AP High Court rules out on declaration of CM at Tirumala ఆ హోదాలోని వ్యక్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు: హైకోర్టు

No need for cm to give declaration on religion at tirumala rules ap high court

jagan entry into tirumala, ttd, Andhra Pradesh High Court, YS JaganMohan Reddy, Tirumala Tirupati Devasthanam, Other religion, declaration, Vijayawada, andhra pradesh, politics

The Andhra Pradesh High Court has ruled that there is no need for Chief Minister Y.S. Jagan Mohan Reddy to submit a declaration on his religion during his visit to the Lord Venkateswara temple of the Tirumala Tirupati Devasthanams.

‘‘ఆ హోదాలోని వ్యక్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు’’

Posted: 12/31/2020 07:52 PM IST
No need for cm to give declaration on religion at tirumala rules ap high court

పవిత్ర పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారాలపై చెక్ పెట్టేందుకు ఫుణ్యక్షేత్రాలకు వెళ్లే అన్యమతస్థులు.. అలాంటి ప్రచారాలు చేపట్టబోమని సెల్ప్ డిక్లరేషన్ ఇవ్వడం అనవాయితీగా వస్తోంద. ఇదే కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల దేవస్థానంలోనూ అమల్లో వుంది. అయితే ఈ నిబంధనలు మునుప్పెన్నడూ హోదా కలిగిన వ్యక్తుల విషయంలో రగడకు దారితీయలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయంలో మాత్రం పెద్ద వివాదాన్నే రేపింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించిన నేపథ్యంలో డిక్లరేషన్ ఇవ్వకపోవడంతో దుమారం రేగింది.

తిరుమల వెళ్లిన‌ జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వకపోవడం చట్ట విరుద్ధమని గుంటూరు జిల్లా వైకుంఠపురానికి చెందిన రైతు ఆలోకం సుధాకర్‌బాబు వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు 27 పేజీల తీర్పును వెలువరించింది. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ తీర్పు వెల్లడించారు. హిందూయేతరుడిగా వ్యక్తిగత హోదాలో వెళితేనే డిక్లరేషన్‌ అవసరమని చెప్పారు. వైఎస్‌ జగన్‌ సీఎం హోదాలో బోర్డు ఆహ్వానం మేరకు తిరుమల వెళ్లారని గుర్తు చేశారు. జగన్ పై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలను చూపడంలో పిటిషనర్‌ విఫలమయ్యారని కోర్టు తెలిపింది.

జగన్ క్రైస్తవుడు అని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలను కోర్టు ముందుంచలేదని చెప్పింది. చర్చికి వెళ్లి ప్రార్థనలు చేయడం, క్రైస్తవ సభలకు హాజరు కావడం వంటి వాటితో ఓ వ్యక్తిని ఆ మతానికి చెందిన వాడిగా పరిగణించలేమని తెలిపింది. పిటిషనర్ చేస్తోన్న వాదనతో అధికరణ 226 కింద ఓ పిటిషన్‌ వేస్తే సరిపోదని చెప్పింది. ప్రమాణపూర్వక అఫిడవిట్ల రూపంలో ఆధారాలను కోర్టుకు సమర్పించాలని తెలిపింది. క్రైస్తవ సువార్త సమావేశాల్లో, చర్చి ప్రార్థనల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారని, దీంతో ఆయన క్రిస్టియన్‌ అవుతారని పిటిషనర్‌ చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది.

విజయవాడ గురుద్వారలోనూ జగన్ ప్రార్థనలు చేశారని, ఆయన సిక్కు మతాన్ని అనుసరిస్తున్నట్లా? అని ప్రశ్నించింది. శ్రీవారికి సీఎం పట్టువస్త్రాలు సమర్పించడం అనవాయితీగా వస్తోందని పిటిషనరే చెబుతున్నారని, సర్కారు తరఫున కైంకర్యపట్టి సమర్పించే అనవాయితీ చాలా కాలం నుంచే టీటీడీ సాంప్రదాయాల్లో భాగంగా కొనసాగుతోందని కోర్టు పేర్కొంది. సీఎంగా ఎవరున్నా ఆనవాయితీ కొనసాగుతూనే ఉందని చెప్పింది. దీంతో పిటీషనర్ దాఖలు చేసిన పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles