తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత భూమా అఖిలప్రియను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ బోయిన్ పల్లిలోని మనోవికాస్ నగర్ కు చెందిన సీఎం బందువుల ఇంటికి ఐటీ అధికారుల పేరుతో చోరబడిన అగంతకులు ప్రవీణ్ రావు, అతని సోదరులు సునీల్ రావు, నవీన్ రావులను సినీపక్కిలో నిన్న రాత్రి కిడ్నాప్ చేశారు, కాగా వారి బంధువలు పిర్యాదుతో అప్రమత్తమైన అధికారులు టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దింపగా, ముగ్గురినీ వికారాబాద్ లో గుర్తించి.. కిడ్నాపర్ల నుంచి రక్షించారు, వారంతా సురక్షితంగా వున్నారని పోలీసులు తెలిపారు, దీంతో సీఎం బంధువుల కిడ్నాప్ కేసు సుఖాంతమైంది.
కాగా, ఈ కేసులో మొత్తం ఘటన వెనుక కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న భూమా అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, కూకట్ పల్లిలోని లోథా అపార్ట్ మెంట్స్ సమీపంలో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె వాహనంలోనే పోలీసు స్టేషన్ కు తరలించారు. నార్త్ జోన్ మహిళా ఇన్ స్పెక్టర్ ఆధ్వర్యంలో అఖిల ప్రియను అరెస్ట్ చేశారు. బోయిన్ పల్లి మహిళా పోలీసు స్టేషన్ లో ఆమెను విచారించి, ఆపై కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. అయితే ఈ కేసుకు సంబంధించి భూమా అఖిలప్రియను అరెస్టు చేయగా, భూవ్యవహారానికి సంబంధించే ఈ ఘటన చోటుచుసుకున్నట్లు తెలుస్తోంది, ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
సీఎం బంధువుల ఇంటికి మూడు కార్లలో వచ్చిన దుండగులు ఆదాయపన్ను శాఖ అధికారులమంటూ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ ముగ్గురు సోదరులను బెదిరించి వారిని అదుపులోకి తీసుకుంటున్నామని తమతో రావాలని వారిని కార్లలో తీసుకెళ్లారు, వారితో పాటు ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ల కూడా స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. అయితే అనుమానం వచ్చిన బంధువులు ఐటీ అధికారులు అదుపులోకి ఎలా తీసుకుంటారని, ఇది కిడ్నాప్ అని అనుమానంతో హైదరాబాద్ పోలీసులకు పిర్యాదు చేయడంతో పాటు సీపీ అంజనీకుమార్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ప్రత్యేక బృందాలను, టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు. ప్రవీణ్ రావు కిడ్నాపైన విషయం తెలియడంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
(And get your daily news straight to your inbox)
Jan 25 | 2016 నవంబర్ 8వ తేదీ అనగానే దేశ ప్రజలకు బాగా గుర్తుండిపోయే అంశం పాత పెద్ద నోట్ల రద్దు. దాని పర్యవసానం దాదాపుగా ఆరు నెలలు వరకు దేశ ప్రజలపై వుండిపోయింది. అనేక ఆంక్షలు,... Read more
Jan 25 | కన్నడ చలన చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. యువ నటి, కన్నడ బిగ్ బాస్ సీజన్-3 కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య తన ఆశ్రమ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు, ఆమె మృతదేహం సీలింగ్... Read more
Jan 25 | వంశపారంపర్య, వారసత్వ రాజకీయాలపై బీజేపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ధీటుగా ఎదుర్కోన్నారు పశ్చిమ బెంగాల ముఖ్యమంత్రి మమతా బెనర్జి మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ. వారసత్వ రాజకీయాలపై తనతో పాటు తన మేనత్త... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంచాయతీ ఎన్నికలకు రీషెడ్యూల్ చేశారు. పంచాయతీ... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ మార్చి తరువాత నిర్వహించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదరుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికలను యధావిధిగా... Read more