Traffic cop dragged by car on bonnet to evade fine పైన్ ఎగ్గొట్టేందుకు కానిస్టేబుల్ బ్యానెట్ పైవున్నా..

Pune man drags traffic cop on car bonnet to evade fine arrested

coronavirus, mask, pune, traffic cop, COVID 19, Pimpri-Chinchwad, Chinchwad Police Station, coronavirus updates, traffic police, social media, Maharashtra, crime

In a shocking incident, an on-duty traffic policeman was dragged on the bonnet of a car in Pune after he tried to stop the car to impose fine for not wearing the mask and now the video is going viral on social media. According to the reports, the incident took place in Pimpri Chinchwad.

ITEMVIDEOS: పైన్ ఎగ్గొట్టేందుకు కానిస్టేబుల్ బ్యానెట్ పైవున్నా..

Posted: 11/06/2020 09:17 PM IST
Pune man drags traffic cop on car bonnet to evade fine arrested

(Image source from: Timesofindia.indiatimes.com)

కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో మాస్క్ రహిత ప్రయాణాలు చేస్తోన్న వారిని ట్రాఫిక్ పోలీసులు కొరడా జుళిపిస్తున్నారు. మాస్క్ పెట్టుకోకుండా ప్రయాణిస్తున్న వాహనదారుల నుంచి మహమ్మారి ఇతరులకు వ్యాప్తి చెందే ముప్పు పోంచివున్న నేపథ్యంలో వాహనదారులను అపి మరీ మాస్క్ లేని పక్షంలో జరిమానా విధిస్తున్నారు. ఈ విధులను నిర్వహిస్తున్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ కు ఓ సిగ్నల్ వద్ద మాస్క్ రహితంగా వెళ్తున్న కారును నిలువరించాడు, దీంతో యజమాని ఆగ్రహంతో ఊగిపోతూ కారును ఆపకుండా ముందుకు తీసుకుపోయాడు. ఆ సమయంలో ఆ కానిస్టేబుల్ కారు ముందే నిలబడి ఉండడంతో కారు బానెట్ పైకి ఎక్కాడు. అయినప్పటికీ, డ్రైవర్ కారును ఆపకుండా ముందుకు తీసుకెళ్లాడు.

అయితే కాసింత ముందుకెళ్లిన తరువాత అపుతాడని భావించిన కానిస్టేబుల్ బ్యాలెన్స్ చేసుకుని అలా ప్రయాణిస్తూనే వున్నాడు. అదే సమయంలో కారు యజమానితో మాట్లాడుతూ.. చాలా తప్పుచేస్తున్నారు.. ఇలా మరింత కఠినమైన శిక్షలకు అస్కారమిస్తున్నారని హితవు పలికాడు. అయినా కారును అపకుండా అలానే పోనిస్తున్నాడు యాజమాని. దీంతో ఈ దృష్యాన్ని చూసిన ఓ ద్విచక్ర వాహనదారుడు ఆ కారును అపేందుకు ప్రయత్నించాడు. కారు ముందు నెమ్మెదిగా వెళ్లబోయాడు. అయినా కారు వేగంలో మార్పు కనిపించకపోవడంతో అతను తన దారిన తాను వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మరో ద్విచక్ర వాహనదారుడు రంగంలోకి దిగాడు.

కారును వెంబడిస్తూ.. కారు అద్దంపై కొట్టడంతో పాటు యజమాని చేయిను కూడా పట్టుకునే ప్రయత్నం చేశాడు. స్పీడ్ బ్రేకర్ పై నుంచి కూడా కారు అలానే వెళ్లిన తరువాత అలానే వెంబడిస్తూ మొత్తానికి కారును ఆపగలిగాడు. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ కారు బ్యానెట్ పై నుంచి దిగి హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. ఈ లోపు కారును చుట్టుముట్టిన మిగతా వాహనదారులు కారు యజమానిని పోలీసులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు స్మార్ట్‌ఫోన్లలో వీడియో తీశారు. మహారాష్ట్రలోని పూణె, పింప్రి-చిన్చ్వాడ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నడిపిన వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనలో ట్రాఫిక్ కానిస్టేబుల్ అబాసాహెబ్ సావంత్ కాలుకి గాయమైంది.

(Video Source: Hindustan Times)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles