HC Justice Rajesh Kumar Sensational comments మిషన్ బిల్డఫ్ ఏపీ కేసులో న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు

Ap high court justice rajesh kumar sensational comments during mission build ap

Andhra Pradesh High Court, IAS Praveen Kumar, Mission Build AP, AP State government, Amaravati, Amaravati latest news, Andhra Pradesh, politics, crime

The Andhra Pradesh High Court Justice Rajesh Kumar Sensational comments during Mission Build AP. In an unprecedented move, the Andhra Pradesh Chief Minister, on October 6, had written to Chief Justice of India (CJI) S A Bobde alleging that the state High Court was being used to 'destabilise and topple' his democratically elected government.

మిషన్ బిల్డఫ్ ఏపీ కేసులో న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు

Posted: 12/31/2020 08:05 PM IST
Ap high court justice rajesh kumar sensational comments during mission build ap

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు సంచలనవ్యాఖ్యలు చేసింది. మిషన్ బిల్డ్ ఏపీ కేసులో సంబంధిత ఐఏఎస్ అధికారిపై ఏపీ రాష్ట్రోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలను జారీ చేసిన సందర్భంగా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులకు ఎక్కడలేని ధైర్యం వచ్చిందని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ అన్నారు. ప్రభుత్వ ఆస్తుల విక్రయం కేసులో తుది విచారణ పూర్తికాకుండానే రెక్యూసల్ పిటీషన్ వేయడాన్ని ఆయన తప్పబట్టారు.

కేసులో తుది విచారణ మొదలు కాకుండానే అవాంఛనీయ రీతిలో ప్రభుత్వం తరపున పిటిషన్ దాఖలు కావడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. డివిజన్ బెంచ్ సభ్యుడిగా ఉన్న న్యాయమూర్తిపై ఐఏఎస్ అధికారి చాలా క్రూరమైన ఆరోపణలు చేశారన్నారు. జగన్ లేఖ తర్వాత ప్రభుత్వ అధికారుల్లో ఎక్కడలేని ధైర్యం వచ్చిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇది న్యాయవ్యవస్థ పటిష్టతలను దెబ్బతీసే చర్యగానే ఆయన పేర్కోన్నారు. తీర్పులను ఆధారంగా చేసుకుని న్యాయమూర్తులను టార్గెట్ గా చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి నిర్బంధ ఆంగ్ల బోధనను ప్రవేశపెట్టే ఉత్తర్వును కోర్టు కొట్టివేసిన మరుక్షణం నుంచి హైకోర్టు పైన, ఒక న్యాయమూర్తిపైనా అశ్లీల, అభ్యంతరకర, అగౌరవమైన భాషలో సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయని జస్టిస్ రాకేశ్ కుమార్ గుర్తు చేశారు. వాటిపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సీఐడీ ఎస్పీ సారథ్యంలోని సైబర్ క్రైం విభాగానికి ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేక పోస్టులపై నిమిషాల వ్యవధిలో స్పందించే యంత్రాంగం.. న్యాయమూర్తులపై పోస్టులు పెడితే మాత్రం చర్యలు తీసుకోవడం లేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles