Tough fight between NDA and MGB బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఆర్జేడీ కూటమి ముందంజ

Bitter elections tough fight between nda and mahaghatbhandan

Tejashwi Yadav, Chief Minister Nitish Kumar, Bihar assembly election 2020,Bihar election news,bihar election 2020 live updates,bihar election news live updates,bihar assembly election live news,, election meeting, BJP JDU coalition, Muzaffarpur, Bihar, Politics

The Election Commission of India Tuesday said that the significant ground is yet to be covered as only 1 crore of the total 4.10 crore votes have been counted so far and that the final result is expected to come by late tonight.

బీహార్ అసెంబ్లీ ఫలితాలు: ఎన్డీఏ-ఆర్జేడీ మధ్య నువ్వా-నేనా..!

Posted: 11/10/2020 04:14 PM IST
Bitter elections tough fight between nda and mahaghatbhandan

(Image source from: Thehindu.com)

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లెక్కింపు ప్రారంభంలో వందకు పైగా స్థానాల్లో దూసుకెళ్లిన మహాఘట్ బంధన్ ఆ తరువాత క్రమంగా అధిపత్యాన్ని చేజార్చుకుంటూ ప్రస్తుతం ఎన్డీఏ తో నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది. దీంతో అర్జేడి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ పార్టీలు విజయాన్ని చేజిక్కించుకుంటాయని వేసిన ఎగ్జిట్ పోల్ అంచనాలు కూడా తలకిందులయ్యాయి, మెజారిటీకి అవసరమైన సీట్లకన్నా కనీసం 10 నుంచి 15 అధిక సీట్లను ఆర్జేడీ నేతృత్వంలోని కూటమి సాధిస్తుందని పలు సంస్థలు అంచనాలు వేయగా, ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ ను గమనిస్తే, బీహార్ లో హంగ్ ఏర్పడే దిశగానే ఫలితాలు వెల్లడవుతున్నాయి.

పలు సంస్థలు జరిపిన ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఎన్డీయేకు ఈ సారి బీహార్ ఎన్నికలలో పరాభవం తప్పదని అంచనాలు వేసినా.. ప్రస్తుతం మాత్రం ఆ మేర ఫలితాలు రావడం లేదు. ఉదయం ఎనమిది గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ గంట తరువాత వెలువడిన అంచనాల్లోనూ మహాకూటమి పార్టీ జోరుగా వంద స్థానాలకు పైగానే దూసుకెళ్లిందిం. ఆ తరువాత పది గంటలకు 140 స్థానాల్లో తన జోరును కొనసాగించింది. అయితే క్రమంగా తమ అధిపత్యాన్ని చేజార్చుకుంటూ వచ్చిన మహాగట్ బంధన్ పార్టీలు అతిపెద్ద పార్టీగా అవతరించడంలో నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నాయి, అర్జేడీ కూటమి పార్టీలు ఘనవిజయం సాధిస్తుందన్న అంచానాలు తలకిందులయ్యాయి.

మొత్తంగా 243 స్థానాలు వున్న బీహార్ అసెంబ్లీలో 185 స్థానాల తొలి దశ కౌంటింగ్ పూర్తి కాగా, ఎన్డీయే 74 స్థానాల్లో, మహా ఘటబంధన్ 109 స్థానాల్లో ఆధిక్యంలో వున్నాయి. మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ కూడా రఘవపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన సమీప ప్రత్యర్థి బీజేపి అభ్యర్థిపై ముందంజలో కొనసాగుతున్నారు, ఎల్జేపీ ఒక్క స్థానంలో, ఇతరులు మరో స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. సీఎం తేజస్వి సోదరుడైన తేజ్ ప్రతాప్, పలువురు మహాఘట్ బంధన్ నేతలు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇదే క్రమంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి మాంఝీ కూడా అధిక్యంలో కొనసాగుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles