Farmers to decide on date of talks: Narendra Tomar ప్రభుత్వం చర్చలకు పిద్దం.. రైతు సంఘాలదే జాప్యం

We are engaging with farmers to decide on next date of talks narendra tomar

Union Minister Tomar, Narendra Singh Tomar, Farmers protest, Bharatiya Kisan Union, corporates in Agri sector, farmers protest central bill, farmers produce trade and commerce, farmers empowerment and protection bill, farmers price assurance, farmers farm services act, farmers essential commodities, Bharatiya Kisan Union, delegation of farmer leaders, Union Home Minister Amit Shah, Amit Shah farmer meeting, All India Kisan Sabha

As farmers intensified their agitation against the Centre's three farm laws and observed a day-long fast on Monday, Union Agriculture Minister Narendra Singh Tomar Monday said that the government is engaging with farmer leaders to decide on the next date of talks.

ప్రభుత్వం చర్చలకు పిద్దం.. రైతు సంఘాలదే జాప్యం: కేంద్రమంత్రి తోమర్

Posted: 12/15/2020 03:47 PM IST
We are engaging with farmers to decide on next date of talks narendra tomar

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ బిల్లులను బేషరుతుగా ఉపసంహరించుకోవాలని హస్తినలో అందోళన బాట పట్టిన రైతన్న ఇక నిరాహారదీక్షకు పిలుపునిచ్చి.. ఉద్యమాన్ని ఉదృతం చేస్తున్న క్రమంలో అటు కేంద్రం కూడా చర్చోపచర్చలు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ అనుబంధ స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్జేఎం) కూడా పలు సవరణలు చేయాలని తమ పార్లమెంటు సభ్యులను కోరింది. కేంద్రం నూతన వ్యవసాయ చట్టలాను తీసుకురావడంలో అవశ్యకత ఏమిటో వివరిస్తూ.. చట్టాలలో వున్న పలు లోపాలను సవరిస్తూ సవరణలు చేయాల్సిన అవసరం వుందని అభిప్రాయపడింది. రైతులకు కనీస మద్దతు ధర నిర్ణయించాల్సిన అవసరం వుందని పేర్కోంది.

ఇక ఇవాళ రైతు సంఘాలు తమ 19వ రోజున ఒక్కరోజు నిరాహార దీక్షకు పూనుకోవడంలో దేశవ్యాప్తంగా ఉద్యమకారులు ఎక్కడికక్కడ ధర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టారు. మరీ ముఖ్యంగా జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపట్టారు. ఇక రైతుల అందోళనలు ప్రభుత్వానికి శరాఘాతంలా పరిణమించిన క్రమంలో కేంద్ర వ్వవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇవాళ ఉదయం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు. రైతుల ఉద్యమాన్ని విరమించాలని అయితే వారితో తదుపరి చర్చలు ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై తాము చర్చించామని ఆయన తెలిపారు. రైతుసంఘాల ప్రతినిధులతో కేంద్రప్రభుత్వం చర్యలకు ఎల్లప్పుడూ సిద్దంగా వుందని అన్నారు.

అయితే రైతు సంఘాలే చర్చలు ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు. ఇప్పటికే కేంద్రప్రభుత్వం అన్ని అంశాలపై రైతు సంఘాలకు పలు ప్రతిపాదనలు పంపిందని, అయితే వాటిపై క్లాజ్ టు క్లాట్ అధ్యయనం చేసిన తరువాత రైతు సంఘాలు చర్చలకు రావాలని ఆయన కోరారు. దీంతో చర్చల్లో క్లాజ్ ల ప్రకారం చర్చ జరగాల్సిన అవశ్యకత వుందని ఆయన అన్నారు. ఇప్పటికే తమ ప్రతిపాదనలను రైతు సంఘాలకు అందజేశామని, ఇక రైతు సంఘాలే వీటిపై పునరాలోచన చేసి.. ఎప్పుడు చర్చలు నిర్వహించేది కేంద్రప్రభుత్వానికి తెలపాల్సిన అవసరం వుందని అన్నారు. కాగా చత్తిస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేఫ్ భాగేల్ మాత్రం రైతులు 22 అంశాలలో సవరణలు చేయాలంటే కేంద్రం మాత్రం కేవలం రెండు అంశాల గురించే మాట్లాడుతుందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles