Dubbaka Bypoll: BJP wins in nail biting contest with TRS దుబ్బాకలో టీఆర్ఎస్ కు షాక్.. బీజేపి విజయం..

Dubbaka bypoll result 2020 bjps m raghunandan rao wins trs solipeta sujatha by 1470

solipeta ramalinga reddy, Harish Rao, dubbaka assembly constituency, dubbaka by poll, congress, TRS, BJP, congress, dubbaka byelection, K Chandrashekhar Rao, live election result, telangana byelection, telangana byelection result, Telangana bypoll, trs, Telangana, Politcis

The BJP won the state assembly bypoll for the Dubbaka constituency in Telangana, even though the EC is yet to announce the results officially. Though all 23 rounds of the counting were completed, the declaration of result was delayed due to glitch in four EVMs, which have 1,669 votes.

దుబ్బాక ఉపఎన్నిక: టీఆర్ఎస్ కు షాక్.. రఘునందన్ రావు విజయం

Posted: 11/10/2020 05:58 PM IST
Dubbaka bypoll result 2020 bjps m raghunandan rao wins trs solipeta sujatha by 1470

(Image source from: Twitter.com/BJP4Telangana)

తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రతిషాత్మకంగా తీసుకున్న దుబ్బాక ఉపఎన్నికలలో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగలింది. ఈ ఎన్నికలలో అహర్నిషలు కష్టపడి పోరాడినా టీఆర్ఎస్ పార్టీకి పరాభవం తప్పలేదు. ఉదయం ఎనమిది గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ లో తొలుత పొస్టల్ బ్యాలెట్లు లెక్కించగా టీఆర్ఎస్ అభ్యర్థి సొలిపేట సుజాత అధిక్యంలో నిలిచారు. ఆ తరువాత ప్రారంభమైన తొలి రౌండ్ ఎన్నికల నుంచి ప్రతి రౌండులోనూ క్రమంగా అధిపధ్యంతో దూసుకెళ్లిన రఘునందన్ రావు.. చివరాఖరున కూడా అధికార టీఆర్ఎస్ పార్టీపై 1470 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు.

అయితే ఆయన విజయాన్ని ఎన్నికల కమీషన్ అధికారికంగా ప్రకటించలేదు. నాలుగు ఈవీఎంలలో నిక్షిప్తమైన మొత్తం 1669 ఓట్లు లెక్కింపులో ఈవీఎం యంత్రాలు తెరుచుకోవడంలో మొరాయించాయి. దీంతో ఎన్నికల కమీషన్ ఇంకా విజయాన్ని ప్రకటించలేదు. అయినా ఇప్పటికే 1470 ఓట్ల మెజారిటీతో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి కన్నా ముందున్న రఘునందన్ రావు.. ఈ నాలుగు ఈవీఎం యంత్రాలలో మరో 102 ఓట్లు లభించినా విజయాన్ని అందుకున్నట్లే కావడంతో బీజేపి కార్యకర్తలు రఘునందన్ రావు విజయాన్ని సంబరంగా ఎంజాయ్ చేసుకున్నారు. దుబ్బాక అసెంబ్లీకి ఉపఎన్నికలు ప్రకటించడంతో ప్రచారపర్వంలో దూసుకుపోయిన రఘునందన్ రావు అన్ని రాజకీయ పార్టీలకన్నా ముందుగానే ప్రచారపర్వంలో సాగిపోయారు.

అయితే ఎన్నికల తేదీ సమీపిస్తున్న తరుణంలో ఆయన అనుయాయువులు తరలిస్తున్న డబ్బును ఔటర్ రింగ్ రోడ్డుపై రూ.28లక్షలను స్వాధీనం చేసుకున్నామని చెప్పిన పోలీసులు.. ఆయన మామ ఇంట్లోనూ సోదాలు చేసి డబ్బును ఇంటిలోపల పెట్టేందుకు యత్నించి.. మీడియా కెమెరాలకు చిక్కారు. దీంతో రఘునందన్ రావుపై సానుభూతి కూడా వెల్లివిరిసి.. ఓట్లుగా మారింది. దీంతో ఆయన దుబ్బాకలో విజయం సాధించారు. అదే సమయంలో రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు సంజయ్ కూడా దీక్షకు దిగడం.. ఆ తరువాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ ఘటనలపై సీరియస్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కుతగ్గింది. అయినా అధికార పార్టీ తరపున బరిలో నిలచిన సుజాత తరపున మంత్రి హరీశ్ రావు అహర్నిషలు కష్టించినా ఫలితం లభించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles