Centre-Farmer Talks On Repeal Of Farm Laws ట్రాక్టర్ ర్యాలీ ట్రైలర్ కు సిద్దమా.? కేంద్రానికి రైతు సంఘాల సవాల్..

Farmers protest unions postpone tractor march due to rains set to intensify stir in coming days

India, Farmers, shut malls, shut petrol bunks, Supreme Court, resolve farmers protest, Agriculture sector, Corporates, minimum support price, Fertility, Agri products, political parties, Politics, singhu Farmers protest, corporates in Agri sector, farmers protest central bill, farmers produce trade and commerce, farmers empowerment and protection bill, farmers price assurance, farmers farm services act, farmers essential commodities, congress, national congress, political parties, Politics

Protesting farmer unions deferred their proposed tractor march from 6 January to 7 January due to a bad weather forecast, even as they asserted they will intensify their stir in the coming days. Addressing a press conference at Singhu Border, union leaders said thousands of farmers will take out the tractor march from all protest sites to the Kundli-Manesar-Palwal (KMP) on 7 January.

ట్రాక్టర్ ర్యాలీ ట్రైలర్ కు సిద్దమా..? కేంద్రానికి రైతు సంఘాల సవాల్..

Posted: 01/06/2021 09:23 PM IST
Farmers protest unions postpone tractor march due to rains set to intensify stir in coming days

(Image source from: Indianexpress.com)

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ దేశరాజధాని శివార్లలోని సింఘు, టిక్రీ ప్రాంతంలో రైతు సంఘాలు చచేపడుతున్న ఆందోళనలు కొలిక్కి రాకపోవడంతో రైతులు తమ ఉద్యమాన్ని ఉద్దృతం చేస్తున్నారు. నెల రోజులకు పైగా సాగుతున్న రైతుల అందోళనలపై ఏడో విడత చర్చలు కూడా ముగింపు పలుకలేకపోవడంతో ఇదంతా కేంద్రం చేస్తున్న తాత్సారమే అంటూ రైతులు అరోపిస్తున్నారు. దీంతో కేంద్రప్రభుత్వానికి తమ తడాఖా ఏంటో చూపించాలని నిర్ణయించుకున్నాయి. ఇంతకుముందు హెచ్చరించినట్లుగానే ట్రాక్టర్ మార్చు కోసం రైతులు సమాయత్తం అవుతున్నారు.

తమ డిమాండ్లకు కేంద్రం సానుకూలంగా దిగిరాని పక్షంలో ఆందోళనలను మరింత తీవ్రం చేస్తామని.. మాల్ లు, పెట్రోల్ బంకులు మూసివేయిస్తామని ఇదివరకే హెచ్చరించిన రైతు సంఘాలు.. ఇక త్వరలోనే కేంద్రానికి తమ ఉద్యమ ట్రైలర్ రుచి చూపిస్తామని హెచ్చరిస్తున్నాయి, ఈ ట్రైలర్ కాస్తా రానున్న గణతంత్ర దినోత్సవం రోజన సినిమాగా కూడా మారవచ్చునని, అయితే అది జరగడం, జరగకపోవడం అంతా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే వుందని పేర్కోంటున్నారు. తమ ప్రధాన డిమాండ్లైన మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం బేషరుతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు కనీస మద్దతు ధరపై చట్టబద్దతను చేయాలని పట్టుబడుతున్నారు,

కేంద్రంతో ఇప్పటి వరకు ఏడుసార్లు జరిగిన చర్చలు నిష్ఫలంగా ముగిశాయి. ఇటు రైతులు కానీ, అటు ప్రభుత్వం కానీ మెట్టు దిగేందుకు అంగీకరించడం లేదు. దీంతో చర్చల్లో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని భావిస్తున్న రైతు సంఘాలు ఈ నెల 26న రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో ట్రాక్టర్ మార్చ్ చేపట్టాలని నిర్ణయించాయి. కాగా, ఈ నెల 7న ఢిల్లీ సరిహద్దులో నిర్వహించనున్న ట్రాక్టర్ మార్చ్‌తో కేంద్రానికి ట్రైలర్ చూపిస్తామని హెచ్చరించాయి. రైతులు, కేంద్రం మధ్య ఈ నెల 8న 8వ విడత చర్చలు జరగనుండగా, ఒక్క రోజు ముందు ట్రాక్టర్ ర్యాలీకి రైతులు పిలుపునివ్వడం గమనార్హం.

చర్చలు విఫలమైన నేపథ్యంలో గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీ నాలుగు సరిహద్దుల్లో ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న ‘దేశ్ జాగరణ్ అభియాన్’ రెండు వారాలపాటు కొనసాగుతుందన్నారు. అనంతరం దేశవ్యాప్తంగా నిరసనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో ‘ట్రాక్టర్ కిసాన్ పరేడ్’ నిర్వహించనున్నట్టు క్రాంతికారి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు దర్శన్ పాల్ ఇప్పటికే ప్రకటించారు. 23న ఆయా రాష్ట్రాల్లోని గవర్నర్ల ఇళ్లవైపు రైతులు కవాతు నిర్వహిస్తారని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles