథ్యంలో ఉదయం రాజమహేంద్రవరం బురుగుపూడి విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి రోడ్‌ మార్గంలో అన్నవరం మీదుగా.. అభిమానులు పార్టీ కార్యకర్తలతో ర్యాలీ మధ్య తొండంగి చేరుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ పర్యటనకు అనుమతి ఇచ్చే విషయంలో హైడ్రామా నడిచింది. దివిస్‌ పరిశ్రమ ఏర్పాటును నిరసిస్తూ స్థానికులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వస్తున్న పవన్‌ కల్యాణ్‌ కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున ఆయన పర్యటనకు అనుమతి లేదని తొలుత జిల్లా ఎస్పీ ప్రకటించారు. పవన్‌ పర్యటనతో శాంతిభద్రతల సమస్య వస్తుందని.. అందుకే అనుమతి నిరాకరిస్తున్నట్టు వెల్లడించారు. తరువాత జనసేన నాయకులు ప్రభుత్వం, పోలీసులతో మాట్లాడిన తరువాత అనుమతించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles