Assembly ByPoll results to be out today మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ లలో బీజేపి ముందంజ

Bjp leads in madhya pradesh uttar pradesh gujarat karnataka

By election result,by election result 2020,by poll election,by poll election in mp,by poll election india,by poll election results today live,election results 2020, Madhya Pradesh, Chhattisgarh, Nagaland, Uttar Pradesh, Jharkhand, Telangana, Gujarat, Odisha, live updates, latest updates, latest news, live blog, highlights

The counting of votes for by-elections in several states is on the way, The counting will decide the winners of recently held bypolls in Madhya Pradesh, Chhattisgarh, Nagaland, Uttar Pradesh, Jharkhand, Telangana, Gujarat and Odisha. BJP took a comfortable lead in 16 seats in Madhya Pradesh, while Congress is leading eight constituencies, and Bahujan Samaj Party in one.

మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ లలో బీజేపి ముందంజ

Posted: 11/10/2020 03:39 PM IST
Bjp leads in madhya pradesh uttar pradesh gujarat karnataka

(Image source from: Zeenews.india.com)

దేశంలోని 11 రాష్ట్రాలలో పలు కారణాల చేత ఖాళీ అయిన 56 అసెంబ్లీ స్థానాలు ఒక్క పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలలోని 54 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న, మణిపూర్ లోని రెండు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 7న, దీంతో పాటు బీహార్ లోని పార్లమెంటు స్థానానికి కూడా నవంబర్ 7న ఎన్నికలు జరిగాయి, కాగా ఇవాళ వెలువడుతున్న ఫలితాల్లో పలు చోట్ల బీజేపి అభ్యర్థులు ముందంజలో వున్నారు.

మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్ లో ప్రభుత్వ సుస్థిరతను నిర్ణయించేలా మారిన ఉప ఎన్నికలలో బీజేపి ముందంజలో కొనసాగుతోంది. ఇక్కడ ఈ నెల 3న పోలింగ్ నిర్వహించగా, ఏకంగా 66.37శాతం ఓట్లు నమోదయ్యాయి, ఎన్నికలు జరిగిన 28 సీట్లలో, 25 సీట్లు జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతు పలుకుతూ వెళ్లడంతో ఖాళీ అయినవే. దీంతో రాష్ట్రంలోని కమల్ నాథ్ ప్రభుత్వం మార్చిలో పతనం అయ్యింది. కాగా తాజా ఫలితాలలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 28 స్థానాల్లో 16 స్థానాల్లో బీజేపి ముందంజలో వుంది.

ఉత్తర్ ప్రదేశ్

ఉత్తర్ ప్రదేశ్ లో ఖాళీ అయిన ఏడు అసెంబ్లీ స్థానాల్లో 99 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాగా గెలుపెవరిదీ అన్న విషయం మరికోన్ని గడియల్లో ముగియనున్న కౌంటింగ్ తో తేటతెల్లం అవుతోంది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో విఫలమైందని ప్రతిపక్షాలు అరోపిస్తున్న తరుణంలో వచ్చిన ఎన్నికలలో ఓటరు తీర్పు ఎవరికి అనుకూలంగా వుందన్న విషయం తేలిపోయింది. ముఖ్యంగా హత్రాస్ మరియు బల్రాంపూర్ అత్యాచారం ఘటనల నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న భావన కలిగింది.

గుజరాత్

గుజరాత్ లో మొత్తం ఎనిమిది మంది సీట్లకు 81 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు, ఇందులో మొత్తం 18.75 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. దాదాపు 58 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూన్ లో రాజ్యసభ ఎన్నికలకు ముందే సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తరువాత ఉప ఎన్నికలకు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మలేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడటంతో ఇక్కడ ఉపఎన్నికలు వచ్చాయి.

కర్ణాటక

కర్ణాటక రాష్ట్రంలో రాజరాజేశ్వరి నగర్ అసెంబ్లీ స్థానంతో పాటు సిరా అసెంబ్లీకి నవంబర్ 3 న ఉప ఎన్నికలకు పోలింగ్ జరిగింది, ఆయా స్థానాల్లో 82.31 శాతం, 45.24 శాతం ఓటింగ్ జరిగింది. ఆగస్టులో జెడి (ఎస్) శాసనసభ్యుడు బి సత్యనారాయణ మరణించిన తరువాత సిరా ఉపఎన్నిక తప్పనిసరి కాగా, గత ఏడాది ఫిరాయింపుల వ్యతిరేక చట్టం ప్రకారం అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ మునిరత్న అనర్హత వేటు వేయడంతో ఇక్కడి ఆర్‌ఆర్ నగర్ సీటు ఖాళీగా ఉంది.

ఒడిశా

టిర్టోల్, బాలసోర్ సదర్ అసంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 3న ఉప ఎన్నికలు జరిగాయి, బిజెపి ఎమ్మెల్యే మదన్ మోహన్ దత్తా మరణం ద్వారా బాలాసోర్లో ఉప ఎన్నిక అనివార్యం కాగా, జూలైలో ప్రముఖ దళిత నాయకుడు బిజెడి బిష్ణు చరణ్ దాస్ మరణంతో టిర్టోల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది.

జార్ఖండ్

జార్ఖండ్ రాష్ట్రంలోని రెండు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 3న ఉప ఎన్నికలు జరిగాయి, డుమ్కా అసెంబ్లీ సెగ్మంట్ తో పాటు బెర్మో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి, ఈ రెండు స్థానాలకు మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాగా వీరిలో అధికార జేఎంఎం- కాంగ్రెస్ కూటమి ప్రభుత్వానికి.. ప్రతిపక్ష బిజెపికి మధ్య ప్రధాన పోటీ నెలకోనింది. ఈ ఉప ఎన్నికలలో రెండు స్థానాలకు 62.51 శాతం ఓట్టింగ్ నమోదయ్యింది.

నాగాలాండ్

నాగాలాండ్ రాష్ట్రంలోనూ రెండు అసెంబ్టీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి, కోహిమా జిల్లాలోని దక్షిణ అంగమి -1 అసెంబ్లీ నియోజకవర్గానికి, కిఫైర్ జిల్లాలోని పుంగ్రో-కిఫైర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగాయి. నాగ పీపుల్స్ ఫ్రంట్ యొక్క అప్పటి అసెంబ్లీ స్పీకర్ విఖో-ఓ యోషు, టి తోరెచుల మరణాల వల్ల ఉప ఎన్నికలు అవసరం. ఈ రెండు స్థానాల్లో 83.69 ఓటింగ్ శాతం నమోదయ్యింది.

మణిపూర్

మణిపూర్ రాష్ట్రంలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బీహార్ రాష్ట్రంలోని మూడో విడత ఎన్నికలతో పాటు మణిపూర్ లోని లిలోంగ్, వాంగ్‌జింగ్ తెంథా అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 7న ఉప ఎన్నికలు జరిగాయి. ఎన్నికల కమిషన్ మొదట్లో రాష్ట్రంలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలను "స్పష్టమైన ఖాళీగా" ప్రకటించింది, కాని ఎన్నికల షెడ్యూల్ ను కేవలం రెండు మాత్రమే ప్రకటించింది, వాంగోయ్, సైతు, సింఘాట్ల అసెంబ్లీ స్థానాలు ఖాళీగా వున్నా ఉపఎన్నికలను జరపలేదు.

తెలంగాణ

తెలంగాణలో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరిగింది, ఆగస్టులో ఆరోగ్య సమస్యల కారణంగా సిట్టింగ్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీగా వున్న ఈ స్థానంలో ఉప ఎన్నికలు జరిగాయి, అధికార టిఆర్ఎస్.. బిజెపిల మధ్య మాటల యుద్ధానికి ఈ ప్రచారం సాగినప్పటికీ, తెలంగాణలోని దుబ్బక్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో 82 శాతం పోలింగ్ నమోదైంది.

హర్యానా

హర్యానాలోని బరోడా అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో 68 శాతం పోలింగ్ నమోదైంది, ఈ స్థానంలో 14 మంది అభ్యర్థుల బరిలో నిలువగా పోటీ మాత్రం ప్రధనాంగా జాతీయ పార్టీల మధ్యే నెలకొంది. 1.81 లక్షల మంది ఓటర్లు ఉన్న బరోడా అసెంబ్లీ స్థానానికి ఒలింపియన్ రెజ్లర్, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నామినీ యోగేశ్వర్ దత్ సహా 14 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 2009, 2014, మరియు 2019 అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా మూడుసార్లు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే క్రిషన్ హుడా మరణం తరువాత ఈ సీటు ఏప్రిల్‌లో ఖాళీగా ఉంది.

బీహార్

బీహార్ లోని వాల్మీకి నగర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఈ నెల 7 న ఉప ఎన్నికల జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు వాల్మీఖీ నగర్ పార్లమెంటు స్థానానికి ఓటర్లు తమ ఓటును వేశారు. ఫిబ్రవరిలో సిట్టింగ్ జెడి (యు) ఎంపి బైద్యనాథ్ ప్రసాద్ మహ్తో మరణించిన తరువాత వాల్మీకి నగర్ స్థానానికి ఉప ఎన్నికలు వచ్చాయి. బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఉన్న వాల్మీకి నగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వాల్మికి నగర్, రాంనగర్, నార్కటియాగంజ్, బగాహా, లౌరియా, సిక్తా అసెంబ్లీ స్థానాలు వున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles