Breakthrough as govt accepts two demands of farmers ఆందోళన విరమణకు నిరాకరించిన రైతన్న.. సాగు బిల్లుల వెనక్కే డిమాండ్..

Farm laws stir breakthrough as govt accepts two demands of farmers

India, Farmers, Supreme Court to form committee to resolve farmers protest, Agriculture sector, Corporates, minimum support price, Fertility, Agri products, political parties, Politics, singhu Farmers protest, corporates in Agri sector, farmers protest central bill, farmers produce trade and commerce, farmers empowerment and protection bill, farmers price assurance, farmers farm services act, farmers essential commodities, congress, national congress, political parties, Politics

The widely anticipated sixth round of talks finally led to some headway in the standoff between the Union government and protesting farm unions on Wednesday, with the Centre acceding to the demand to spare farmers heavy fines for crop-residue burning, as provided for in an anti-pollution ordinance, and to continue the current mechanism of giving subsidised power for agricultural use.

ఆందోళన విరమణకు నిరాకరించిన రైతన్న.. సాగు బిల్లుల వెనక్కే డిమాండ్..

Posted: 12/31/2020 07:40 PM IST
Farm laws stir breakthrough as govt accepts two demands of farmers

(Image source from: Hindustantimes.com)

కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హస్తిన శివార్లలోని సింఘు, టిక్రీల వద్ద జాతీయ రహదారులపైనే నెల రోజులకు పైగా ఆందోళనలు చేస్తున్న రైతులతో కేంద్రం జరిపిన చర్చలు నిష్పలమయ్యాయి. కేంద్రమంత్రుల బృందంతో నిన్న రైతు సంఘాల నేతలు ఐదు గంటలకు పైగా చర్చలు జరిపారు. అయితే కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లుల ఉపసంహరణే తమ ప్రధాన డిమాండ్ అంటూ రైతు సంఘాలు భీష్మించడంతో కేంద్రం చర్చలు మరోమారు విఫలమయ్యాయి.

రోజురోజుకూ పడిపోతున్న ఉష్టోగ్రతలు నేపథ్యంలో నెల రోజులుగా యుములను కరిచే చలిలో ఇప్పటికే పలువురు రైతులు ప్రాణాలను సైతం చలిపులి పంజాతో హరించింది. అయినా ధైర్యం కోల్పోని రైతన్నలు తమ అవేదనను, కష్టాన్ని పంటికింద బిగువ పట్టుకుని తమ డిమాండ్ నెరవేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. రైతన్నలను దారికి తెచ్చుకునేందుకు కేంద్రం చర్చల పేరుతో తాత్సారం చేస్తోందన్న అరోపణలు వస్తున్నా.. చలికి తట్టుకోలేక రైతులు అందోళనను విరమింస్తారన్న వద్దంతులు వ్యాపిస్తునన్నా.. రైతులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

ఇదిలావుండగా, రైతుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కనీస మద్దతు ధరపై కమిటీ వేసేందుకు, విద్యుత్ బిల్లులను పెండింగులో పెట్టేందుకు అంగీకరించింది. మిగతా డిమాండ్లను కూడా పరిగణనలోకి తీసుకుంటామని, కాబట్టి ఆందోళన విరమించాలని రైతులను కోరింది. అయితే, రైతులు మాత్రం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని, అప్పటి వరకు ఆందోళన కొనసాగుతుందని తేల్చి చెప్పారు. దీంతో ఆరో పర్యాయం రైతు సంఘాలతో కేంద్రం జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిసాయి. కాగా జనవరి 4న మరోమారు కేంద్రం చర్చలు జరపనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles