HC orders extension of last date for voters enrolment ఓటరు నమోదుకు గడువు పెంచండి: హైకోర్టు ఆదేశాలు

Telangana high court orders extension of graduate voters enrolment date

High Court, SEC, graduate voters enrolment, TV Ramesh, PIL, Chief Justice, Raghvendra Singh Chauhan, Justice B Vijayasen Reddy, Graduate MLC elections, Telangana

The Telangana High court ordered the EC to extend the date for the enrolment of voters for Graduate MLC elections in the view of existing coronavirus pandemic.

ఓటరు నమోదుకు గడువు పెంచండి: హైకోర్టు ఆదేశాలు

Posted: 11/06/2020 10:17 PM IST
Telangana high court orders extension of graduate voters enrolment date

తెలంగాణలో పట్టభద్రుల ఎన్నికలు ఆలస్యం కానున్నాయా.? అంటే ఔనన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభన నేపథ్యంలో వస్తున్న ఈ ఎన్నికలలో ఓటర్ల నమోదుకు కొంత అధిక సమయం కావాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యమే అందుకు కారణమయ్యింది. కరోనాతో పాటు భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలమైన నేపథ్యంలో పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను ఓటరు నమోదుకు గడువు పెంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓటరు నమోదు ప్రక్రియకు గడువును పెంచాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది టీవీ రమేశ్ పిల్ దాఖలు చేశారు.

ఓటర్ల నమోదుకు పట్టభద్రుల నియోజకవర్గాల్లో తగినంత ప్రచారం కల్పించలేదని, భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లోని ప్రజలు ఇంకా కోలుకోలేదని తన పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 7 వ తేదీ వరకు ఓటరు నమోదు ప్రక్రియను పొడిగించాలని హైకోర్టును కోరారు. ఈ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ బొల్లారం విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది. సాధారణ పరిస్థితుల్లో అయితే షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్లడం సరికావచ్చని... ప్రస్తుతం కరోనా, భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయని ధర్మాసనం తెలిపింది. ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను ఈసీ పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం తరపు న్యాయవాది అవినాశ్ దేశాయ్ తమ వాదనలను వినిపిస్తూ... అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6 మధ్య పట్టభద్రులు తమ ఓట్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని... దీని ఆధారంగా ముసాయిదా ఓటర్ల జాబితాను రూపొందిస్తామని చెప్పారు. వీటిపై అభ్యంతరాలుంటే డిసెంబర్ 1 నుంచి 31 వరకు గడువు ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం స్పందిస్తూ, పిటిషనర్ పిటిషన్ మేరకు ఓటరు నమోదుకు గడువు పెంచడంపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles