CM KCR will soon go to jail: Bandi Sanjay సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు..

Bandi sanjay slams telangana cm says kcr will go to jail soon

Bandi Sanjay, BJP, Telangana CM, KCR, Delhi Tour, Kaleshwaram Project, corruption, fund diversion, New Delhi, Union Ministers, GHMC elections, Telangana, Politics

The State President of BJP Bandi Sanjay Kumar today made sensational remarks against the chief minister of the State KCR and added that the CM would soon go to jail. He made these remarks while addressing media persons in national capital New Delhi.

సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు..

Posted: 12/15/2020 02:09 PM IST
Bandi sanjay slams telangana cm says kcr will go to jail soon

సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి తెలంగాణ బీజేపికి కొత్త ఊపిరి పోసుకుంది. అసెంబ్లీ ఎన్నికలలో కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలుపోందిన తరుణంలో ఆ తరువాతే వచ్చిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపికి చెందిన నలుగురు ఎంపీలు గెలుపోందారు. దుబ్బాక ఉపఎన్నికల నుంచి జోరుమీదున్న బీజేపి.. ఇక తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికలలోనూ తన అధిపత్యాన్ని నిరూపించుకుంది. దీంతో అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఆయనపై విమర్శలను సంధించడంతో పాటు ఆయన అవినీతిపై కూడా అరోపణలు గుప్పిస్తోంది. కాలేశ్వరం ప్రాజెక్టులో డీపీఆర్ దాఖలు చేయలేదని పేర్కోంది.

తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన పర్యటనకు వెళ్లి కేంద్రమంత్రులతో పాటు ప్రధాని నరేంద్రమోడీని కలసివచ్చిన వెనువెంటనే ఢిల్లీకి వెళ్లిన బండి సంజయ్.. అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కోతలరాయుడైన కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారని తాము ముందే చెప్పామని అన్నారు. ఢిల్లీలో వంగివంగి దండాలు పెట్టినా తాము క్షమించే ప్రసక్తే లేదని చెప్పారు. కేంద్ర మంత్రులకు దండాలు పెట్టినంత మాత్రాన తాము ఆయనను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. తెలంగాణను తన సోంత జాగీరులా కేసీఆర్ ఆయన కుటుంబం భావిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను నగర ప్రజలు చావు దెబ్బ కొట్టారని సంజయ్ అన్నారు. ఈ ఓటమి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారని చెప్పారు. కేసీఆర్ బయటకు చెప్పేది ఒకటని... కానీ, లోపల జరిగేది మరొకటని అన్నారు. హైదరాబాదును వరదలు ముంచెత్తుతుంటే ఫాంహౌస్ వదిలిపెట్టి కేసీఆర్ బయటకు కూడా రాలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు తక్కువ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని చెప్పారు. కాళేశ్వరం అంచనాలను అడ్డగోలుగా పెంచారని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే... మా రాష్ట్రం, మా నిధులు అంటారని... రాష్ట్రమేమైనా మీ అయ్య జాగీరా? అంటూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles