Amazon Investment Will Be Largest FDI In Telangana అమోజాన్ భారీ పెట్టుబడులు.. రీజనల్ డేటా సెంటర్ ఏర్పాటు

Amazon to invest rs 20761 cr to set up data centers in telangana

E-commerce giant Amazon, amazon, Foreign Direct Investment, fdi, investment, data centres, regional center, Amazon Web Services, asia pacific centre, business, india, economy, telangana, investment

E-commerce giant Amazon, which is a leader in cloud computing services with its AmazonWeb Services (AWS), has decided to invest a whopping Rs 20,761 crore ($ 2.77 Bn) in Telangana.

అమోజాన్ భారీ పెట్టుబడులు.. రీజనల్ డేటా సెంటర్ ఏర్పాటు

Posted: 11/06/2020 09:32 PM IST
Amazon to invest rs 20761 cr to set up data centers in telangana

(Image source from: Twitter.com/KTRTRS)

ఈ కామెర్స్ దిగ్గజ సంస్థ అమోజాన్, తన అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్ సేవల్లో (ఏడబ్యూఎస్) అగ్రగామిగా కొనసాగుతొంది. ఈ తరుణంలో ఏడబ్యూఎస్ భారత్ లోని తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దాదాపుగా 2.77 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ. 20,761 కోట్లు) పెట్టుబడులతో మల్టిపుల్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శఆఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇంతటి భారీ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేదని అన్నారు,

కాగా, ఈ ఏడాది మొదట్లో అమెజాన్ సంస్థ హైదారబాద్ లో రెండు డేటా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. వాటి కోసం రూ.11630 కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టునున్నారని కూడా వార్తలు వినిపించాయి. కానీ ఇవాళ అధికారికంగా అమెజాన్ సంస్థ ప్రకటన వెలువరించడం బహుళ డేటా కేంద్రాలను ఏర్పాటు చేయడం ఏకంగా అంచనాలకు రెట్టింపు స్థాయిలో పెట్టుబడులు పెట్టుడం రాష్ట్రానికే గర్వకారణం. హైదరాబాద్ లో మూడు అవైలబిలిటీ జోన్‌లతో (ఎజెడ్) అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీజియన్ ను ఏర్పాటు చేయడానికి సంస్థ పెట్టుబడులు పెడుతోందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

ఏడబ్యూఎస్ ఆసియా పసిఫిక్ (హైదరాబాద్) రీజియన్ కేంద్రం 2022 మధ్యకాలం నాటికి కార్యకలాపాలను ప్రారంభిస్తుందని అశాభావంతో వున్నాయి సంస్థ వర్గాలు. మల్టిపుల్ డేటా సెంటర్లతో కూడిన అవైలబిలిటీ జోన్లు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఏర్పాటు చేయనున్నారు. అయితే అవన్నీ ఒకే రిజియన్ పరిధిలో ఏర్పాటు చేయనున్నారు, ఈ డేటా సెంటర్లలన్ని వేటికవే స్వతంత్ర వ్యవస్థను కలిగి వుంటాయని తెలిపింది. వీటి శీతలీకరణ, భౌతిక భద్రతతో ఒకదానికొకటి స్వతంత్రంగా పనిచేయడానికి ఇంజనీరింగ్ చేయబడతాయి సంస్థ వర్గాలు తెలిపాయి

తెలంగాణలో అమెజాన్ భారీ ఎఫ్.డి.ఐ

 

తెలంగాణలో భారీ పెట్టుబడులతో భవిష్యత్తులో యువతకు ఉపాధికి బీజం నాటింది అమెజాన్ సంస్థ. 2022 నుంచి తమ డేటా కేంద్రాల నుంచి సర్వీసులను ప్రారంభిస్తామని సంస్థ వర్గాలు తెలిపాయి, “అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ మూడు స్థానాల్లో డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తుందని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ సంస్థ రూ. 20761 కోట్ల భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడంతో ఇదే మరిన్నీ సంస్థలకు ప్రేరణ కల్పిస్తోందని పేర్కోంది. అంతేకాకుండా భవిష్యత్తులో డేటా సెంటర్లను ఏర్పాటు చేసే ఇతర సంస్థలు తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తారని అశాభావం వ్యక్తం చేసింది, అమెజాన్ వెబ్ సర్వీసస్ వంటి డేటా సెంటర్ల స్థాపన తెలంగాణ యొక్క డిజిటల్ ఎకానమీ, ఐటి రంగానికి బహుళ రెట్లు మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. కొత్త ఏడబ్యూఎస్ ఆసియా పసిఫిక్ (హైదరాబాద్) ప్రాంతం మరింత మంది డెవలపర్లు, స్టార్టప్ లతో పాటు కేంద్రంగా మారుతుంది. రీజనల్ సెంటర్లు, డేటా సెంటర్లు స్థాపించడం వల్ల ఇ-కామర్స్, ప్రభుత్వ రంగం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు (బిఎఫ్‌ఎస్‌ఐ), ఐటి సహా మరిన్ని రంగాల కార్యకలాపాలు పెరుగుతాయని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles